Andhra Pradesh:నిరుపయోగంగా మారిన బీఆర్‌టిఎస్ కారిడార్:వందల కోట్ల వ్యయంతో ఆర్భాటంగా చేపట్టిన బెజవాడ బీఆర్‌టిఎస్ ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయింది. దాదాపు రూ.150కోట్ల రుపాయల అప్పు, దాని మీద వడ్డీలు తప్ప ఇన్నేళ్లలో ప్రాజెక్టు సాధించిందేమి లేదు. ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల అనుచరులు ఫుడ్ కోర్టులు నడుపుకోడానికి మాత్రం పనికొస్తోంది.బెజవాడలో బీఆర్టీఎస్… పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా యూపీఏ ప్రభుత్వ హయంలో విజయవాడ, విశాఖ నగరాలకు 2008లో ఈ ప్రాజెక్టును మంజూరు చేశారు. 17ఏళ్లు గడిచినా ఇది పట్టాలెక్కలేదు.
నిరుపయోగంగా మారిన బీఆర్‌టిఎస్ కారిడార్
విజయవాడ, మార్చి 8
వందల కోట్ల వ్యయంతో ఆర్భాటంగా చేపట్టిన బెజవాడ బీఆర్‌టిఎస్ ప్రాజెక్టు ఎందుకు పనికి రాకుండా పోయింది. దాదాపు రూ.150కోట్ల రుపాయల అప్పు, దాని మీద వడ్డీలు తప్ప ఇన్నేళ్లలో ప్రాజెక్టు సాధించిందేమి లేదు. ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల అనుచరులు ఫుడ్ కోర్టులు నడుపుకోడానికి మాత్రం పనికొస్తోంది.బెజవాడలో బీఆర్టీఎస్… పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా యూపీఏ ప్రభుత్వ హయంలో విజయవాడ, విశాఖ నగరాలకు 2008లో ఈ ప్రాజెక్టును మంజూరు చేశారు. 17ఏళ్లు గడిచినా ఇది పట్టాలెక్కలేదు. ఆ పేరుతో వందల కోట్ల రుపాయలు ఖర్చు చేశారు. మరోవైపు బెజవాడలో బీఆర్‌టిఎస్ పేరుతో నిర్మించిన రోడ్డు మాత్రం ప్రజాప్రతినిధులు వ్యాపారాలు చేసుకోడానికి అడ్డాగా మారింది.ఫుడ్ కోర్టుల పేరుతో స్టాళ్లను ఏర్పాటు చేసి సొమ్ము చేసుకోవడంలో స్థానిక నేతలు సక్సెస్ అయ్యారు.బెజవాడలో బీఆర్టీఎస్ ప్రాజెక్టు 2008లో ఊపిరి పోసుకుంది. అప్పటికే హైదరాబాద్ నగరానికి మెట్రో మంజూరైంది. హైదరాబాద్‌తో పాటు ఏపీలో నగరాలను కూడా అభివృద్ధి చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును తెరపైకి తెచ్చారు.
నగరంలో ప్రత్యేక కారిడార్లను ఏర్పాటు చేసి లో ఫ్లోర్ బస్సుల్ని ఆ కారిడార్లలో నడపాలని ప్రణాళిక రచించారు. సత్యనారాయణ పురం పాత రైల్వే ట్రాక్ మార్గంలో కొత్త రోడ్డు నిర్మాణం చేపట్టారు. దానికి బీఆర్‌టిఎస్ రోడ్డుగా నామకరణం చేశారుఆ తర్వాత విజయవాడ గ్రీన్ కారిడార్‌లో బస్సులు నడపడానికి నాలుగైదు సార్లు ట్రయల్స్ కూడా నిర్వహించారు. బందరు రోడ్డు మీదుగా బీఆర్టీఎస్ రోడ్డులోకి బస్సుల్ని నడపాలని హంగామా చేశారు. 2010 జూన్ నాటికి 27కోట్ల రుపాయలతో రోడ్డు నిర్మాణంతో పాటు ఎలివేటెడ్ కారిడార్‌ను కూడా నిర్మించారు. దానిని అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి జైపాల్ రెడ్డి ప్రారంభించారు. అంతటితో బీఆర్‌టిఎస్ కథ ముగిసిపోయింది. ఆ బస్సులు రాలేదు, బీఆర్‌టిఎస్ పట్టాలు ఎక్కలేదు.23 ఏళ్ల క్రితం నగరం మధ్యలో బందరు రైల్వే ట్రాక్‌ను తొలగించిన తర్వాత ఆ స్థలాన్ని కార్పొరేషన్‌కు స్వాధీనం చేశారు.అందులోనే బీఆర్‌టిఎస్ ప్రాజెక్టు కోసం కారిడార్‌ను నిర్మించారు.
మొత్తం స్థలాన్ని ఆరు లేన్లుగా విభజించి రెండు వైపులా వాహనాల రాకపోకలు సాగేలా, మధ్య 40అడుగుల రోడ్డులో బీఆర్‌టిఎస్ బస్సులు నడిపేలా రోడ్డును డిజైన్ చేశారు. అందులోనే బస్ షెల్టర్లను కూడా నిర్మించారు. ఇది జరిగి 15ఏళ్లైనా ఆ మార్గంలో బస్సుల రాకపోకలు మొదలు కాలేదుఅదే సమయంలో రాష్ట్ర విభజన తర్వాత బీఆర్‌టిఎస్ రోడ్డు నగరంలో కీలక మార్గంగా మారింది. విజయవాడలో కూడా ట్రాఫిక్ గణనీయంగా పెరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరు వైపు ప్రయాణించే కార్లు, ఇతర వాహనాలతో పాటు నగరంలో తిరిగే వాహనాల రాకపోకలతో రద్దీగా మారింది. ఈ క్రమంలో రైల్వే పరిధిలోకి మిగిలిన భూములు ఆక్రమణలకు గురయ్యాయి. సాధారణ వాహనాల రాకపోకల కోసం కేటాయించిన రోడ్లు ఇరుకుగా మారిపోయాయి.విస్తీర్ణం తగ్గడం, వాహనాల సంఖ్య పెరగడంతో బీఆర్‌టిఎస్ కారిడార్‌లో ఉన్న నాలుగు జంక్షన్లలో నిత్యం ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. సీతన్నపేట గేటు, సత్యనారాయణ పురం, ఫుడ్ జంక్షన్, మధురానగర్ కూడళ్లలో వాహనాలు బారులు తీరుతున్నాయి. అదే సమయంలో రోడ్డు 120 అడుగులకు పైగా వెడల్పు ఉన్నా అందులో వాహనాల వినియోగానికి సగం కూడా అందుబాటులో లేదు. మిగిలిన దానిని బీఆర్‌టిఎస్ కారిడార్‌గా ఉంచేశారు.
గత ఐదేళ్లలో వృధాగా ఉన్న ఈ రోడ్డులో ఫుడ్ కోర్టుల నిర్వహణ వ్యాపారం నేతలకు లాభసాటిగా మారిందిట్రాఫిక్ గణనీయంగా పెరిగినా అందుబాటులో ఉన్న రోడ్డును వినియోగించుకోడానికి మాత్రం అధికారులు చొరవ చూపడం లేదు. దీంతో బీఆర్‌టిఎస్ రోడ్డులో ప్రత్యేక కారిడార్ బిచ్చగాళ్లకు ఆవాసంగా, అక్రమ వ్యాపారాలకు కేంద్రంగా మారింది. రెండ్రోజుల క్రితం బీఆర్‌టిఎస్ కారిడార్లోకి ఓ వాహనం దూసుకెళ్లడంతో రోడ్డుపై నిద్రిస్తున్న నలుగురు యాచకులు తీవ్రంగా గాయపడ్డారు.ప్రాజెక్టును ప్రతిపాదించిన సమయంలో దాని కార్యకలాపాల కోసం ప్రభుత్వం ఎస్పీవి ఏర్పాటు చేసింది. విజయవాడ పోలీస్ కమిషనర్, మున్సిపల్ కమిషనర్, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, ఇతర అధికారులు సభ్యులుగా.. జిల్లా కలెక్టర్ నేతృత్వంలో దానిని ఏర్పాటు చేశారు. 2010 నాటికి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోవడంతో బీఆర్టీఎస్ క్రమంగా మరుగుడ పడిపోయింది. విజయవాడ నగర పరిస్థితులు, దానికి ఉన్న భౌగోళిక పరిమితులు, ట్రాఫిక్, రోడ్ల విస్తీర్ణం వంటి వాటిని అంచనా వేయకుండానే ఈ ప్రాజెక్టును చేపట్టారుజవహర్ లాల్ నెహ్రూ పట్టణ పునర్నిర్మాణ పథకంలో భాగంగా విజయవాడకు నిధులు వస్తాయంటూ అప్పటి ప్రజా ప్రతినిధులు హోరెత్తించారు. హైదరాబాద్ స్థాయికి విజయవాడ అభివృద్ధి చెందుతుందని ప్రచారం చేశారు.
ఈ ప్రాజెక్టులపై వచ్చిన విమర్శలు, అభ్యంతరాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖాతరు చేయలేదుప్రాజెక్ట్ మొదటి దశలో 15.5 కి.మీ. దూరాన్ని కవర్ చేసేలా డిజైన్ చేశారు. GS రాజు రోడ్డును మధురానగర్ లను కలిపేలా న BRTS కారిడార్ రూపొందించారు. పాత సత్యనారాయణపురం రైల్వే ట్రాక్‌ను ఇప్పుడు BRTS రోడ్డుగా మార్చారు. మొదటి దశ గ్రీన్ కారిడార్‌లో 31 బస్ స్టాప్‌లను ఏర్పాటు చేయాలని భావించారు. ఇవి ఒక్కొక్కటి 500 మీటర్ల దూరంలో ఉంటాయి. నగరంలోని 17 ట్రాఫిక్ జంక్షన్ల మీదుగా ఈ కారిడార్ సాగుతుంది. ప్రాజెక్టును పట్టాలెక్కించినపుడు విజయవాడలో ఆ బస్సులు ప్రయాణించడానికి కీలకమైన సిగ్నలింగ్ వ్యవస్థ లేదు. మొత్తం 15.5 కి.మీ గ్రీన్ కారిడార్‌లో, 11 కి.మీ.ల విస్తీర్ణంలో మాత్రమే బస్సులు వెళ్లడానికి మార్కింగ్ చేయగలిగారు. మిగిలిన మార్గంలో సాధారణ ట్రాఫిక్‌తో కలిసి అవి సాగాల్సి ఉంది.మెట్రో ప్రాజెక్టుకు ప్రత్యామ్నయంగా దీనిని తెరపైకి తెచ్చారు. ఇండోర్, పూణే, అహ్మదాబాద్ తర్వాత విజయవాడలోనే బీఆర్‌టిఎస్ వస్తోందని ప్రచారం చేశారు.2014లో రాష్ట్ర విభజన తర్వాత ఈ ప్రాజెక్టు గురించి పూర్తిగా మర్చిపోయారు. విభజన చట్టంలో విజయవాడకు మెట్రోహామీ రావడంతో బీఆర్‌టిఎస్ కథ పూర్తిగా మరుగున పడిపోయింది. అక్కడో రోడ్డు ఖాళీగా పడి ఉందనే సంగతి కూడా మర్చిపోయారు. దానిని ప్రజలకు వినియోగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం దసరా, భవానీ దీక్షల వంటి ఉత్సవాల సమయంలో వాహనాల పార్కింగ్‌కు ఆ రోడ్డును వాడుతున్నారు.
Read more:Andhra Pradesh:27 రూపాయిలు ఎక్కువకు అమ్మినందుకు 27 లక్షల 27 వేల రూపాయలు జరిమానా