Hyderabad:బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి

LRS subsidy should be utilized.

Hyderabad:బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి:వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ P రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల. రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ “విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు.

బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలి..

ఏబీవీపీ
హైదరాబాద్
వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశ పెట్టబోయే రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి 15% నిధులు కేటాయించాలని ఏబీవీపీ P రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల. రాంబాబు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ “విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని,అధిక నిధులు కేటాయించి విద్యారంగ అభివృద్ధి కి కృషి చేస్తామని అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ విద్యారంగంపై సవితితల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. గత సంవత్సర బడ్జెట్ లో కేవలం 7% నిధులే కేటాయించిందని వాటిని కూడా పూర్తిగా విడుదల చేయలేదన్నారు. చిన్న రాష్ట్రాలైన ఈశాన్య రాష్ట్రాల్లో సైతం వాటి బడ్జెట్లో 12-13% నిధులు కేటాయిస్తుంటే మన రాష్ట్రంలో అరకొర నిధులు కేటాయించడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో 90% మంది విద్యార్థులు BC,SC,ST బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులేనని,వారందరూ కూడా ఫీ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ మీద ఆధారపడి విద్యను అభ్యశిస్తున్నారన్నారు.కానీ ఈ ప్రభుత్వం సుమారు 8000 కోట్ల రూపాయలు పెండింగ్ లో పెట్టి పేద వర్గాల విద్యార్థులను విద్యకు దూరం చేస్తున్నదని అన్నారు.

ఎల్ఆర్ఎస్ రాయితీని వినియోగించుకోవాలి
సిద్దిపేట
ఎల్ అర్ ఎస్ ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 25% రాయితీని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరీ జిల్లా ప్రజలను కోరారు.
బుధవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో అన్ని మున్సిపాలిటీల కమిషనర్లు, తహశీల్దార్, ఎంపీఓ, ఎంపీడీఓ, మరియు లేఔట్ యజమానులతో అందరితో నిర్వహించిన ఎల్ అర్ ఎస్ -2020 పైన అవగాహన సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎల్ అర్ ఎస్ రుసుముపై 25% తగ్గింపు రాయితీ ప్రకటించటం జరిగినది కావునా ఇట్టి తగ్గింపు రాయితీ 1- 3-2025 నుండి 31 మార్చి, 2025 వరకు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 2020 సంవత్సరములో ఎల్ ఆర్ఎస్, కోసం దరఖాస్తు చేసుకున్న ప్లాటు యజమానులు 31-03-2025 లోగా 25% రాయితీ సద్వినియోగం చేసుకొని పూర్తి ఫీజు చెల్లించాలని సూచించారు. సాంకేతికత సమస్యలు ఎదురైతే పరిష్కరించుకోవాలని తెలిపారు. ప్రోహిబిషన్ ల్యాండ్, గవర్నమెంట్, ఎండోమెంట్, ఇరిగేషన్ ల్యాండ్ లలో లే అవుట్ ఉన్నవి చెక్ చేసుకోవాలని అధికారుల కు తెలిపారు. ముందుగా లే అవుట్ యజమానులకు ఎల్ అర్ ఎస్ ప్రక్రియ లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న నివృత్తిచేసుకోవాలని, మీ దగ్గర విక్రహించిన ప్లాట్ యజమానులకు ఎల్ అర్ ఎస్ తప్పనిసరి గా చేయించుకునేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలొ డీపీఓ దేవకీదేవి, డిటిసిపీఓ వందనం తదితరులు పాల్గొన్నారు.
Read more:Hyderabad:విదేశాల్లో విద్యకు సమాచారం

Related posts

Leave a Comment