New York:దిగొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

Zelensky, the President of Ukraine

New York:దిగొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ:ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అమెరికాతో ఖనిజాల, భద్రతా ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శుక్రవారం శ్వేతసౌధంలో ట్రంప్‌తో తన సమావేశం నిరాశపరిచిందని వోలోడిమిర్ జెలెన్‌స్కీ అంగీకరించారు. అయితే ఆయన మరోసారి ఉక్రెయిన్ పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ జావెలిన్ క్షిపణులను ఇచ్చినందుకు ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు.

దిగొచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ

న్యూయార్క్, మార్చి 5
ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ అమెరికాతో ఖనిజాల, భద్రతా ఒప్పందంపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బలమైన నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. శుక్రవారం శ్వేతసౌధంలో ట్రంప్‌తో తన సమావేశం నిరాశపరిచిందని వోలోడిమిర్ జెలెన్‌స్కీ అంగీకరించారు. అయితే ఆయన మరోసారి ఉక్రెయిన్ పట్ల తన నిబద్ధతను వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ జావెలిన్ క్షిపణులను ఇచ్చినందుకు ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదే సరైన సమయమని, పరిస్థితులను చక్కదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఉక్రెయిన్ శాంతి కోస తన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించాలనుకుంటున్నట్లు వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఒక ప్రకటనలో తెలిపారు. ‘మనలో ఎవరూ అంతులేని యుద్ధాన్ని కోరుకోరు. శాశ్వతంగా శాంతిని తీసుకురావడానికి ఉక్రెయిన్ త్వరలో చర్చలకు కూర్చోవడానికి సిద్ధంగా ఉంది. శత్రుత్వానికి ముగింపు పలికేందుకు సత్వర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. మొదటి దశలో ఖైదీల విడుదల, వైమానిక దాడులను ఆపేందుకు కాల్పుల విరమణ ఉంటుంది. రష్యా కూడా అదే పని చేస్తే యుద్ధాన్ని చల్లార్చవచ్చు. తదుపరి చర్యల కోసం వేగంగా పనిచేయాలని మేం కోరుకుంటున్నాం. బలమైన తుది ఒప్పందాన్ని అంగీకరించడానికి యూఎస్‌తో కలిసి పనిచేస్తాం.’ అని చెప్పారు.వోలోడిమిర్ జెలెన్‌స్కీ అమెరికా మద్దతును ప్రశంసించారు.

ఉక్రెయిన్ సార్వభౌమత్వం, స్వాతంత్య్రాన్ని కాపాడటానికి యూఎస్ ఎంత దోహదం చేసిందో మేం నిజంగా అభినందిస్తున్నామన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్‌కు జావెలిన్ క్షిపణులను అందించినప్పుడు పరిస్థితులు మారిన క్షణాన్ని మనం మర్చిపోలేమన్నారు.వోలోడిమిర్ జెలెన్‌స్కీ ఖనిజ, భద్రతా ఒప్పందం గురించి మాట్లాడుతూ.. ‘ఉక్రెయిన్ ఏ సమయంలోనైనా, ఏ సౌకర్యవంతమైన ఫార్మాట్లోనైనా దానిపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ ఒప్పందాన్ని మరింత భద్రత, దృఢమైన భద్రతా హామీల దిశగా ఒక అడుగుగా మేం భావిస్తున్నాం. ఇది సమర్థవంతంగా పనిచేస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.’ అని చెప్పారు.అయితే సైనికపరంగా ఉక్రెయిన్‌కు వెళ్లాల్సిన సాయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. తనతో చర్చలు విఫలమైన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే దీని తర్వాత కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ దిగివచ్చారు. తమ దేశంలో ఖనిజాలు తవ్వుకునేందుకు ఒప్పందానికి సిద్ధమేనని చెప్పారు.

Read more:Hyderabad:ప్రతిపక్షం కమలమేనా

Related posts

Leave a Comment