Hyderabad:సస్పెన్షన్ కు విరుగుడు మంత్రం.. వ్యూహాల్లో గులాబీ నేతలు

Hyderabad

Hyderabad:సస్పెన్షన్ కు విరుగుడు మంత్రం.. వ్యూహాల్లో గులాబీ నేతలు:అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి.. స్పీకర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. చివరికి ఆయన సస్పెన్షన్‌కు దారి తీశాయి. ప్రజా సమస్యలపై గౌరవప్రదమైన చర్చ చేయాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. హద్దులు దాటి మాట్లాడారు. ముఖ్యంగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యకమయ్యాయి. కాంగ్రెస్ నేతలు ఆయన మాటలపై మండిపడ్డారు. స్పీకర్ స్థానానికి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ కడిగిపాడేశారు.

సస్పెన్షన్ కు విరుగుడు మంత్రం..
వ్యూహాల్లో గులాబీ నేతలు

హైదరాబాద్, మార్చి 15
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి.. స్పీకర్‌పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. చివరికి ఆయన సస్పెన్షన్‌కు దారి తీశాయి. ప్రజా సమస్యలపై గౌరవప్రదమైన చర్చ చేయాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. హద్దులు దాటి మాట్లాడారు. ముఖ్యంగా ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వ్యకమయ్యాయి. కాంగ్రెస్ నేతలు ఆయన మాటలపై మండిపడ్డారు. స్పీకర్ స్థానానికి ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ కడిగిపాడేశారు. మీడియాలో కూడా దీనిపై గట్టిగానే చర్చ జరిగింది. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌పై కవిత, కేటీఆర్, హరీష్ రావులు సచివాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసనలు వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారాన్ని డైవర్ట్ చెయ్యాలని ప్రయత్నించారు. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది.జగదీశ్ రెడ్డి తమ పార్టీ నేత కాబట్టి.. తప్పని పరిస్థితుల్లో మద్దుతుగా నిలవాల్సి వచ్చిందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. పైగా.. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సైతం అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. జగదీశ్ రెడ్డికి క్లాస్ పీకారని సమాచారం. ఇకపై నోరు జాగ్రత్త.. బేకారు మాటలు వద్దని హెచ్చరించారని తెలిసింది. కేవలం ఒక్క రోజు మాత్రమే సభకు హాజరైన కేసీఆర్.. మున్ముందు జరిగే సమావేశాలకు కూడా హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పకుండా హాజరు కావాల్సి ఉంటుంది.

ఇలాంటి సమయంలో ఒక సెషన్ మొత్తానికి జగదీష్ రెడ్డి సస్పెండ్ కావడమనేది బీఆర్ఎస్‌కు మింగుడు పడని విషయం.అసెంబ్లీ సమావేశాలకు ముందు కేసీఆర్ ప్రత్యేకంగా బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆయన ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో జగదీశ్ రెడ్డితో ఆ వ్యాఖ్యలు కేసీఆరే చేయించి ఉంటారని కాంగ్రెస్ నేతలు సందేహిస్తున్నారు. ఆయన వ్యాఖ్యల వివాదం అటు తిరిగి ఇటు తిరిగి కేసీఆర్‌కు తగలడంతో పార్టీ శ్రేణులు తలలు పట్టుకుంటున్నాయి. అందుకే, ఆయన సస్పెన్షన్ విషయంపై నిరసనలు ఆపేసినట్లు తెలుస్తోంది. పైగా హోలీ సందడిలో వారి నిరసనలు పట్టించుకొనేవారు కూడా ఎవరూ లేరని, అందుకే మళ్లీ అసెంబ్లీ సమావేశాల టైమ్‌లోనే నిరసనలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.అయితే బీఆర్ఎస్ దగ్గర ఉన్న మరో ఆప్షన్.. సస్పెన్షన్ అంశాన్ని రాజకీయం చెయ్యడం. దీనిపై వారు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. అలాగే సభలో మిగతా ఎమ్మెల్యేలతో కూడా అలాగే మాట్లాడించి సస్పెండ్ అయ్యేలా వ్యూహం రచిస్తుందా? లేదా అక్కడితో ఆ మ్యాటర్ వదిలేస్తుందా అనేది చూడాలి. అయితే, ఈ విషయాన్ని అక్కడితో వదిలేస్తే జగదీశ్ రెడ్డి తప్పు చేశారని బీఆర్ఎస్ అంగీకరించినట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన మాటల గురించి కాకుండా.. కేవలం సస్పెన్షన్ విషయాన్నే హైలెట్ చేస్తూ నిరసనలకు దిగే అవకాశం ఉంది. మరి దీనిపై కేసీఆర్ వ్యూహం ఏ విధంగా ఉంటుందో చూడాలి. సస్పెన్షన్‌పై నిరసన? లేదా సైలెన్సా అనేది చూడాల్సి ఉంది.

Read also:కోట్లు ఖర్చు పెడుతున్నా.. జాడ ఏదీ

మహబూబ్ నగర్, మార్చి 15
శ్రీశైలం ఎడమ కాల్వ టన్నెల్ ప్రమాదంలో కార్మికుల జాడ తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మృతదేహల కోసం రెస్క్యూ ఆపరేషన్ నేటికి 21వ రోజుకు చేరుకుంది. ఏడుగురు మృతదేహాలను వెతికేందుకు నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ప్రభుత్వం రోజుకు రెస్క్యూ ఆపరేషన్ కు వినియోగించే రోబోల కోసం నాలుగు కోట్ల రూపాయలు వ్యయం చేస్తుంది. కేరళ నుంచి కడావర్ డాగ్స్ ను తెప్పించడం నుంచి రోబోలను తెప్పించి అన్వేషణ చేస్తున్నారు. మట్టి, బురద తవ్వకాలకు ఆటంకంగా మారింది. సొరంగంలో రెండు రోబోలు పనిచేస్తున్నాయి. కడావర్ డాగ్స్ గుర్తించిన డీ2, డీ1 పాయింట్లమధ్య పన్నెండు మీటర్ల దూరం ఉందని సహాయక బృందాలుత ెలిపాయి. ఈ ప్రాంతంలోనే టీబీఎం మిషన్ కూలిపోయింది. పైకప్పు విరిగిపడింది. ఈ ప్రాంతంలోనే మృతదేహాలు ఉంటాయని కడావర్ డాగ్స్ గుర్తించడంతో అక్కడ తవ్వకాలు జరిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నారు. టీబీఎం మిషన్ ను కట్ చేస్తున్నారు. ఆ శిధిలాలను తొలగించి బయటకు తీసుకు రావడం కూడా కష్టంగా మారడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది దీంతో పాటు కార్మికుల మృతదేహాలున్న చోట మాత్రం ప్రమాదకరమైన పరిస్థితులున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

అక్కడకు వెళ్లాలంటే రిస్క్ తో కూడుకున్న వ్యవహారమని అంటున్నారు. అందుకే ఆచితూచి అడుగులు వేస్తున్నామని, అక్కడ హోలో స్పేస్ లో ఖాళీగా ఉన్న ప్రదేశంలోనే కార్మికుల మృతదేహాలున్నట్లు అంచనాకు వచ్చిన సహాయక బృందాలు అక్కడకు వెళ్లేందుకు రెండు రోబోలను ఉపయోగిస్తున్నాయి. షిప్ట్ లలో నిరంతరం పన్నెండు సహాయక బృందాలు పనిచేస్తున్నప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో తదుపరి చర్యలపై చర్చలు జరుపుతున్నారు.ప్రధానంగా.. కేరళ కెడావర్‌ డాగ్స్‌ గుర్తించిన డీ-1, డీ-2 ప్రాంతాల్లో తవ్వకాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మాన్యువల్ డిగ్గింగ్‌కు బదులుగా ఆటానమస్ హైడ్రాలిక్ పవర్డు రోబోలను వాడుతున్నారు. ఈ రోబో మోడ్రన్‌ టెక్నాలజీతో టన్నెల్ లోపల డిగ్గింగ్ ప్రక్రియ నిర్వహించనుంది.డిగ్గింగ్ ప్రక్రియలో ఏర్పడే మట్టిని వేగంగా బయటకు తీయడానికి సహాయపడతాయి. గంటకు 620 క్యూబిక్ మీటర్ల బురదతో కూడిన మట్టిని కన్వేయర్ బెల్ట్ ద్వారా తరలించనున్నారు అధికారులు.

ఈ అటానమస్ హైడ్రాలిక్ పవర్డ్‌ రోబోకు అనుసంధానంగా ప్రత్యేకమైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. 30 హార్స్‌ పవర్‌ సామర్థ్యం గల లిక్విడ్ రింగ్ వాక్యూమ్ పంపు, వాక్యూమ్ ట్యాంకుతో కూడిన మెషిన్‌లను కూడా టన్నెల్‌ లోపలికి పంపారు. ఈ యంత్రాలు మట్టిని త్వరగా తొలగించేందుకు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. మరోవైపు.. సహాయక చర్యలకు అడ్డుగా నిలిచిన టీబీఎం వెనక భాగాన్ని గ్యాస్ కట్టర్లు, ప్మాస్లా కట్టర్లు, అల్ట్రా ధర్మల్ కట్టర్లో కత్తిరించి ఎప్పటికప్పుడు ఆ భాగాన్ని లోకో ట్రైన్ ద్వారా బయటకు పంపుతున్నారు.ఇక.. ఫిబ్రవరి 22న టన్నెల్‌లో ప్రమాదం జరగ్గా 8 మంది చిక్కుకుపోయారు. 16వ రోజున టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్ గురు ప్రీత్ సింగ్ మృతదేహాన్ని మాత్రమే వెలికి తీశారు. పార్ధివ దేహాన్ని పంజాబ్లోని వారి కుటుంబ సభ్యులకు సైతం అప్పగించారు. మిగిలిన ఏడుగురి కోసం రెస్క్యూ ఆపరేషన్‌ కంటిన్యూ అవుతోంది. ఏడుగురి కార్మికుల జాడ కనిపెట్టేందుకు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 12 రకాల సహాయక బృందాలు నిత్యం శ్రమిస్తూనే ఉన్నాయి.

Read more:Hyderabad:ప్రతిపక్ష పాత్ర పోషించే ఉద్దేశ్యం లేదా

Related posts

Leave a Comment