Hyderabad:రీల్ స్టార్ గా జగ్గన్న

Jagganna as a reel star

Hyderabad:రీల్ స్టార్ గా జగ్గన్న:తెలంగాణ కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి ఓ విలక్షణ నేత. పాలిటిక్స్‌లో జగ్గారెడ్డి రూటే సెపరేటు. ఆయన ఏం మాట్లాడినా పాలిటిక్స్‌లో హాట్ టాఫిక్‌ అవుతుంది. ప్రత్యర్థులతో పాటు కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నేతలపై మాటల తూటాలు పేల్చుతుంటారు. పొలిటికల్‌గా హల్‌చల్ చేసే జగ్గారెడ్డి ఆల్ ఆఫ్ సడెన్‌ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.

రీల్ స్టార్ గా జగ్గన్న

మెదక్, మార్చి 11
తెలంగాణ కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి ఓ విలక్షణ నేత. పాలిటిక్స్‌లో జగ్గారెడ్డి రూటే సెపరేటు. ఆయన ఏం మాట్లాడినా పాలిటిక్స్‌లో హాట్ టాఫిక్‌ అవుతుంది. ప్రత్యర్థులతో పాటు కొన్ని సందర్భాల్లో సొంత పార్టీ నేతలపై మాటల తూటాలు పేల్చుతుంటారు. పొలిటికల్‌గా హల్‌చల్ చేసే జగ్గారెడ్డి ఆల్ ఆఫ్ సడెన్‌ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఇలా డిసైడ్ అయ్యారో లేదో అప్పుడే పోస్టర్ కూడా రిలీజ్ చేసేశారు. పొలిటికల్ టాపిక్స్‌తో నిత్యం వార్తల్లో నిలిచే జగ్గారెడ్డి లైఫ్‌ స్టైల్‌ కాస్త డిఫరెంట్‌ అనే చెప్పొచ్చు. తూర్పు జయప్రకాశ్‌రెడ్డి అలియాస్‌ జగ్గారెడ్డి. సీనియర్‌ మోస్ట్‌ లీడర్. వైఎస్‌ హయాం నుంచి ఇప్పుడు రేవంత్ పీరియడ్‌ వరకు జగ్గారెడ్డి పొలిటికల్ స్టైలే వేరు. ఆయన మాట తీరే సెపరేటు. రాష్ట్రస్థాయిలో ఏ పోస్టులో ఉన్నా సంగారెడ్డిలో జగ్గన్న హల్‌ చల్‌ మాత్రం మామూలుగా ఉండదు. ఏ పండుగ, పబ్బం వచ్చినా ఆర్థికంగా చెప్పుకోదగ్గ ధనవంతుడు కాకపోయినా లక్షలు దారబోసి ఉత్సవాలు చేస్తుంటారు. నార్మల్ పబ్లిక్‌తో కలిసి సంబరాల్లో తానే ముందుంటారు.బోనాలు అయినా.. దసరా ఉత్సవాలను హోరెత్తిస్తారు. శివరాత్రి పర్వదినాన జాగారం, పూజలు, రాత్రిపూట సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. స్వయంగా శివభక్తుడైన జగ్గారెడ్డి..పాటలు పాడుతూ భక్తిపారవశ్యంలో మునిగిపోతారు. రంజాన్ సందర్భంగా తన నియోజకవర్గంలోని ముస్లింలకు ఇచ్చే ఇఫ్తార్ విందు గురించి మాటల్లో చెప్పలేము… అంత గ్రాండ్‌గా ఏర్పాట్లు ఉంటాయి.

ఇలా ప్రతీ విషయంలో జగ్గారెడ్డి అంటే ఒక రేంజ్‌లో హడావిడి ఉంటుంది. ఇలా పొలిటికల్‌ లీడర్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు తన మార్క్‌ స్టైల్‌తో పబ్లిక్‌ను ఆకట్టుకుంటారు జగ్గన్న.అయితే ఇన్నిరోజులు పొలిటికల్‌ స్క్రీన్‌ మీద తన హవా భావాలు పలికించిన జగ్గారెడ్డి..ఇప్పుడు వెండితెర మీద కనిపించాలని ఉవ్విళ్లూరుతున్నారు. త్వరలో సినిమాల్లోకి రానున్నట్లు ప్రకటించేశారు జగ్గన్న. అతి త్వరలో ఒక ప్రేమ కథ చిత్రంలో ప్రత్యేక పాత్ర పోషించనున్నట్లు ఆఫ్ ది రికార్డ్‌‌లో చెప్పారు. సినిమాలో మాఫియాను ఎదురించి ఆడపిల్ల పెళ్ళి చేసే వ్యక్తి పాత్రను పోషించాబోతున్నారట జగ్గారెడ్డి.ఈ మధ్య ఓ వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఒక కథ ఉందని చెప్పారంటున్నారు. ఆ కథలో తన పాత్ర ఉందని అని చెప్పడంతో..నటించేందుకు ఓకే చెప్పారట జగ్గన్న. ఈ కథలో తన ఒరిజినల్ క్యారక్టర్ కూడా ఉండబోతుందని అంటున్నారు జగ్గారెడ్డి. ఈ ఉగాదికి సినిమా కథ విని..వచ్చే ఉగాదికి సినిమా పూర్తి చేస్తామని అంటూనే..పనిలో పనిగా పీసీసీ చీఫ్‌, సీఎం అనుమతి తీసుకొని నటిస్తానంటూ..అప్పుడే పర్ఫామెన్స్ స్టార్ట్‌ చేశారు జగ్గారెడ్డి. ఇక సినిమా పేరును కూడా ప్రకటించేసిన ఆయన..జగ్గారెడ్డి ఎ వార్ ఆఫ్ లవ్ అనే టైటిల్‌‌తో మూవీ వస్తున్నట్లు చెప్పుకొచ్చారు.రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండే జగ్గారెడ్డి..ఎవరికి అంత ఈజీగా టచ్‌లోకి రారు. ఎవరికి ఫోన్‌లో అందుబాటులోకి రారు. ఆయన మాట్లాడాలనుకుంటేనే ఎవరికైనా టచ్‌లోకి వెళ్తుంటారు. ఇప్పుడు సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న జగ్గారెడ్డి..ఎంట్రీ కూడా ఓ లెవల్‌లో ఉంటుందన్న చర్చ జరుగుతోంది. జగ్గారెడ్డి..ది వార్ ఆఫ్ లవ్ అంటూ సినిమా ఎలా ఉండబోతుందనేది చెప్పకనే చెప్పారు. సినిమా పూర్తిగా తన నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని.. సినిమాలో లవ్ ఎపిసోడ్ ఉంటుందంటున్నారు జగ్గారెడ్డి. సినిమాలో అనేక అంశాలు ఉంటాయని చెబుతున్నారు

Read more:Hyderabad:పర్యాటకం.. ఐదవ స్థానంలో తెలంగాణ

Related posts

Leave a Comment