Andhra Pradesh:వివేకా హత్య కేసు మరో సాక్షి మృతి:వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ప్రధాన సాక్షి చనిపోయారు. వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్నఅనారోగ్యంతో బాధపడుతూ కడప రిమ్స్ ఆస్పత్రిలో చనిపోయారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు రంగన్న ఇంటి వాచ్ మెన్ గా ఉన్నారు. ఈ కేసులో పలుమార్లు రంగన్నను సీబీఐ అధికారులు ప్రశ్నించి స్టేట్ మెంట్ నమోదు చేశారు.
వివేకా హత్య కేసు
మరో సాక్షి మృతి
కడప, మార్చి 6
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో ప్రధాన సాక్షి చనిపోయారు. వివేకా ఇంటి వాచ్మెన్ రంగన్నఅనారోగ్యంతో బాధపడుతూ కడప రిమ్స్ ఆస్పత్రిలో చనిపోయారు. వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు రంగన్న ఇంటి వాచ్ మెన్ గా ఉన్నారు. ఈ కేసులో పలుమార్లు రంగన్నను సీబీఐ అధికారులు ప్రశ్నించి స్టేట్ మెంట్ నమోదు చేశారు. వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్నను మొదట ఎవరూ పట్టించుకోలేదు కానీ..సీబీఐకి ఆయన ఇచ్చిన వాంగ్మూలం మాత్రం సంచలనం సృష్టించింది. ఎర్రగంగిరెడ్డి, ఉమా శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి కలిసి వివేకను హత్య చేశారని 164 స్టేట్మెంట్లో రంగన్న చెప్పారు. ఏ 1 నిందిుతుడు దస్తగిరి అప్రూవర్‌గా మారాడు. ఇదే కేసులో నిందితుడుగా ఉన్న కల్లూరు గంగాధర రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. శ్రీనివాసరెడ్డి మరో అనుమానితుు కూడా అనుమానాస్పదంగా చనిపోయారు. మృతదేహానికి కుట్లు వేసిన..వేయించిన వైద్యులు ఈసీ గంగిరెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి కూడా చనిపోయారు. ఇప్పుడు రంగన్న కూడా చనిపోవడంతో సాక్షులంతా వరుసగా చనిపోతున్నారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. వివేకా హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి కావడం వల్ల ఆయనకు 1+1 భద్రత కల్పించారు. కీలక సాక్షులంతా చనిపోతున్నా..కేసుల్లో మాత్రం అడుగు ముందుకు పడటం లేదని ఆరు నెలల్లో కేసు విచారణ పూర్తి చేయాలని వైఎస్ సునీత ఇటీవల తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు.
సునీత దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసు సీబీఐ కోర్టుకు బదిలీ అయి రెండేళ్లయినా విచారణ ప్రారంభంకాలేదని . అందువల్ల 6 నెలల్లో విచారణ పూర్తయ్యేలా ఆదేశాలివ్వాలంటూ సునీతారెడ్డి పిటిషన్లో కోరారు. ఈ కేసు విచారణ జరగకుండా నిందితులు ప్రయత్నిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది ఎస్.గౌతం వాదనలు వినిపించారు. ప్రస్తుతం ఇంకా కోర్టు నుంచి కాగితాలు తీసుకునే దశలోనే ఉన్నారని సునీత వాదిస్తున్నారు. దాదాపు 13 లక్షల ఫైళ్లు ఉండగా అందులో 13,000లు కూడా తెరవలేదన్నారు. ఇంత ఆలస్యంగా ఉంటే కేసు విచారణ ఏల్లు పడుతుందన్నారు. ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధుల కేసులపై ప్రత్యేక విచారణ చేపట్టేలా చూడాలంటూ సుప్రీంకోర్టు అన్ని హైకోర్టులకు ఆదేశాలు జారీ చేసింది ప్రధాన న్యాయమూర్తితో కూడిన ప్రత్యేక ధర్మాసనం ప్రజాప్రతినిధుల కేసుల పురోగతిని పర్యవేక్షిస్తోందని ఈ పిటిషన్ కూడా ప్రత్యేక ధర్మాసనం ముందుంచాలని రిజిస్త్రీని న్యాయమూర్తి ఆదేశించారు. త్వరలో ఈ పిటిషన్ విచారణకు రానుంది. 2019 ఎన్నికలకు ముందు పులివెందులలోని తన నివాసంలోనే వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. మొదట ఆయనకు గుండెపోటు వచ్చిందని… రక్తపు వాంతులు చేసుకున్నారని ప్రచారం చేశారు. అయితే ఆయనను చాలా దారుణంగా నరికి చంపారని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. దాంతో తర్వాత హత్యకేసుగా మారింది. ఈ వ్యవహారంలో ఇప్పటికీ విచారణ పూర్తి కాకపోవడం .. నిందితులు ఇంకా ధైర్యంగా బయట తిరుగుతూండటం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది.
Read more:Sai Pallavi రెమ్యూనరేషన్ విషయంలో నయనతార ని దాటేసిన సాయి పల్లవి