Hyderabad:విద్యార్దులపై కుక్కల దాడి..తీవ్ర గాయాలు:రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్కలు రెచ్చిపోయాయి. చిన్న బోనాల సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యార్థులపై దాడి చేశాయి. కుక్కల దాడిలో ఐదవ తరగతి విద్యార్థిని గొట్టె ముక్కుల సువర్ణ తీవ్రంగా గాయపడగా సిబ్బంది వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.
విద్యార్దులపై కుక్కల దాడి..తీవ్ర గాయాలు
రాజన్న సిరిసిల్ల
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కుక్కలు రెచ్చిపోయాయి. చిన్న బోనాల సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో విద్యార్థులపై దాడి చేశాయి. కుక్కల దాడిలో ఐదవ తరగతి విద్యార్థిని గొట్టె ముక్కుల సువర్ణ తీవ్రంగా గాయపడగా సిబ్బంది వెంటనే సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన విద్యార్థిని కుక్కల దోడిలో తీవ్రంగా గాయపడడంతో పేరెంట్స్ తో పాటు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Read also:బీజాపూర్ జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయిన 19 మంది మావోయిస్టులు
బీజాపూర్
బీజాపూర్ జిల్లా పోలీసుల ఎదుట 19 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ జితేంద్ర కుమార్ సమక్షంలో లొంగిపోయిన 19 మందిపై 29 లక్షల రివార్డులున్నాయి. లొంగిపోయిన వారంతా ఏవోబీ, పామేడ్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు. గత కొంతకాలంగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వీరు పలు విధ్వంసకర సంఘటనల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. తక్షణ ఆర్థిక సహాయం కింద లొంగిపోయిన 19 మందికి ఒక్కొక్కరికి పాతిక వేల రూపాయల చొప్పున అందజేసారు.
Read also:పోలీసులు పై రాళ్ల దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు
నందిగామ
వైకాపా కార్యకర్తలు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. పెనుగంచిప్రోలు లక్ష్మీ తిరుపతమ్మ తిరునాళ్ళలో ఘటన జరిగింది. టిడిపి, వైసిపి వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీస్ స్టేషన్ సెంటర్ లో వైసిపి ప్రభ బండ్లను ఎక్కువసేపు ఆపి, టిడిపి ఎడ్లబండ్ల ను పోలీసులు పంపడంతో ఇరువర్గాల మద్య ఘర్షణ జరిగింది. ఈ నేపధ్యయంలో వైసీపీ కార్యకర్తలు పోలీసుల పై రాళ్లదాడి చేసారు. ఒక ఏఎస్ఐ, నలుగురు కానిస్టేబుల్స్ కి తీవ్ర గాయాలుఅయ్యాయి. గాయపడ్డ వారిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Read more:Hyderabad:నల్లమలలో యురేనియం తవ్వకాలు.. అందోళనలో స్థానికులు