Andhra Pradesh: గాల్లో ఎమ్మెల్సీలు..

ys jagan mohan reddy

Andhra Pradesh: గాల్లో ఎమ్మెల్సీలు..: ఏపీలోచాలామంది ఎమ్మెల్సీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పనిలో పనిగా తమ పదవులకు సైతం రిజైన్ చేశారు. నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అవి ఆమోదానికి నోచుకోలేదు. తమ వ్యక్తిగత ఇబ్బందులతో రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. శాసనమండలి చైర్మన్ ఫార్మేట్లో రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ ఇంతవరకు అవి ఆమోదానికి నోచుకోలేదు.

 గాల్లో ఎమ్మెల్సీలు..

గుంటూరు, మార్చి 8
ఏపీలోచాలామంది ఎమ్మెల్సీలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. పనిలో పనిగా తమ పదవులకు సైతం రిజైన్ చేశారు. నాలుగు నెలలు గడుస్తున్నా ఇంతవరకు అవి ఆమోదానికి నోచుకోలేదు. తమ వ్యక్తిగత ఇబ్బందులతో రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు. శాసనమండలి చైర్మన్ ఫార్మేట్లో రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. కానీ ఇంతవరకు అవి ఆమోదానికి నోచుకోలేదు. అలాగని ఎమ్మెల్సీలు శాసనమండలికి హాజరు కావడం లేదు. అసలు ఎందుకు ఆమోదించడం లేదు అన్నది తెలియడం లేదు. వారు నిజంగా రాజీనామాను కోరుకోవడం లేదా? లేకుంటే ఇంకో కారణం ఉందా? న్యాయపరంగా పోరాటం చేయడం లేదు ఎందుకు? ఒత్తిడి చేయడం లేదు ఎందుకు? అన్నది ఇప్పుడు ప్రశ్న.ఆగస్టులో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామాచేశారు పోతుల సునీత, కర్రీ పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి. అయినా సరే చైర్మన్ మోసేన్ రాజు రాజీనామాను ఆమోదించలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తూ వచ్చారు. చివరకు వ్యక్తిగతంగా చైర్మన్ ను కలిసి స్వచ్ఛందంగా రాజీనామా చేసామని.. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పేర్కొన్నారు. అయినా సరే ఆమోదించలేదు. ఆరు నెలలు పూర్తయిన ఇంతవరకు దానికి అతీగతీ లేదు. అసలు మండలి చైర్మన్ కు రాజీనామాలను ఆమోదించే ఉద్దేశం ఉందా అనే ప్రశ్న వినిపిస్తోంది. అయితే రాజీనామా చేసిన వారు సైతం ఇంతవరకు ఏ పార్టీలో చేరలేదు.

రాజీనామా ఆమోదించిన తరువాత కూటమి పార్టీల్లో చేరేందుకు ఎమ్మెల్సీలు సిద్ధంగా ఉన్నారు. దీంతో నెలల తరబడి ఈ అంశం పెండింగ్ లో ఉండిపోయింది.వాస్తవానికి ఎమ్మెల్సీల రాజీనామా తర్వాత వారు వచ్చిన పార్టీలో చేరాలన్నది వ్యూహం. అయితే మండలి చైర్మన్ గా ఉన్న మోసేన్ రాజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. శాసనమండలిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటికి ఆ పార్టీకి 38 మంది ఎమ్మెల్సీలు ఉండేవారు. అయితే క్రమేపి వారి సంఖ్య తగ్గుతూ వస్తోంది. మరో రెండేళ్లు ఇలానే కొనసాగితే టిడిపికి బలం పెరుగుతుంది. అదే సమయంలో మండలి చైర్మన్ పదవీకాలం కూడా ముగుస్తుంది. అయితే ఇప్పుడు కానీ ఎమ్మెల్సీల బలం తగ్గితే తనకు ఇబ్బందులు వస్తాయని చైర్మన్ మోసేన్ రాజు కు తెలుసు. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీల రాజీనామాను ఆమోదించడం లేదని తెలుస్తోంది.అయితే ఈ ఎమ్మెల్సీల రాజీనామా వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహం ప్రకారం వెళ్తోంది. జగన్మోహన్ రెడ్డి తనను చైర్మన్ రాజు కృతజ్ఞతా భావంతో ఉన్నారు. మరోవైపు మండలి లో అర్థవంతమైన చర్చ నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తన వాయిస్ను గట్టిగానే వినిపిస్తోంది. చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కావడంతో.. వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీలకు అవకాశం ఇస్తున్నారు. మాట్లాడడానికి మైక్ ఇస్తుండడంతో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నాయి. చాలామంది వైసిపి ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా మాట్లాడుతున్నారు. మొత్తానికి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదానికి నోచుకోకపోవడం విశేషం.

Read more:Andhra Pradesh:చంద్రబాబు ఇలా.. జగన్ అలా

Related posts

Leave a Comment