Andhra Pradesh:8 కోట్లతో షర్మిల బెజవాడలో ఇల్లు:ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇకపై ఆంధ్రప్రదేశ్ నుంచే పార్టీ కార్యక్రమాలు నడిపించనున్నారు. దాని కోసం విజయవాడలో ఇంటిని కొనుగోలు చేశారు. “ఆమె పూర్తిగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు క్యాడర్‌కు అందుబాటులో లేరు” అంటూ ప్రత్యర్థుల చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టారు. ఇకపై పూర్తిగా విజయవాడలోనే ఉంటూ రాజకీయాలలు చేయబోతున్నారు.
8 కోట్లతో షర్మిల బెజవాడలో ఇల్లు
విజయవాడ మార్చి 8
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇకపై ఆంధ్రప్రదేశ్ నుంచే పార్టీ కార్యక్రమాలు నడిపించనున్నారు. దాని కోసం విజయవాడలో ఇంటిని కొనుగోలు చేశారు. “ఆమె పూర్తిగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు క్యాడర్‌కు అందుబాటులో లేరు” అంటూ ప్రత్యర్థుల చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టారు. ఇకపై పూర్తిగా విజయవాడలోనే ఉంటూ రాజకీయాలలు చేయబోతున్నారు. వైఎస్ షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా పదవి చేపట్టిన నాటి నుంచి విజయవాడలో తగిన నివాసం కోసం వెతుకుతున్నారు. అయితే అటు ఆమె కుటుంబం నివాసం ఉండడంతోపాటు పార్టీ ముఖ్యలను కలిసేందుకు వీలుగా ఉండే ఇల్లు దొరకడం కష్టమైంది. చివరికి పోరంకి రోడ్‌లో కామినేని హాస్పిటల్ సమీపంలో ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న విల్లాను షర్మిల కొనుగోలు చేశారు. అటు సెక్యూరిటీ పరంగానూ కూడా ఇది ఎలాంటి ఇబ్బంది లేదని షర్మిల సన్నిహితులు చెబుతున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఇల్లు షర్మిలకు చాలా బాగా నచ్చిందని అంటున్నారు. ఈ డూప్లెక్స్ విల్లా నుంచే ఇకపై షర్మిల కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల జోరు పెంచబోతున్నారు. త్వరలోనే హైదరాబాద్ నుంచి విజయవాడకు మకాం మార్చేయనున్నారు షర్మిల. ఈ విల్లాను ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టి కొన్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంపై షర్మిల దృష్టి పెట్టారు. ఒకవైపు కూటమి, రెండోవైపు వైసీపీ ఉన్నప్పటికీ రెండూ కేంద్రంలో బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నాయి. కాబట్టి వాటికి ఒక ఆల్టర్నేటివ్‌గా కాంగ్రెస్‌ని బలోపేతం చేయాలనేది షర్మిల ఆలోచనగా ఉంది. అందుకే రెండు పార్టీలపై వీలుచిక్కినప్పుడల్లా ఫైర్ అవుతూ ప్రజల్లోకి దూసుకెళ్లేందుకు యత్నిస్తున్నారు. వైసిపి నుంచి బయటకు వచ్చే నాయకులను కాంగ్రెస్ వైపు ఆకర్షించడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు షర్మిల. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అధినాయకత్వం షర్మిలపై విశ్వాసం ఉంచిందని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఉగాది తర్వాత విజయవాడ నుంచే రాజకీయం నడపడానికి షర్మిల రెడీ అవుతున్నారు. షర్మిల విజయవాడలో ఉండకుండా అతిథిలా వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సొంత పార్టీ నేతలే విమర్శలు చేస్తున్నారు. నేరుగా మీడియా ముందుకు రాకపోయిన గుసగుసలు మాత్రం వినిపిస్తున్నాయ. పార్టీలో ప్రత్యర్థులుగా ఉంటూ చేస్తున్న దుష్ప్రచారానికి కూడా షర్మిల చెక్ పెట్టేస్తున్నారు. అందుకే విజయవాడకు షిఫ్ట్ అవుతున్నారు. ఇప్పటి వరకు అన్న జగన్‌పై మాత్రమే పోరాడుతూ వచ్చారు షర్మిల. ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై కూడా ఫోకస్ చేయాలని భావిస్తున్నారట. ఎన్నికల హామీలు అమలు విషయంలో ప్రశ్నిస్తున్నారు. స్వరాన్ని పెంచుతున్నారు. రెండు ప్రభుత్వాల వల్ల ప్రజలకు మేలు జరిగింది లేదని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అంటకాగినా ప్రయోజనం శూన్యమనేలా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ప్రజల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు పోరాట పంథా ఎంచుకోనున్నారు
Read more:Andhra Pradesh:అనంతపురం పెట్రోల్ మోసం