Hyderabad:సీఎం మార్పు తప్పదా.. వరుస కామెంట్స్ పై అనుమానాలు

telangana cm

Hyderabad:సీఎం మార్పు తప్పదా.. వరుస కామెంట్స్ పై అనుమానాలు:తెలంగాణలో రోజురోజుకు రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నేత ఏ బాంబు పేలుస్తాడో.. మంటలు రేపే మాటలు ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి. రాజకీయ పార్టీల్లో చోటుచేసుకునే పరిణామాలు కూడా ఊహించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో.. త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు ఉంటుందని.. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్తగా నియామకమైన ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ వచ్చింది అదే పని మీద అంటూ బాంబు పేల్చారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి.

సీఎం మార్పు తప్పదా..
వరుస కామెంట్స్ పై అనుమానాలు

హైదరాబాద్, మార్చి 4
తెలంగాణలో రోజురోజుకు రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏ నేత ఏ బాంబు పేలుస్తాడో.. మంటలు రేపే మాటలు ఏం మాట్లాడుతారో అర్థం కాని పరిస్థితి. రాజకీయ పార్టీల్లో చోటుచేసుకునే పరిణామాలు కూడా ఊహించలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో.. త్వరలోనే తెలంగాణ సీఎం మార్పు ఉంటుందని.. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్తగా నియామకమైన ఇంఛార్జ్ మీనాక్షీ నటరాజన్ వచ్చింది అదే పని మీద అంటూ బాంబు పేల్చారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించిన ఏలేటి.. సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో అతి త్వరలోనే ముఖ్యమంత్రి మార్పు ఉంటుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మిషన్ ఛేంజ్ టాస్క్‌ మీదనే మీనాక్షి నటరాజన్ తెలంగాణకు ఏఐసీసీ ఇంఛార్జిగా వచ్చారంటూ కీలక కామెంట్ చేశారు. డిసెంబర్‌‌లోపే ముఖ్యమంత్రిని మార్చేందుకు మీనాక్షి రంగం సిద్ధం చేస్తున్నారని సంచలన ఆరోపణ చేశారు. మీనాక్షి నటరాజన్ ను తీసుకురావడం వెనుక ఉత్తమ్ కే కీలక పాత్ర అని అన్నారు. రేవంత్ కి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారనే చర్చ జరుగుతోందని మీడియాతో అన్నారు ఏలేటి.గతంలో తాను కాంగ్రెస్ లో పని చేశానని ఏలేటి గుర్తు చేశారు. ఢిల్లీలో తనకున్న సోర్స్, కాంగ్రెస్ ఇంటర్నల్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తానీ వ్యాఖ్యలు చేశానన్నారు. డిసెంబర్ లో తెలంగాణ సీఎం మార్పు ఖాయమన్నారు. మీనాక్షి నటరాజన్ కు అదే టాస్క్ అప్పగించారని వ్యాఖ్యానించారు. తెలంగాణకు ఆమె వచ్చింది అదే పనిపై అన్నారు.ఇప్పటికే సీఎం కుర్చీ మీద భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కన్నేశారంటూ ఆరోపించారు.

వనపర్తిలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి.. అక్కడ నిర్వహించిన సభలో మాట్లాడుతూ.. ఆడబిడ్డల ఆశీర్వాదం ఉంటే ఇంకా 20 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానంటూ చెప్పారని ఏలేటి గుర్తు చేశారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదం కంటే.. ఢిల్లీ నుంచి వచ్చిన ఆడబిడ్డ ఆశీర్వాదమే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి చాలా ముఖ్యమంటూ ఎద్దేవా చేశారు.తెలంగాణలో కాంగ్రెస్‌ సర్కార్‌ పూర్తిగా గాడి తప్పిందని ఏలేటి విమర్శించారు. మంత్రుల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉందని మండిపడ్డారు. ఒక్క మంత్రి కూడా సీఎంను లెక్కచేయడం లేదని ఎద్దేవా చేశారు. మంత్రుల పనితీరులోనూ చాలా మార్పులు వచ్చాయన్నారు. ఎవరికీ శాఖల మీద అవగాహన లేదని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రూ.2500, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు.. ఇలా అనేక పథకాలను గంగలో కలిపేశారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిని గద్దె దింపేందుకే కింద నెగిటివ్ అయ్యేలా మంత్రులు ప్రవర్తిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌లో ఏం జరిగేది ఎవరికీ తెలియదంటూ ఏలేటి కీలక వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్‌గా మీనాక్షి నటరాజన్ ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఈ బాధ్యతలు చేపట్టినప్పటిన క్షణం నుంచే.. ఆమె తనదైన స్టైల్‌లో ముందుకెళ్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు మీనాక్షీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారరు. ఇప్పటికే.. విస్తృతస్థాయి సమావేశం నిర్వహించి ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేసిన మీనాక్షి.. కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే.. ప్రతిపక్ష నేతలు మీనాక్షి రాక గురించి తమదైన శైలిలో విమర్శలు, ఆరోపణలతో పాటు జోష్యాలు కూడా చెప్పేస్తున్నారు.

Read more:Hyderabad:ఆ మూడు జిల్లాల్లే టాప్.. తెలంగాణను పోషిస్తున్న ఆ మూడు

Related posts

Leave a Comment