Naga babu:నాగబాబుకు 50 లక్షలుపైగా అప్పులు:టాలీవుడ్ నటుడు నాగబాబు గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఈయన ఒకప్పుడు సినిమాల్లో కీలకపాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇటీవల రాజకీయాల్లో బిజీగా ఉంటున్నాడు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నాడు. తమ్ముడిని ఎవరైన ఏదైనా అంటే అస్సలు ఊరుకోడు. సోషల్ మీడియా వేదికగా కడిగిపడేస్తాడు. నిత్యం ఏదొక విషయం పై మాట్లాడుతూ వార్తల్లో హైలెట్ అవుతున్నాడు.
నాగబాబుకు 50 లక్షలుపైగా అప్పులు
ఏలూరు, మార్చి 10
టాలీవుడ్ నటుడు నాగబాబు గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఈయన ఒకప్పుడు సినిమాల్లో కీలకపాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇటీవల రాజకీయాల్లో బిజీగా ఉంటున్నాడు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నాడు. తమ్ముడిని ఎవరైన ఏదైనా అంటే అస్సలు ఊరుకోడు. సోషల్ మీడియా వేదికగా కడిగిపడేస్తాడు. నిత్యం ఏదొక విషయం పై మాట్లాడుతూ వార్తల్లో హైలెట్ అవుతున్నాడు. తాజాగా ఈయన ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచాడు. ఈ సందర్భంగా ఆయన తన ఆస్తుల వివరాలను బయట. అయితే అందులో చిరంజీవికి పవన్ కళ్యాణ్ కి అప్పు ఉన్నట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది..ఆయన తనపై ఎటువంటి క్రిమినల్ కేసులు లేవని చెప్పాడు. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, ఆయన వద్ద మ్యూచువల్ ఫండ్స్, బాండ్ల రూపంలో మొత్తం రూ. 55.37 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. నాగబాబు చేతిలో ప్రస్తుతం రూ. 21.81 లక్షల నగదు ఉండగా, బ్యాంకుల్లో రూ. 23.53 లక్షలు డిపాజిట్‌గా ఉన్నట్లు తెలిపారు. అలాగే, ఇతరులకు రూ. 1.03 కోట్లు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు. ఆయన వద్ద రూ. 67.28 లక్షల విలువైన బెంజ్ కారు, రూ. 11.04 లక్షల విలువైన హ్యుందాయ్ కారు ఉన్నాయని వివరించారు. నాగబాబు తన వద్ద రూ. 18.10 లక్షల విలువైన 226 గ్రాముల బంగారం, రూ. 16.50 లక్షల విలువైన 55 క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా, ఆయన భార్య వద్ద రూ. 57.9 లక్షల విలువైన 724 గ్రాముల బంగారం, రూ. 21.40 లక్షల విలువైన 20 కేజీల వెండి ఉన్నాయని తెలిపారు. మొత్తం రూ. 59.12 కోట్ల చరాస్తులు ఉన్నాయని తెలిపారు..అదే విధంగా భూమి వివరాలు కూడా పొందుపరిచారు.. రంగారెడ్డి జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో రూ. 3.55 కోట్ల విలువైన 2.39 ఎకరాల భూమి, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో రూ. 32.80 లక్షల విలువైన 3.28 ఎకరాలు ఉన్నాయని తెలిపారు.. అలాగే మరో రూ. 50 లక్షల విలువైన 5 ఎకరాల భూమి, రంగారెడ్డి జిల్లా టేకులపల్లిలో రూ. 53.50 లక్షల విలువైన 1.07 ఎకరాల భూమి ఉన్నట్లు పేర్కొన్నారు.హైదరాబాద్ మణికొండలో రూ. 2.88 కోట్ల విలువైన 460 చదరపు అడుగుల రెసిడెన్షియల్ విల్లా కలిగి ఉన్నట్టు పేర్కొన్నాడు. వాటి విలువ 11 కోట్ల వరకు ఉంటుందని ఆయన అన్నారు. ఆస్తుల విషయంతో పాటుగా అప్పులు ఉన్నట్లు తెలిపాడు. చిరంజీవి నుంచి రూ. 28.48 లక్షలు, తమ్ముడు పవన్ కల్యాణ్ నుంచి రూ. 6.9 లక్షల రుణం తీసుకున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. బ్యాంకుల్లో కూడా అప్పులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది.. మరి ఈయన ఎన్నికల్లో పోటీ చేసి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.. పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతమైన రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఇక నాగబాబు అన్న చిరంజీవి సినిమాల్లో బిజీగా ఉన్నారు.
Read more:Andhra Pradesh:తండ్రా బాటలోనే మోచ్యూర్డ్.. రాటు దేలుతున్న లోకేష్