Hyderabad:సర్కారీ స్కూళ్లలో ఏఐ

AI in government schools

Hyderabad:సర్కారీ స్కూళ్లలో ఏఐ:తెలంగాణ రాష్ర్టంలోని అన్ని జిల్లాలలో ఎంపిక చేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 15 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) ఏ.ఐ ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ ఈ విషయమై జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకటించారు.

సర్కారీ స్కూళ్లలో ఏఐ

హైదరాబాద్, మార్చి 14
తెలంగాణ రాష్ర్టంలోని అన్ని జిల్లాలలో ఎంపిక చేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఈనెల 15 నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) ఏ.ఐ ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టారు. విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ ఈ విషయమై జిల్లా కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో ప్రకటించారు. పాఠ‌శాల‌ విద్యార్థుల‌ ప‌రిజ్ఞానం, నైపుణ్యం పెరిగేందుకు చేస్తున్న ప్ర‌యత్నాల‌లో భాగంగా రాష్ట్రంలోని స‌ర్కార్ బ‌డుల్లో విద్యార్థుల పఠన సామర్థ్యాలను పెంచేందుకు ఏఐ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్య‌ను అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరిలో సర్కార్ బడిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్య బోధన చేసేందుకు గతంలో పైలెట్ ప్రాజెక్టు కింద 6 జిల్లాలో ప్రారంభించారు. వాటిలో..మెదక్ జిల్లాలో బూర్గుపల్లి, మాసాయిపేట , నిజాంపేట,తూప్రాన్, కాళ్లకల్, నర్సాపూర్, మండల పరిషత్ ప్రైమరీ స్కూల్స్ఎంపికయ్యాయి. భద్రాద్రి జిల్లాలో హన్మాన్బస్తీ, కేటీపీఎస్ కాలనీ, వికలాంగుల కాలనీ, తాతగుడిసెంటర్, పాలకొయ్య తండా, ఓల్డ్ కొత్తగూడెం ప్రైమరీ స్కూల్, ఖమ్మం జిల్లాలో ఎన్ఎస్ సీ ఖమ్మం, మల్లెమడుగు, పాండురంగాపురం, సత్తుపల్లి, సింగారెడ్డిపాలెం, రాజేంద్రనగర్ ప్రైమరీ స్కూల్స్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో జనతానగర్, కొంపల్లి, ప్రగతి నగర్, మల్లాపూర్, ఎల్లమ్మ బండ, బహదూర్పల్లి, నారాయణపేట్జిల్లాలో గూడె బెల్లూర్, ముడుమల్, కొల్లంపల్లె, దామరగిద్ద, కర్ని, శివాజీ నగర్, వికారాబాద్ జిల్లాలో ఓల్డ్తాండూరు(తెలుగు మీడియం), దౌల్తాబాద్, కొట్బాస్పల్లి, రేగడ్మేల్వేర్, మల్కాపూర్గని, తాండూర్(ఉర్దూ మీడియం) స్కూళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్య‌ను అందించే ప్రోగ్రామ్ అమలైంది.

అది మంచి ఫలితాలు ఇచ్చినందున రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే 3 నుంచి 5వ తరగతి విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలు, అభ్యాస సామర్థ్యాలు పెంపొందించేందుకు ప్రతి జిల్లాలో కొన్ని ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయడం జరిగింది. ఆయా జిల్లాల్లో ముందస్తుగా ఎంపిక చేసిన పాఠశాలల్లో వెనుకబడిన విద్యార్థులకు ఏ.ఐ వినియోగిస్తూ సులభతరంగా విద్యా బోధన చేయాలని నిర్ణయించారు. ఏ.ఐ. కోర్సు ద్వారా విద్యార్థులకు బోధన చేసేందుకు వీలుగా ప్రతి పాఠశాలలో ఐదు కంప్యూటర్లు, అవసరమైన ఇంటర్నెట్ కనెక్షన్, హెడ్ ఫోన్స్ ఇతర సామాగ్రి అందుబాటులో ఉండేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కార్యదర్శి సూచించారు. జిల్లాలో ముందుగా ఎంపిక చేసిన పాఠశాలలో ఏ ఏ కోర్సు ద్వారా విద్య బోధన జరుగుతుందని, ఇక్కడ వచ్చే ఫలితాలను అంచనా వేస్తూ భవిష్యత్తులో దీన్ని మరింత విస్తరించి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.ఇక ఏఐ ద్వారా విద్యార్థి సామర్థ్యం పెంపొందించే విషయంలో ఏఐ ముఖ్య భూమిక పోషించనుంది. వారి సామర్థ్యం మెరుగుపరిచే విధానంలో ఏఐ ఎంతగానో ఉపయోగపడనుంది.
మార్చిలో మండుతున్న ఎండలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో ఉష్ణోగ్రతలు క్రమంగా 40 డిగ్రీలకు చేరువలో ఉన్నాయి.తెలంగాణలోని ఆదిలాబాద్‌లో గురువారం అత్యధిక ఉష్ణోగ్రత నమోదయింది. సాధారణం కన్నా ఏకంగా 4.4 డిగ్రీలు పెరిగి.. 40.3 డిగ్రీలుగా నమోదయింది. బుధవారం రాత్రి కనిష్ఠ ఉష్ణోగ్రత కూడా సాధారణం కన్నా 2 డిగ్రీలు పెరిగి 22.7 డిగ్రీలుగా నమోదయ్యాయి. నిజామాబాద్‌లో పగటిపూట సాధారణం కన్నా 3.2 డిగ్రీలు పెరిగి 40.1 డిగ్రీలు నమోదయింది.ఖమ్మంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా 2.9 డిగ్రీలు అధికంగా పెరిగింది. మరో వైపు శుక్ర, శని, ఆదివారాల్లో రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రకటించింది.ఆంధ్రప్రదేశ్‌లోని రెంటచింతలలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పల్నాడు జిల్లా రెంటచింతలలో ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. గురువారం రెంటచింతలలో గరిష్ఠ ఉష్ణోగ్రత 42.8 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 28.4 డిగ్రీలుగా నమోదు అయ్యాయి.

ఏటా రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటైన రెంట చింతలలో ఎండలకు ప్రజలు హడలిపోతు న్నారు. గతంలో రెంటచింతలలో గరిష్ట ఉష్ణోగ్రత 49 డిగ్రీలకుపైగా నమోదయ్యాయి. ఈ ఏడాది ముందస్తు హెచ్చరికలతో జనం బెంబేలెత్తి పోతున్నారు.హిందూ మహా సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో వాతావరణంలో వేడిగాలులు పెరిగాయి. ఉపరితల ఆవర్తనం దిశగా ఎడారి నుంచి పొడిగాలులు వాయువ్య, మధ్య, దక్షిణ భారతం మీదుగా వీస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో అనేకచోట్ల వేడి వాతావరణం నెలకొంది. ప్రధానంగా ఉత్తర కోస్తాలోని అనేక ప్రాంతాల్లో గురువారం వడగాడ్పులు వీచాయి.ఈ ఏడాది వేసవి సీజన్లో తొలిసారిగా రాష్ట్రంలో పలుచోట్ల 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమో దయ్యాయి. నంద్యాలలో 40.2, అనంతపురం, నందిగామల్లో 40.1, జంగమహేశ్వరపురంలో 39.9. తునిలో 39.5 డిగ్రీలు నమోద య్యాయి. ఈనెల 16వ తేదీ వరకు కోస్తాలో అనేక ప్రాంతాల్లో వడగా డ్పులు వీస్తాయని, రాయలసీమలో వేడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Read more:Hyderabad:బై బ్యాక్ స్కీం పేరుతో భారీ మోసం.

Related posts

Leave a Comment