Andhra Pradesh:ఉద్యోగులకు మరో బంపర్ ఆఫర్

Andhra Pradesh government seems to have taken another important decision. It is known that the TDP alliance gave many promises during the elections.

Andhra Pradesh:ఉద్యోగులకు మరో బంపర్ ఆఫర్:ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మహిళల, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారికి చంద్రబాబు హామీలు ప్రకటించారు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగుల సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తోంది.

ఉద్యోగులకు మరో బంపర్ ఆఫర్

గుంటూరు, మార్చి 6
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి అనేక హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. మహిళల, ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు ఇలా అన్ని వర్గాల వారికి చంద్రబాబు హామీలు ప్రకటించారు. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగుల సంక్షేమానికి కూడా పెద్దపీట వేస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అదనంగా 5 క్యాజువల్ లీవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు సమాచారం.మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటివరకు పరిమిత క్యాజువల్ లీవ్స్ మాత్రమే అందుబాటులో ఉండేవి. దీంతో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

ఈ నేపథ్యంలో తమకు క్యాజువల్ లీవ్స్ పెంచాలంటూ వైద్యారోగ్య శాఖలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల విజ్ఞప్తిని పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. అదనంగా వారికి ఐదు క్యాజువల్ సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలిసింది.ఇక ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో క్యాజువల్ లీవ్స్ ఉండటంతో ఇంతకాలం అనేక ఇబ్బందులు పడ్డామని.. ఇప్పుడు అదనంగా ఐదు రోజులు క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలనే నిర్ణయంతో తమకు ఎంతో ఉపశమనం కలుగుతుందంటున్నారు. ఈ నిర్ణయం ఉద్యోగుల వృత్తి నిబద్ధతను పెంచుతుందంటన్నారు. ఈ కొత్త పాలసీ గురించి ప్రభుత్వం వీలైనంత త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతున్నారు. ఈ నిర్ణయం ద్వారా అనేక మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని, వారి పనితీరు మెరుగుపడుతుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Read more:Andhra Pradesh:కలిసి పని చేశారు.. ఊహించనంత మెజార్టీలు సాధించారు

Related posts

Leave a Comment