Warangal:వరంగల్ లో గోల్డ్ లోన్ ఏటీఎం:అర్జెంటుగా డబ్బులు అవసరం పడితే చాలా మంది బ్యాంకులో గోల్డో లోన్ తీసుకుంటుంటారు. బ్యాంకుకు వెళ్లి తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటుంటారు. అయితే ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. ముందుగా బ్యాంకుకు వెళితే.. అక్కడున్న గోల్డ్ అప్రైజర్ మన బంగారాన్ని తనిఖీ చేస్తాడు. ఎన్ని క్యారెట్లు.. ఎంత బరువుంది.. ఆ రోజు ధర ఎంతో లెక్కగట్టి బ్యాంకు అధికారులకు చెబుతారు. అప్రైజర్ ఇచ్చే రిపోర్టు ఆధారంగానే బ్యాంకులు గోల్డ్ లోన్ మంజూరు చేస్తాయి.
వరంగల్ లో గోల్డ్ లోన్ ఏటీఎం
వరంగల్, మార్చి 10
అర్జెంటుగా డబ్బులు అవసరం పడితే చాలా మంది బ్యాంకులో గోల్డో లోన్ తీసుకుంటుంటారు. బ్యాంకుకు వెళ్లి తమ వద్ద ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటుంటారు. అయితే ఇది కొంచెం టైం టేకెన్ ప్రాసెస్. ముందుగా బ్యాంకుకు వెళితే.. అక్కడున్న గోల్డ్ అప్రైజర్ మన బంగారాన్ని తనిఖీ చేస్తాడు. ఎన్ని క్యారెట్లు.. ఎంత బరువుంది.. ఆ రోజు ధర ఎంతో లెక్కగట్టి బ్యాంకు అధికారులకు చెబుతారు. అప్రైజర్ ఇచ్చే రిపోర్టు ఆధారంగానే బ్యాంకులు గోల్డ్ లోన్ మంజూరు చేస్తాయి. ఆ తర్వాత బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి. ఈ ప్రాసెస్ జరగటానికి కొన్ని సార్లు రోజు మెుత్తం పట్టే ఛాన్సు ఉంటుంది.ఇక నుంచి ఆ టెన్షన్ అక్కర్లేదు. నిమిషాల వ్యవధిలోనే బంగారంపై గోల్డ్ లోన్ పొందొచ్చు. ఈ మేరకు గోల్డ్‌లోన్ ఏటీఎంలు అందుబాటులోకి వచ్చాయి. సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో ఈ గోల్డ్ లోన్ ఏటీఎం ప్రారంభించారు. దేశంలోనే తొలిసారి ప్రయోగాత్మకంగా వరంగల్‌లో గోల్డ్ లోన్ ఏటీఎం అందుబాటులోకి తీసుకొచ్చినట్లు బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఎంవీరావు తెలిపారు. ఈ గోల్డ్ లోన్ ఏటీఎం ద్వారా చాలా సులభంగా లోన్ తీసుకోవచ్చునని చెప్పారు. ఈ యంత్రం వల్ల బ్యాంకు సిబ్బందికి, అలాగే ఖాతాదారుడికి సమయం ఆదా అవుతుందని అన్నారు. వరంగల్ నగరంలో విజయవంతమైతే దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
ఎలా పని చేస్తుందంటే..?
కొత్తగా ప్రారంభించిన గోల్డ్‌లోన్ ఏటీఎం ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్) సాంకేతికతతో రూపొందించారు.
కేవలం 10 నుంచి 12 నిమిషాల్లోనే ఆధార్ కార్డు, మొబైల్ నంబరు ఆధారంగా ఏటీఎం సాయంతో గోల్డ్‌లోన్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
లోన్ కావాలనుకునేవారు బ్యాంకు అకౌంట్ వివరాలు, ఆధార్ కార్డు నెంబర్, మెుబైల్ నెంబర్ ఏటీఎం మిషన్ అడిగే ఆప్షన్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
ఆ తర్వాత బంగారు ఆభరణాలు మిషన్‌లోని బాక్సులో వేయాలి.
ఏఐ టెక్నాలజీ ద్వారా బంగారం నాణ్యత, బరువును, ఆరోజు ఉన్న మార్కెట్ ధరను లెక్క కడుతుంది. దాని ప్రకారమే చెల్లింపులు ఉంటాయి.
పై ప్రక్రియ పూర్తయిన తర్వాత గోల్డ్‌లోన్ ఏటీఎం ద్వారా 10 శాతం డబ్బులు వెంటనే తీసుకోవచ్చు.
మిగతా నగదును ఖాతాదారుడి అకౌంట్‌లో జమ అవుతాయి.
ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఖాతాదారలకు మాత్రమే గోల్డ్‌లోన్ ఏటీఎం ద్వారా లోన్లు తీసుకునే ఛాన్స్ ఉంది.
Read more:Warangal:అడ్డగోలుగా ఎర్రమట్టి తవ్వకాలు