Visakhapatnam:లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం

uttarandhra-mlc

Visakhapatnam:లెక్క తప్పింది… ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం:ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మె ల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసు లు నాయుడు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓటమిపాల య్యారు. గాదె శ్రీనివాసులు నాయు డు కౌంటింగ్ తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి 10 మంది పోటీ చేయ గా, ఎలిమినేషన్ లో 8 మంది పోటీ నుంచి నిష్క్రమిం చా రు. చివరికి శ్రీనివాసలు నాయుడు, రఘువర్మ మిగలగా… రెండో ప్రాధా న్యత ఓట్ల సాయంతో శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్ ఫిగర్ 10,068 సాధించి విజయం అందుకున్నా రు.గాదె శ్రీనివాసులు నాయుడుకు 12,035 ఓట్లు పోల య్యాయి.

లెక్క తప్పింది…
ఆఖరి క్షణాల్లో చేజారిన విజయం

విశాఖపట్నం
ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మె ల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసు లు నాయుడు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓటమిపాల య్యారు. గాదె శ్రీనివాసులు నాయు డు కౌంటింగ్ తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ స్థానం నుంచి 10 మంది పోటీ చేయ గా, ఎలిమినేషన్ లో 8 మంది పోటీ నుంచి నిష్క్రమిం చా రు. చివరికి శ్రీనివాసలు నాయుడు, రఘువర్మ మిగలగా… రెండో ప్రాధా న్యత ఓట్ల సాయంతో శ్రీనివాసులు నాయుడు మ్యాజిక్ ఫిగర్ 10,068 సాధించి విజయం అందుకున్నా రు.గాదె శ్రీనివాసులు నాయుడుకు 12,035 ఓట్లు పోల య్యాయి. గాదె శ్రీనివాసులు నాయుడు మూడోసారి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. గతంలో 2007, 2013లో ఉత్తరాం ధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలు పొందారు.తొలి రౌండ్లో ఫలితం తేలకపోవటంతో రెండో రౌండ్ కౌంటింగ్ నిర్వహించారు. రెండో రౌండ్లో అభ్యర్థి శివప్రసా దరావు, మూడో రౌండ్లో అభ్యర్థి పద్మావతి ఎలిమినేట్ అయ్యారు.అనంతరం నాలుగో రౌండ్లో రాధాకృష్ణ, ఐదో రౌండ్లో సత్యనారాయణ, ఆరో రౌండ్లో శ్రీనివాసరావు, ఏడో రౌండ్లో దుర్గాప్రసాద్, ఎనిమిదో రౌండ్లో సూర్య ప్రకాష్ వరుసగా ఎలిమినేట్ అయ్యారు. మొత్తం 20,783 ఓట్లలో వెయ్యికి పైగా చెల్లని ఓట్లుగా నమోదు అయ్యాయి. మొత్తం 19,813 ఓట్లు లెక్కించారు. ఓట్ల లెక్కింపులో భాగంగా రెండో ప్రాధాన్యత ఓట్లతో గాదె శ్రీనివాసులు విజయం సాధించారు.

మొత్తం 20783 ఓట్లకు పోలింగ్ జరగగా.. ఇందులో 19813 ఓట్లు చెల్లేవిగా గుర్తించారు. ఇందులో తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో గాదె శ్రీనివాసులు నాయుడికి 7210 ఓట్లు రాగా.. కూటమి బలపరచిన ఏపీటీఎఫ్ అభ్యర్ధి రఘువర్మకు 6835 ఓట్లు వచ్చాయి. మూడో స్ధానంలో ఉన్న పీడీఎఫ్ అభ్యర్ధి విజయగౌరికి 5810 ఓట్లు వచ్చాయి. దీంతో ఫలితం రెండో రౌండ్ లోనే తేలనుంది. మొత్తం లెక్కిస్తున్న ఓట్లలో 2.3 శాతం చెల్లనివిగా తేలడం విశేషం.
ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. మూడు స్థానాల్లోను అభ్యర్థులను బరిలోకి దింప లేదు. మరో వైపు అధికార పక్షమైన కూటమి వర్గాలు ఈ ఎమ్మెల్సీల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ శ్రేణులు ఈ ఎన్నికల్లో తీవ్రంగా పని చేశారు. ఎన్నికలకు ముందు ఆరు నెలల నుంచే ప్రణాళిక ప్రకారం రంగంలోకి దిగారు.అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పక్షమైన బీజేపీ పీఆర్టీయు అభ్యర్థి, మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులునాయుడుకు మద్దతు ప్రకటించి ఆ మేరకు పని చేశాయి. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు గాదె శ్రీనివాసుల నాయుడు గెలుపు కోసం పని చేశాయి. తక్కిన తెలుగుదేశం, జనసేన శ్రేణులు, ఏపీటీఎఫ్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ వర్మకు మద్దతు ప్రకటించి ఆ మేరకు పని చేశాయి.
ఎమ్మెల్సీ స్థానానికి పోటా పోటీ నెల కొన్నా.. గెలుపు మాత్రం కూటమి బలపరచిన అభ్యర్థుల వైపే ఉండే అవకాశం ఉందని వేసిన అంచనాలు మారా యి.క్షేత్ర స్థాయిలో పని చేసిన విజయం దక్కలేదు.కానీ జరిగిన ఎన్నికలు మాత్రం సాధారణ ఎన్నికలను తలపిం చాయాని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more:Hyderabad:మారుతోన్న టాలీవుడ్

Related posts

Leave a Comment