Hyderabad:ప్రతిపక్ష పాత్ర పోషించే ఉద్దేశ్యం లేదా:అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తానని పార్టీ వర్గాలతో చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అసెంబ్లీకి డుమ్మాకొట్టారు… రెండు సార్లు పవర్‌లో ఉన్నప్పుడు అసెంబ్లీలో విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన గులాబీ బాస్.. ఇప్పుడు ప్రతిపక్షనేత పాత్ర పోషించడానికి వెనకాడుతున్నారు .. గత బడ్జెట్ సమావేశాల్లో వ్యహరించినట్లు ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం రోజు హాజరు వేయించుకుని వెళ్లిపోయారు.. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.
ప్రతిపక్ష పాత్ర పోషించే ఉద్దేశ్యం లేదా..
హైదరాబాద్, మార్చి 15
అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తానని పార్టీ వర్గాలతో చెప్పిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అసెంబ్లీకి డుమ్మాకొట్టారు… రెండు సార్లు పవర్‌లో ఉన్నప్పుడు అసెంబ్లీలో విపక్షాలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించిన గులాబీ బాస్.. ఇప్పుడు ప్రతిపక్షనేత పాత్ర పోషించడానికి వెనకాడుతున్నారు .. గత బడ్జెట్ సమావేశాల్లో వ్యహరించినట్లు ఈ సారి కూడా గవర్నర్ ప్రసంగం రోజు హాజరు వేయించుకుని వెళ్లిపోయారు.. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్షనేత హోదాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారా? లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవల బీఆర్ఎస్ వర్గాల ముందు ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని కేసీఆర్ ప్రకటించినట్లు ప్రచారం జరిగింది.. దానికి తగ్గట్లేఅసెంబ్లీ సమావేశాల ముందు రోజు కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చారు..సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చిన కేసీఆర్….అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించారు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై తనపార్టీ సభ్యులకు కేసీఆర్ దిశా నిర్ధేశం చేశారంట.దాంతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయినప్పటి నుంచి కేసీఆర్‌పైనే అందరి దృష్టి పడింది. అనుకున్నట్లే సభకు హాజరైన గులాబీబాస్ గవర్నర్ ప్రసంగం రోజున సభలో కనిపించారు. ఆరు నెలల తర్వాత సభకు వచ్చిన కేసీఆర్ …ప్రతిపక్ష నేత హోదాలో బీఏసీ సమావేశానికి హాజరుకాలేదు..రెండవరోజు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం జరిగినా కేసీఆర్ డుమ్మా కొట్టడం చర్చినీయంశంగా మారింది.
ఆ క్రమంలో సభా ప్రాంగణంలో ఎవరిని కదిపినా కేసీఆర్ అసెంబ్లీ హాజరుపైనే చర్చ నడుస్తుంది.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగేటప్పుడు.. బీఆర్‌ఎస్ తరఫున కేసీఆర్ మాట్లాడతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆయన అసలు అసెంబ్లీకే హాజరుకాలేదు. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక తొలి శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు తుంటికి గాయం కారణంగా ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ సభకు హాజరుకాలేదు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అసెంబ్లీకి వచ్చి వెళ్లిన ఆయన గత ఏడాది బడ్జెట్ సమావేశాల్లో కూడా ఒక్క రోజు హాజరు వేయించుకుని వెళ్లిపోయారు. ఆయన ఈ సారి బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్నారని పెద్దఎత్తున బీఆర్‌ఎస్ వర్గాలు ప్రచారం చేశాయి. కానీ సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి హాజరై.. రెండోరోజు సభకు రాకుండా ఆయన ముఖం చాటేశారు. అయితే ఈనెల 19న బడ్జెట్ ప్రవేశ పెట్టే సందర్భంగా కేసీఆర్ సభకు వచ్చే అవకాశాలున్నాయని బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తమకు ఈ సారి అధికారం కట్టబట్టలేదనే కోపంతో కేసీఆర్ జనాలపై అలుగుతున్నారని పలువురు విమర్శిస్తున్నారు. గెలుపు ఓటములు సహజమని.. ఇప్పటి నుంచే ఆయన ప్రజా సమస్యలపై గళం విప్పితే.. జనం హర్షిస్తారని సూచిస్తున్నారు.ముఖ్యమంత్రి సహా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కేసీఆర్ ను అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని…డిమాండ్ చేస్తూనే ఉన్నారు. కేవలం అసెంబ్లీకి రాకుంటే స్పీకర్ చర్యలు తీసుకుంటారన్న భయంతో ఆరు నెలలకు ఒక సారి వచ్చి వెళ్లడం తప్ప .. ఆయనకు సభలో ప్రతిపక్ష నేత పాత్ర పోషించే ఉద్దేశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా జీతభత్యాలు పొందుతూ అసెంబ్లీకి రావడం లేదంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ , అసెంబ్లీ సెక్రటరీకి హస్తం పార్టీ నేతలు ఫిర్యాదు చేసే వరకు వచ్చింది పరిస్థితి. ఆయినా ఆయన తిరిగి అసెంబ్లీకి డుమ్మా కొట్టడం అటు పొలిటికల్ సర్కిల్స్‌తో పాటు పబ్లిక్‌లోనూ విమర్శలపాలవుతోంది.
Read also:రాములమ్మ దూకుడు షురూ..
హైదరాబాద్, మార్చి 15
రాజకీయాల్లో శాశ్వత శత్రవులు, శాశ్వత మిత్రులు వుండరు. ప్రస్తుత రాజకీయాల్లో ఎవరు, ఎప్పుడు ఏ పార్టీ వైపు మారుతారో చెప్పడం కష్టమే. అలా ఉన్నాయి రాజకీయాలు కూడా. కేవలం తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. కాకపోతే తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.తెలంగాణ కాంగ్రెస్‌లో ఫైర్ బ్రాండ్ విజయశాంతి. దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆమె పదవి అందుకున్నారు. అంతకుముందు టీఆర్ఎస్ తరపున మెదక్ నుంచి ఎంపీగా గెలుపొందారు. మారిన రాజకీయాల నేపథ్యంలో గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో అడుగుపెట్టారు. స్టార్ క్యాంపెయిన్‌గా చాలా నియోజకవర్గాలను తిరిగారు. ఎమ్మల్యే కోటాలో ఆమెకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది కాంగ్రెస్.రాములమ్మ సేవలు ఎమ్మెల్సీగా కాకుండా మరింత విస్తృతం చేయాలని పార్టీ పెద్దలు ఆలోచన చేస్తున్నారట. ఈ క్రమంలో విజయశాంతికి హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు ఓ వార్త హంగామా చేస్తోంది. రేవంత్ కేబినెట్‌లో చోటు కల్పించబోతున్నట్టు తెలుస్తోంది. కేబినెట్‌లోకి తీసుకున్న తర్వాత ఆమెకి ఏ పదవి ఇస్తారనే దానిపై రకరకాలుగా ప్రచారం సాగుతోంది.రేవంత్ కేబినెట్‌లో దాదాపు ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏడాదిగా వాటిని భర్తీ చేస్తారని ప్రచారం సాగింది. ఇప్పటివరకు పెండింగ్‌లో పడుతూ వస్తోంది. కేబినెట్ విస్తరణలో రాములమ్మతోపాటు మిగతా నేతలకు పదవులు ఇస్తారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విజయశాంతికి మంత్రి పదవిని ఇవ్వడం ద్వారా పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని హైకమాండ్ లెక్కలు వేస్తోంది.ఏకగ్రీవంగా విజయశాంతి ఎన్నికైనట్టు ప్రకటించగానే గురువారం సాయంత్రం మీడియా ముందుకు వచ్చేశారు విజయశాంతి.
బీజేపీతోపాటు బీఆర్ఎస్‌పై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ ఏం చేసింది.. గతంలో కేసీఆర్ ఏమి చేశారు? మొత్తం గుట్టు విప్పి బయటపెట్టారు. ఈ రెండు పార్టీలకు తాను సేవలు అందించానని, సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే పార్టీ నుంచి బయటకు రావాల్సి వచ్చిందన్నారు. తాను ఎమ్మెల్సీ అయినందుకు ఎందుకు బాధపడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు.ప్రస్తుతం రాములమ్మ వ్యవహారశైలిని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆమె మాట్లాడిన ప్రతీ మాటను గమనిస్తున్నారు. గతంలో జరిగిన విషయాలు ఆమె బయట పెట్టడంతో ప్రస్తుతానికి ఆ పార్టీ నేతలు నోరు మెదపలేదు. ఎందుకంటే గతంలో ఏం జరిగిందో ఇప్పుడున్న నేతల్లో కొంతమంది మాత్రమే తెలుసు.అసెంబ్లీ సమావేశాల తర్వాత పార్టీ నేతలతో సమావేశం కావాలని నిర్ణయించారట కేసీఆర్. దీనిపై ఆ పార్టీ నుంచి ఓ ఫీలర్ బయటకు వచ్చింది. విజయశాంతికి ఏ విధంగా చెక్ పెట్టాలని దానిపై వ్యూహ రచన చేస్తున్నారట. ఆమెని కంట్రోల్ చేయకుంటే పార్టీకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాది సీఎం రేవంత్‌రెడ్డి దూకుడుగా వెళ్లారు. సెకండ్ ఇయర్ రాములమ్మ వంతు కానుంది. జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్నారు కారు పార్టీ నేతలు. ఈమెని ఎదుర్కోవడం అంత ఈజీ కాదన్న రీసౌండ్ కారు పార్టీలో అప్పుడే మొదలైపోయింది. మొత్తానికి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
Read more:Andhra Pradesh:పెళ్లి కోసం నానా తంటాలు కులాంతర వివాహాలకు యత్నాలు