Hyderabad:సన్నాఫ్ లీడర్స్.. రాజకీయాలు

Hyderabad

Hyderabad:సన్నాఫ్ లీడర్స్.. రాజకీయాలు:తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశాయి. పార్టీ అధినేతల మాట కన్నా వారి కుమారుల మాటే చెల్లుబాటు అయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నుంచి ముగ్గురిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అలాగే తెలంగాణలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలోనూ అదే జరిగిందంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ మాటనెగ్గిందని చెబుతున్నారు.

సన్నాఫ్ లీడర్స్.. రాజకీయాలు

హైదరాబాద్, మార్చి 15
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక విషయాన్ని మాత్రం స్పష్టం చేశాయి. పార్టీ అధినేతల మాట కన్నా వారి కుమారుల మాటే చెల్లుబాటు అయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నుంచి ముగ్గురిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. అలాగే తెలంగాణలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలోనూ అదే జరిగిందంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ మాటనెగ్గిందని చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇద్దరు యువనేతలు ఇప్పుడు పార్టీలను శాసిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వంలో కీలకంగానూ వ్యవహరించారు.ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో లోకేశ్, కేటీఆర్ లు తండ్రుల నిర్ణయాలను కాకుండా తాము అనుకున్న వారికే ఎమ్మెల్సీ టిక్కెట్లు తెప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు.ఆంధ్రప్రదేశ్ లో మూడు ఎమ్మెల్సీ పోస్టులకు కాను తెలుగుదేశం పార్టీలో ముప్ఫయి మంది వరకూ పోటీ పడ్డారు. అందులో సీనియర్ నేతలున్నారు. గత ఎన్నికల్లో పార్టీ నిర్ణయాన్ని శిరసావహసించి టిక్కెట్లు రాకపోయినా పార్టీ విజయం కోసం పనిచేసిన వారు కూడా ఉన్నారు. దేవినేని ఉమామహేశ్వరరావు, వర్మ, వంగవీటి రాధా ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాంతాడంత ఉంది. అయితే చివరకు ఎమ్మెల్సీగా నిన్న మొన్నటి వరకూ ఉన్న బీటీ నాయుడుకు తిరిగి పదవి రెన్యువల్ చేశారు.

అయితే నెల్లూరు జిల్లాకు చెందిన బీద రవిచంద్ర, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కావలి గ్రీష్మ పేర్లుతెరపైకి రావడం వెనక లోకేశ్ ఉన్నారని పార్టీలో చెబుతున్నారు. బీద రవిచంద్ర తొలినుంచి పార్టీకి మద్దతుదారుగా ఉండటం, లోకేశ్ కు సన్నిహితుడిగా ముద్రపడటం వంటివి బలమయ్యాయి. గ్రీష్మ కూడా మహానాడులో చేసిన ప్రసంగం కూడా ఆమెకు పదవి తెచ్చిపెట్టాయంటున్నారు. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ ఇదే జరిగిందంటున్నారు. పార్టీలో కేసీఆర్ నిర్ణయాలకు తిరుగుండదు. అయితే ఎమ్మెల్సీ ఎంపికలో కేటీఆర్ తన మాట చెల్లాల్సిందేనని పట్టుబట్టారని తెలిసింది. తమకున్న బలాన్ని బట్టి ఒకే ఒక స్థానం దక్కుతుంది. అయితే మహమూద్ ఆలి, సత్యవతి రాథోడ్ పేర్లను కేసీఆర్ పరిశీలించారు. రెండు సామాజికవర్గాలు బలమైనవి కావడంతో వారిలో ఒకరికి ఇవ్వాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. ఈ విషయాన్ని బయటకు కూడా చెప్పారట. అయితే కేటీఆర్ మాత్రం తన సన్నిహితుడు దాసోజు శ్రావణ్ కు ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టి మరీ తెప్పించుకున్నారని తెలిసింది. దాసోజు శ్రావణ్ పేరును గతంలో గవర్నర్ తిరస్కరించడంతో ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. దీంతో శ్రావణ్ కు ఇవ్వాల్సిందేనని గట్టిగా కేటీఆర్ కూర్చుని మరీ తన సన్నిహితుడికి టిక్కెట్ తెప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల్లో తనయుల ప్రభావం ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో జరిగిందంటున్నారు.

Read more:Andhra Pradesh:ఆందోళనలో పరిటాల ఫ్యాన్స్

Related posts

Leave a Comment