Andhra Pradesh:అనంతపురం పెట్రోల్ మోసం

Anantapur petrol fraud

Andhra Pradesh:అనంతపురం పెట్రోల్ మోసం:మనం పెట్రోల్ బంకులోకి వెళ్లి ట్యాంకులో పెట్రోల్ కొట్టించుకుంటాం. ఇప్పుడు ఎవరూ లీటర్లలో కొట్టించుకోవడం లేదు. వంద .. రెండు వందలు అని లెక్కవేసి కొట్టించుకుంటున్నారు. ఇక్కడే అతి పెద్ద స్కాంకు పెట్రోల్ బంకుల యజామాన్యాలు తెరలేపాయి.

అనంతపురం పెట్రోల్ మోసం

అనంతపురం మార్చి 8
మనం పెట్రోల్ బంకులోకి వెళ్లి ట్యాంకులో పెట్రోల్ కొట్టించుకుంటాం. ఇప్పుడు ఎవరూ లీటర్లలో కొట్టించుకోవడం లేదు. వంద .. రెండు వందలు అని లెక్కవేసి కొట్టించుకుంటున్నారు. ఇక్కడే అతి పెద్ద స్కాంకు పెట్రోల్ బంకుల యజామాన్యాలు తెరలేపాయి. లీటర్‌కు 60 నుంచి 100 ఎంఎల్ వరకూ ఎక్కువ రీడింగ్ వచ్చేలా డిస్పెన్సర్ చిప్‌లను రీ ప్రోగ్రామించి చేసి కోట్లు కొట్టేస్తున్నారు. అనంతపురం జిల్లాలో ఈ మోసం వెలుగు చూసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ , లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పెట్రోల్ బంకుల పైన దాడులు చేశారు. ఈ సందర్భంగా తనిఖీలు చేయడంతో నయా మోసం బట్టబయలైంది. అనంతపురం నగరంలోని జయలక్ష్మి ఆటో కేర్, ఎస్ పి అండ్ సన్స్, విజయ ఫిల్లింగ్ స్టేషన్ పెట్రోల్ పంపులు డిస్పెన్సింగ్ యూనిట్ (డియూ)కి చిప్ నీ అమర్చి వినియోగదారులకు తక్కువ పెట్రోల్ అంటగట్టి ఏడాదిలో కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నట్లుగా గుర్తించారు.

2023 సంవత్సరం కంటే ముందు తయారి అయినడియూ యూనిట్ ను ఓపెన్ చేయాలంటే ఓటీపీ అవసరం లేదు. 2023 సంవత్సరం తర్వాత తయారి అయిన డియూ యూనిట్ ఓపెన్ చేయాలంటే 22 అంకెలు గల ఓటీపీ వస్తుంది. అందులో 11 అంకెలు డీలర్ కు, 11 అంకెలు కంపెనీ టెక్నీషియన్ కు వస్తుంది. మొత్తం 22 అంకెలు ఎంటర్ చేస్తేనే మెషిన్ ఓపెన్ అవుతుంది. ప్రతి కంపెనీకీ జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు టెక్నీషియన్లు ఉంటారు. వినియోగదారులు బాటిల్స్ లో కాని క్యాన్ లలో గాని పెట్రోల్ నింపమని అడిగినపుడు డిస్పెన్సరింగ్ యూనిట్ 2 ఆన్, ఆఫ్ రిమోట్ ద్వారా పనిచేసే మెకానిజం ద్వారా మెషిన్ ను కంట్రోల్ చేసి, సరైన కొలతలతో నింపుతారు. మిగతా వాహనాలు వచ్చినప్పుడు మాత్రం.. తక్కువ మొత్తంలో పెట్రోల్ పోస్తున్నారు. సాధారణంగా లీగల్ మెట్రాలాజి అధికారులు ప్రతి సంవత్సరం పెట్రోల్ పంపులను తనిఖీ చేసి సీలు వేయడం జరుగుతుంది. విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మరియు లీగల్ మెట్రాలాజి అధికారులు తనిఖీ నిమిత్తం వెళ్ళినప్పుడు లీగల్ మెట్రాలాజి వారు వేసిన సీళ్లు వేసినట్లుగానే వున్నాయి, కాని లోపల టాంపరింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు.

పెట్రోల్ డీజిల్ పంపులకు లోపల డీయూ ప్లెజర్ బోర్డులను ట్యాంపరింగ్ చేసి కొత్తగా ప్రోగ్రామింగ్ చేసిన చిప్ ను అమచినారు. ఇందులో టుఖేయిం కంపెనీకి చెందిన డిస్పెన్సివ్ యూనిట్ ను వాడుతున్నారు. మిషిన్ లో ఏర్పాటు చేసిన బోర్డులను ట్యాంపరింగ్ చేయడం వలన ఒక లీటర్ పెట్రోల్ డీజిల్ కు సుమారుగా 60 ఎం.ఎల్ నుంచి 100 ml తక్కువ వచ్చే విధంగా ప్రోగ్రాం లో అమర్చిన చిప్ పని చేస్తుంది. లీగల్ మెట్రాలజి సిబ్బంది వేసిన సిళ్ళు వేసిన తేది నుండి తనిఖీ చేసిన తేదికి పెట్రోల్ బంకులలో సరాసరి 25 లక్షల లీటర్ల డీజల్ / పెట్రోల్ పంపుల నుండి అమ్మకాలు జరుగగా, ఈ లెక్కన ఒక సంవత్సరానికి 2,50,000 లీటర్ల డీజల్ / పెట్రోల్ తక్కువగా వేసి దాదాపుగా రెండుకోట్ల యాభై లక్షల రూపాయల మేరకు వినియోగదారులను మోసగించినారు. ఇది ఒక పెట్రోల్ పంపు నుంచి మాత్రమే ఇంత స్థాయిలో ప్రజలు మోసపోనట్లు అధికారులు గుర్తించారు. సాధారణంగా డిజిల్/పెట్రోల్ వినియోగదారులు వాహనాలు బంకు వద్దకు రాగానే, చిప్ అమర్చిన DU వద్దకు వెళ్ళండి అని చేతులు ఊపి ఆ పంపు వైపునకు మళ్ళిస్తారనీ అధికారులు చెబుతున్నారు. ఈ ఘరానా మోసం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Read more:Andhra Pradesh:చంద్రబాబు మాటల్లో అంత అర్ధమా లోకేశ్ కు బాధ్యతలేనా

Related posts

Leave a Comment