Hyderabad:నల్లమలలో యురేనియం తవ్వకాలు.. అందోళనలో స్థానికులు

Uranium mining in Nallamala.. locals in agitation

Hyderabad:నల్లమలలో యురేనియం తవ్వకాలు.. అందోళనలో స్థానికులు:పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య జరుగుతున్న ఒక కీలకమైన పోరాటంకు నల్లమల ప్రజలు సిద్ధమవుతున్నారు.తమ ఉనికి కే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెను ప్రమాదం పొంచివుందని స్పష్టం చేస్తున్నారు.నల్లమల అడవుల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిక్షేపాలను గుర్తించేందుకు అనుమతి ఇచ్చింది.

నల్లమలలో యురేనియం తవ్వకాలు.. అందోళనలో స్థానికులు

నల్గోండ
పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి మధ్య జరుగుతున్న ఒక కీలకమైన పోరాటంకు నల్లమల ప్రజలు సిద్ధమవుతున్నారు.తమ ఉనికి కే కాదు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పెను ప్రమాదం పొంచివుందని స్పష్టం చేస్తున్నారు.నల్లమల అడవుల్లో యురేనియం నిల్వలు ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిక్షేపాలను గుర్తించేందుకు అనుమతి ఇచ్చింది. నల్లమల అడవిలోని కుంచోని మూల నుంచి పదర వరకు మొదటి బ్లాక్లో 38 చదరపు కిలో మీటర్లు, పదర నుంచి ఉడిమిల్ల వరకు రెండో బ్లాకులో మరో 38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగు వేల బోర్లు వేసి, నమూనాలు సేకరించేందుకు భారత అణుశక్తి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు అనుమతులు రావడంతో నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ కు ఎగువభాగంలో అచ్చంపేట, అమ్రాబాద్ అటవీశాఖ అధికారులు,అణు సిబ్బంది కలిసి వారం రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించారు.

డ్రిల్లింగ్యంత్రాలు తీసుకు వచ్చేందుకు రూట్మ్యాప్ సిద్ధం చేశారు.నల్లమల అభయారణ్యం లో యురేనియం అన్వేషణ, వెలికితీత కు ప్రత్యేక హెలిక్యాప్టర్ లు రంగంలోకి దింపారు.సమీప గ్రామాల ప్రజలకు తెలియకుండానే ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆలస్యంగా తెలుసుకున్న అ ప్రాంత ప్రజలు పచ్చని అడవిలో విధ్వంసం సృష్టించొద్దంటు పోరాటానికి పిలుపు నివ్వడంతో యూరినియం నిక్షేపాల వెలికితీత అంశంకు తాత్కాలిక బ్రేక్ పడింది. నల్లమల అడవులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఇవి తూర్పు కనుమల్లో భాగం. ఇక్కడ అరుదైన వృక్ష, జంతు జాతులు ఉన్నాయి. ఈ అడవుల్లో చెంచు గిరిజనులు నివసిస్తున్నారు. ఈ అడవులు కృష్ణా నదికి నీటిని అందించే ప్రధాన వనరు. నాగార్జున సాగర్ డ్యామ్ కు ప్రధాన నీటి వనరు ఈ అడవులే. ఇక్కడ యురేనియం తవ్వకాలు జరిగితే, ఈ అడవులు, గిరిజనుల జీవనం, కృష్ణా నదిపై ఆధారపడిన లక్షలాది మంది జీవితాలు ప్రమాదంలో పడతాయి.” యురేనియం వెలికితీత ఈ ప్రాంత జీవ వైవిధ్యానికి, తెలుగు జాతికి, ప్రజల ఆరోగ్యంపై కూడా ఎన్నటికీ తీరని చేటు చేస్తుందని స్థానికుల అందోళన.

Read also:బెట్టింగ్ యాప్స్ ద్వారా 500 కోట్లు లూటీ చేస్తున్న సెలబ్రిటీస్!

హైదరాబాద్, మార్చి 18
పోలీస్ డిపార్ట్మెంట్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సెలెబ్రిటీలపై చాలా తీవ్రమైన యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే హర్ష సా, బన్నీ సన్నీ యాదవ్ వంటి వారి కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు. త్వరలోనే యాంకర్ శ్యామల, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ విష్ణు ప్రియ టేస్టీ తేజ వంటి వారిపై పోలీసులు కేసు నమోదు చేసారు. వీరితో పాటు రీతూ చౌదరి, కిరణ్ గౌడ్, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, ఇలా మొత్తం మీద 11 మంది టాప్ సెలబ్రిటీస్ పై కేసులు నమోదు చేసారు. వీరిపై త్వరలోనే కఠినమైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. చిన్న పిల్లల జీవితాలతో ఆడుకునే ఇలాంటి మహమ్మారి యాప్స్ ని ప్రమోట్ చేయడం చాలా తప్పు కదా, సెలెబ్రిటీస్ తప్పు అని తెలిసి కూడా ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటే, అందుకు కారణం డబ్బు.ఒక సినిమా లేదా ఒక సీరియల్ చేస్తే వీళ్లకు ఎన్ని కోట్లు వస్తాయో తెలియదు కానీ, బెట్టింగ్ యాప్స్ కి ప్రమోట్ చేస్తే 500 కోట్ల రూపాయిల వరకు సంపాదించుకోవచ్చు అట.

హర్ష సాయి అలా 500 కోట్ల రూపాయిల డీల్ ని రీసెంట్ గానే కుదురించుకున్నాడట. ఇతనికి యూట్యూబ్ లో కోటి మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక ఆ రేంజ్ లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయకుండా ఎందుకు ఉంటాడు చెప్పండి?, ఇవన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ దృష్టికి వెళ్లడంతో వెంటనే యాక్షన్ తీసుకోవడం మొదలు పెట్టారు. కేసు ఇలా నమోదు అయ్యింది, అలా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ రీతూ చౌదరి ‘#సే నో టూ బెట్టింగ్ యాప్స్’ అంటూ ఒక వీడియో ని చేసి అప్లోడ్ చేసింది. ముందు నుండే ఇలాంటి క్యాంపైన్స్ ఎందుకు రన్ చేయలేదు?, దెబ్బ పడితే కానీ నొప్పి తెలియలేదు అన్నమాట. ఇప్పుడు దీనిపై ఫుల్ నెగటివ్ క్యాంపైన్ నడుస్తుంది కాబట్టి, ఎవ్వరూ చేయడం లేదు, భవిష్యత్తులో వేడి తగ్గిన తర్వాత మళ్ళీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయరని గ్యారంటీ ఏమిటి. డబ్బు మనిషి చేత ఎలాంటి పనిని అయినా చేయిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసుల చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం

Read more:Andhra Pradesh:పవన్, లోకేశ్ కు కీలక బాధ్యతలు

Related posts

Leave a Comment