Andhra Pradesh:పురమిత్రలో యాప్‌తో ఎన్నో ప్రయోజ‌నాలు, అందుబాటులో 150 పౌరసేవలు

Many benefits with the Puramitra app, 150 civic services available

Andhra Pradesh:పురమిత్రలో యాప్‌తో ఎన్నో ప్రయోజ‌నాలు, అందుబాటులో 150 పౌరసేవలు:రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం ప్రజ‌ల‌కు సేవ‌లందించేందుకు కొత్త అన్వేష‌ణ‌లు చేస్తోంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనే పౌరసేవ‌ల‌ను అందిస్తుంది. మరోవైపు రాష్ట్ర పుర‌పాల‌క మంత్రిత్వ శాఖ ప్రజ‌ల‌కు సేవ‌ల‌ను అందించేందుకు “పుర మిత్ర” యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప‌ట్టణ ప్రాంతాల్లో ఉండేవారు పౌర సేవ‌ల‌ను సులువుగా పొందేందుకు యాప్ ఉప‌యోగ ప‌డుతుంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క మంత్రిత్వ శాఖ చెబుతోంది.

పురమిత్రలో యాప్‌తో ఎన్నో ప్రయోజ‌నాలు,
అందుబాటులో 150 పౌరసేవలు

కాకినాడ, మార్చి 18
రాష్ట్రంలో కూట‌మి ప్రభుత్వం ప్రజ‌ల‌కు సేవ‌లందించేందుకు కొత్త అన్వేష‌ణ‌లు చేస్తోంది. ఇప్పటికే వాట్సాప్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనే పౌరసేవ‌ల‌ను అందిస్తుంది. మరోవైపు రాష్ట్ర పుర‌పాల‌క మంత్రిత్వ శాఖ ప్రజ‌ల‌కు సేవ‌ల‌ను అందించేందుకు “పుర మిత్ర” యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప‌ట్టణ ప్రాంతాల్లో ఉండేవారు పౌర సేవ‌ల‌ను సులువుగా పొందేందుకు యాప్ ఉప‌యోగ ప‌డుతుంద‌ని రాష్ట్ర పుర‌పాల‌క మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఈ యాప్‌తో ప్రజ‌ల‌కు స‌మ‌యం ఆదా అవుతుంది.రాష్ట్రంలోని 95 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో 17 మున్సిపల్ కార్పొరేష‌న్లు, 78 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆయా పట్టణాల్లో ఉండే ప్రజ‌లు పౌర సేవల కోసం మున్సిపల్ కార్యాల‌యాల చుట్టూ రోజుల త‌ర‌బ‌డి తిర‌గాల్సి వ‌చ్చేది. గంటల త‌ర‌బ‌డి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వ‌చ్చేది. అయితే గ‌త వైసీపీ ప్రభుత్వ హ‌యంలో స‌చివాల‌యాలు ఏర్పాటు త‌రువాత, మున్సిపల్ కార్యాల‌యాల చుట్టూ తిరిగే వారి శాతం త‌గ్గింది. ఏ అవ‌స‌రం వ‌చ్చిన త‌మ స‌చివాల‌యానికి వెళ్లి ప‌నిచేసుకునేవారు. ప్రజ‌ల‌కు అది కాస్త ఉప‌శ‌మ‌నంగానే ఉండేది. అయితే కూట‌మి ప్రభుత్వం వ‌చ్చిన త‌రువాత డిజిట‌ల్ సేవ‌ల‌ను విస్తృతం చేసేందుకు సిద్ధప‌డింది.

మున్సిప‌ల్ కార్యాల‌యాల‌కు, గ్రామ స‌చివాలయాల‌కు రోజుల త‌ర‌బ‌డి తిర‌గాల్సిన ప‌నిలేకుండా, గంట‌ల త‌ర‌బ‌డి ప‌డిగాపులు కాయాల్సిన అవ‌స‌రం లేకుండా ఇంట్లో ఉండే అన్ని సేవ‌లను పొందే విధంగా రాష్ట్ర పుర‌పాల‌క మంత్రిత్వ శాఖ కొత్త యాప్‌ను తీసుకొచ్చింది. “పుర మిత్ర” యాప్ ఇక నుంచి ప్రజ‌ల‌కు పౌర సేవ‌ల‌ను అందించ‌నుంది. ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాల‌జీతో రూపొందించిన ఈ యాప్‌లో ప‌లు సేవ‌లు పొందే వీలు క‌ల్పించింది.తమ స‌మ‌స్యను రోజుల వ్యవ‌ధిలోనే పరిష్కారం అయ్యేలా అధికారులు చ‌ర్యలు తీసుకుంటారు. స‌మ‌స్యను పంపేందుకు యాప్‌లో ఫీచ‌ర్స్ కూడా పొందుప‌రిచారు. మ‌న చుట్టూ ఉన్న స‌మ‌స్యను ఫోటో తీసి, వాయిస్ రికార్డుతో అక్షరాలను టైప్ చేసి పంపించే విధంగా యాప్‌ను త‌యారు చేశారు. పంపిన స‌మ‌స్య, ఆ స‌మాచారం నేరుగా సంబంధిత విభాగాధికారికి వెళ్తుంది. ప‌రిష్కారం చూసేందుకు క‌నీసం మూడు నుంచి 15 రోజులు, లేదా 30 రోజుల వ్యవ‌ధి నిర్ణయించారు. స‌మ‌స్య తీవ్రత‌ను బ‌ట్టీ ఆయా రోజుల్లోపు ప‌రిష్కారం చేస్తారు.రెవెన్యూ, ప్రజారోగ్యం, టౌన్ ప్లానింగ్‌, ఇంజినీరింగ్‌, అకౌంట్స్‌, అడ్మినిస్ట్రేష‌న్ ఇలా 150 ర‌కాల పౌర సేవ‌లు “పుర మిత్ర” యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

పన్ను చెల్లింపులు, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, వివాహ ధ్రువీకరణ పత్రాలు ఇలా అన్ని చెల్లింపులు ఇందులోనే చేసుకునే అవ‌కాశం ఉంది. ఈ యాప్ ద్వారా రాష్ట్రంలో ఏ మున్సిపాల్టీలోనైనా కంటికి క‌నిపించిన స‌మ‌స్యను ప‌రిష్కారం చేసుకోవ‌చ్చు. కావాల్సిన సేవ‌ల‌ను పొంద‌వ‌చ్చు. మ‌నం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల‌కు ప్రయాణాలు చేసేట‌ప్పుడు ఆయా ప‌ట్టణాల్లో ఉన్న స‌మ‌స్యను కూడా యాప్ ద్వారా ఫిర్యాదు చేసే సౌల‌భ్యం ఉంది.ఆ స‌మ‌స్య ప‌రిష్కారానికి సంబంధించి మ‌న‌కు తెలియ‌జేస్తారు. సంబంధిత అధికారి గ‌డువులోగా స‌మ‌స్య ప‌రిష్కరించాలి. ప‌రిష్కారం అయిన ఫోటోను యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు యాప్‌లో స‌మ‌స్య పురోగ‌తి తెలుసుకునేందుకు వీలు క‌ల్పించారు. అధికారి సందించ‌క‌పోతే, పై స్థాయి అధికారికి వెళ్లి, చివ‌రికి బిహ్యాండ్ ఎస్ఎల్‌లోకి వెళ్లి ఆ అధికారిని బాధ్యుడిగా చేస్తుంది.”పుర మిత్ర” యాప్‌ను ప్లేస్టోర్‌లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ త‌రువాత దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అప్పుడు ఓపెన్ బ‌ట‌న్‌ను క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. అందులో వివిధ ఫీచ‌ర్స్ ఉంటాయి. తెలుగులోనే ఉంటుంది. క‌నుక యాప్ ఉప‌యోగించ‌డం చాలా సులువు. ప్ర‌తి ఒక్క‌రూ యాప్‌ను ఉప‌యోగించే విధంగా డిజైన్ చేశారు. అలాగే స‌మ‌స్యల ప‌రిష్కారాల‌పై అభిప్రాయాలు కూడా తీసుకుంటారు.

Read more:Andhra Pradesh:గుంటూరు వైసీపీలో ప్రత్యేక కుంపట్లు

Related posts

Leave a Comment