Hyderabad:విదేశాల్లో విద్యకు సమాచారం:విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అక్కడి యూనివర్సిటీల్లోని విద్య, ఉపాధితో పాటు పలు రకాల సమాచారం కోసం ఏఐఆర్సీ(అసోసియేషన్ ఆఫ్ ఇంట్నేషనల్ ఎన్రోల్మెంట్ మేనేజ్మెంట్) సంస్థతో సిఫియా(కన్సార్టియం ఆఫ్ ఫారెన్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్) ఒప్పందం దోహదం చేస్తుందని సిఫియా అధ్యక్షుడు శేఖర్ భూపతి అన్నారు.
విదేశాల్లో విద్యకు సమాచారం
హైదరాబాద్
విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు అక్కడి యూనివర్సిటీల్లోని విద్య, ఉపాధితో పాటు పలు రకాల సమాచారం కోసం ఏఐఆర్సీ(అసోసియేషన్ ఆఫ్ ఇంట్నేషనల్ ఎన్రోల్మెంట్ మేనేజ్మెంట్) సంస్థతో సిఫియా(కన్సార్టియం ఆఫ్ ఫారెన్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్) ఒప్పందం దోహదం చేస్తుందని సిఫియా అధ్యక్షుడు శేఖర్ భూపతి అన్నారు. బంజారాహిల్స్‌లోని తాజ్దక్కన్ హోటల్లో ప్రపంచ వ్యాప్తంగా 450 సంస్థలతో అనుబంధం కలిగిన అమెరికాకు చెందిన ఏఐఆర్సీ సంస్థతో కన్సార్టియం ఆఫ్ ఫారెన్ ఎడ్యుకేషన్ అడ్వైజర్స్ సంస్థ ఒప్పందాన్ని కుదర్చుకుంది. ఈ ఒప్పందం వల్ల విద్యార్థులకు అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లోని యూనివర్సిటీల్లో విద్యార్థుల ఏం కోరుకుంటున్నారో, ఎటువంటి కోర్సులు అవసరం అవుతున్నాయో అక్కడి యూనివర్సిటీ ప్రతినిధులు, ప్రభుత్వాలతో చర్చించేందుకు అవకాశం ఉంటుందని వారు తెలిపారు.
చాలా మంది సోషల్ మీడియాలో కొన్ని కనీస సమాచారం లేని న్యూస్ ఛానెల్స్ చూసి విద్యార్థులు వారి తల్లిదండ్రులు అపోహ చెందుతున్నారని వారందరి ప్రశ్నలకు సమాధానంగా ఈ వేదిక పని చేస్తుందని ఏఐఆర్సీ ఈడీ డాక్టర్ క్లే హార్మన్ తెలిపారు. అమెరికాలో ఇప్పుడు యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఉన్న రూల్స్ కొత్తవేవి కాదని అవి గతంలో కూడా ఉన్నవేనని కానీ కొంత మంది అవేవే ట్రంప్ వచ్చిన తర్వాత పెట్టినట్లు ప్రచారం చేస్తున్నారని అది కరెక్టు కాదని వారు అన్నారు. గతంలో పోలిస్తే ఇప్పుడు విదేశాల్లో చదువుకునే విద్యార్థులు సంఖ్య అంతకంతకు పెరుగుతున్నదని అందులోనూ హైదరాబాద్ విద్యార్థుల సంఖ్య ఇంకా పెరుగుతున్నదని అన్నారు. వీసా పొందడంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి సరైన అవగాహన కల్పించి వీసా పొందేలా చేయడంలో ఆయా ఏజెన్సీలు కృషి చేయాలని వారికి పూర్తి అవగాహన ఉంటే వీసా పొందండం పెద్ద కష్టమేమి కాదని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఆర్సీ అధ్యక్షుడు డాక్టర్ రాబర్ట్ సమ్మర్స్ సిఫియా ఉపాధ్యక్షుడు సూర్య గణేష్ వాల్మీకి, సెక్రటరీ నవీన్ యాతపు, జాయింట్ సెక్రటరీ, గ్లోబల్ ట్రీ వ్యవస్థాపకులు శుభకర్ ఆలపాటి తదితరులు పాల్గొన్నారు.
Read more:Andhra Pradesh:భారతదేశంలో మహిళకు సముచిత గౌరవం – విజయ భారతి, ఎన్హెచ్ఆర్సి సభ్యురాలు