Hyderabad:బీజేపికి స్పేస్ ఇచ్చిన మండలి ఎన్నికలు ఉత్తర తెలంగాణలో పట్టు నిలుపుకున్న కమలం:తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓవైపు అెధికార కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నువ్వా – నేనా అన్నట్లు డైలాగ్ వార్ నడుస్తూ వస్తోంది. కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నాటి నుంచి సీన్ లోకి బీజేపీ వచ్చేసింది. సందర్భాన్ని బట్టి కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది.
బీజేపికి స్పేస్ ఇచ్చిన మండలి ఎన్నికలు
ఉత్తర తెలంగాణలో పట్టు నిలుపుకున్న కమలం
నిజామాబాద్, మార్చి 8
తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఓవైపు అెధికార కాంగ్రెస్, మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నువ్వా – నేనా అన్నట్లు డైలాగ్ వార్ నడుస్తూ వస్తోంది. కట్ చేస్తే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల నాటి నుంచి సీన్ లోకి బీజేపీ వచ్చేసింది. సందర్భాన్ని బట్టి కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటి…రాబోయే రోజుల్లో తమకు తిరుగు ఉండబోదన్న సందేశాన్ని ప్రత్యర్థి పార్టీలకు పంపే ప్రయత్నం చేసిందిఇటీవలే తెలంగాణలో మూడు స్థానాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు(2 టీచర్, 1 గ్రాడ్యుయేట్) జరిగాయి. అయితే ఉత్తర తెలంగాణ పరిధిలో జరిగిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. టీచర్ల ఓట్లను తమ వైపునకు ఆకర్షించటంతో పాటు, కీలకమైన గ్రాడ్యుయేట్ ఎన్నికలోనూ జెండా ఎగరవేసింది. తద్వారా… 2 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో 8 సీట్లు గెలిచి చరిత్ర సృష్టించిన కమలం పార్టీ, తాజాగా 2 ఎమ్మెల్సీలను ఖాతాలో వేసుకోవటం కీలక పరిణామంగా మారింది. అంతేకాదు… రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు బూస్ట్ దొరికినట్లు అయింది. ఇక ఈ విజయంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వానికి… తెలంగాణపై మరింత ఆశలు పెంచుకునేలా చేసింది.తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చామని. గతంలో ఏ ప్రభుత్వం చేయని విదంగా తమ పాలన ఉందంటూ మంత్రులు, నేతలు చెబుతూ వస్తున్నారు.
కట్ చేస్తే తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గట్టి షాకే తగిలింది. టీచర్ స్థానాలను పక్కనపెడితే గ్రాడ్యుయేట్ స్థానాన్ని అత్యంత సీరియస్ గా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని భావించింది. కానీ ఫలితం మాత్రం మరోలా వచ్చింది. పలువురు మంత్రులే కాకుండా స్వయంగా ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహించినప్పటికీ… సిట్టింగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కోల్పోయింది. ఈ ఫలితాలతో ఓ రకంగా హస్తం పార్టీకి గట్టి షాకే తగిలినట్లు అయింది.అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవటం కాంగ్రెస్ పార్టీకి కాస్త ఇబ్బందికరమైన పరిణామమనే చెప్పొచ్చు. వచ్చిన ఏడాదిలోపే 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెబుతున్నప్పటికీ పట్టభద్రులు తీర్పు మరోలా వచ్చింది. జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఇస్తామని ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్నామని ప్రచారం చేసినప్పటికీ. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలైంది. దీని బట్టి చూస్తే క్షేత్రస్థాయిలో వారు అనుకున్నంత సానుకూలత కనిపించటం లేదన్న విషయం స్పష్టమవుతోంది. మూడో స్థానంలో నిలిచిన బీఎస్పీ అభ్యర్థికి భారీగా ఓట్లు వచ్చాయి. ఇందులో మెజార్టీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లేనన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన ప్రసన్న కుమార్(బీఎస్పీ) రెండో ప్లేస్ లో ఉంటే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కతో ఫలితం మరోలా ఉండేది. ఇది గనుక జరిగితే. అధికార పార్టీ మరింత ఉక్కిరిబిక్కిరి అయ్యేది. కీలకమైన స్థానిక సంస్థల సమయంలో తాజా ఫలితాలు మింగుడు పడని పరిస్థితికి తీసుకువచ్చాయి.
అధికారంలోకి వచ్చిన అతి తక్కువ రోజుల్లోనే ప్రతికూల ఫలితాలు రావటాన్ని ఆ పార్టీ అధినాయకత్వం గమనించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అంటున్నారు. పైపై ప్రచారాలు కాకుండా క్షేత్రస్థాయిలోని పరిస్థితులను గమనించాలని అందుకు అనుగుణంగా అడుగులు వేస్తేనే అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే కాంగ్రెస్ కు కాకుండా పరోక్షంగా ఇతర అభ్యర్థులకు సహకరించిందన్న చర్చ ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పిదం చేసిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు క్యాష్ చేసుకుంటే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చే అవకాశం దక్కేదన్న టాక్ వినిపిస్తోంది. నిజానికి ఉత్తర తెలంగాణ… బీఆర్ఎస్ కు ఆయువు పట్టు లాంటింది. కానీ గత కొంతకాలంగా ఇక్కడ పట్టు వీడుతోంది. కరీంనగర్ వంటి పార్లమెంట్ స్థానాన్ని వరుసుగా రెండుసార్లు కోల్పోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది.ఇక ఇప్పటికే ఉత్తర తెలంగాణ పరిధిలో ఆరు ఎంపీలు, 7 ఎమ్మెల్యేలను గెలిచిన బీజేపీ తాజాగా రెండు ఎమ్మెల్సీలను కైవసం చేసుకుంది. తద్వారా తెలంగాణలో రోజురోజుకూ బలపడుతున్నామనే విషయాన్ని మరోసారి రుజువు చేసుకున్నట్లు అయింది. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఆ వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలపై పూర్తిగా ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది…!రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులతో పోల్చితే… పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ కు 8 ఎంపీ సీట్లు మాత్రమే రాగా గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ 8 గెలుచుకుంది. ఇక బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. అయితే అంతా బాగుందన్న భావనలో ఉన్న అధికార పార్టీకి ఎమ్మెల్సీ ఫలితాలు షాక్ నిస్తే, బీజేపీకి మాత్రం మరింత స్పేస్ దొరికినట్లు అయింది. ఇక ప్రతిపక్ష స్థానంలో ఉన్న బీఆర్ఎస్. రెండు జాతీయ పార్టీలను కార్నర్ చేసే ప్రయత్నం చేసే పనిలోనే ఉంది…! స్థానిక ఎన్నికల్లో సత్తా చాటుతామని వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమాను వ్యక్తం చేస్తోంది!
Read more:Andhra Pradesh: గాల్లో ఎమ్మెల్సీలు..