Visakhapatnam:సాయిరెడ్డి సైలెంట్ పాలిటిక్స్:సైలెంట్ పాలిటిక్స్ సాగించడం ఓ కళే. ఔను.. అలా సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ, మరోవైపు పాలిటిక్స్ లో అంతా చక్కబెట్టడం కొందరు నేతలకు అలవాటేనట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. రాజకీయ విశ్లేషకులు. పాలిటిక్స్ నుండి సైడ్ అయినప్పటికీ అంత త్వరగా ఆ వాసన పోదని చెప్పవచ్చు. ఏపీ రాజకీయ ముఖచిత్రంలో ఆ నేత కీలకంగా వ్యవహరించారు. ఏం జరిగిందో ఏమో కానీ, రాజకీయాల నుండి సైడ్ అయ్యారు. సాగు పనుల్లోకి వెళ్తున్నట్లు చెప్పిన ఆ నేత అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తున్నారు.
సాయిరెడ్డి సైలెంట్ పాలిటిక్స్
విశాఖపట్టణం, మార్చి 4
సైలెంట్ పాలిటిక్స్ సాగించడం ఓ కళే. ఔను.. అలా సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ, మరోవైపు పాలిటిక్స్ లో అంతా చక్కబెట్టడం కొందరు నేతలకు అలవాటేనట. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. రాజకీయ విశ్లేషకులు. పాలిటిక్స్ నుండి సైడ్ అయినప్పటికీ అంత త్వరగా ఆ వాసన పోదని చెప్పవచ్చు. ఏపీ రాజకీయ ముఖచిత్రంలో ఆ నేత కీలకంగా వ్యవహరించారు. ఏం జరిగిందో ఏమో కానీ, రాజకీయాల నుండి సైడ్ అయ్యారు. సాగు పనుల్లోకి వెళ్తున్నట్లు చెప్పిన ఆ నేత అప్పుడప్పుడు తళుక్కున మెరుస్తున్నారు. ఇంతకు ఆ నేత ఎవరో కాదు.. మాజీ ఎంపీ, మాజీ వైసీపీ నేత విజయసాయి రెడ్డి.వైసీపీని స్థాపించిన సమయం నుండి మాజీ సీఎం జగన్ కు అన్నీ తానై వ్యవహరించారు సాయిరెడ్డి. జగన్ అడుగులో అడుగులు వేశారు.. పార్టీకి విధేయుడిగా కొనసాగారు. అదే రీతిలో జగన్ కూడా సాయిరెడ్డికి అంతే ప్రాధాన్యత కల్పించారు. వైసీపీ అధికారంలోకి రాగానే కొన్ని నెలలు నెంబర్ – 2 స్థానంలో సాయిరెడ్డి పేరు వినిపించింది. అయితే పార్టీని బలోపేతం చేసే భాద్యతను భుజాన ఎత్తుకున్న సాయిరెడ్డి పలు జిల్లాలలో పర్యటించారు. ఎన్నికల సమయంలో సాయిరెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీచేశారు. అప్పటికే రాజ్యసభ సభ్యుడిగా గల సాయిరెడ్డి, తన స్వంత జిల్లా నెల్లూరులో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కానీ ఓటమి పాలయ్యారు.ఎన్నికలలో వైసీపీ ఘోర ఓటమి చెందగా, సాయిరెడ్డి కొద్దిరోజులు పార్టీకి దూరంగా ఉన్నారు. కానీ ఢిల్లీ పాలిటిక్స్ లో చక్రం తిప్పగల సత్తా ఈయన సొంతం. జగన్ కు అన్నీ తానై నడిచిన సాయిరెడ్డి ఎవరూ ఊహించని రీతిలో రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. అంతటితో ఆగక తన రాజ్యసభ పదవి నుండి కూడా సైడ్ అయ్యారు. తనకున్న ఎంపీ పదవితో ఢిల్లీలో పలుకుబడి పెంచుకున్న సాయిరెడ్డి, వైసీపీకి దూరం కావడం నష్టమేనంటారు విశ్లేషకులు.
తాను ఇక రాజకీయాల జోలికి రానని, సాగు పనుల్లో నిమగ్నం కానున్నట్లు ఆయన ప్రకటించారు.అయితే సాయిరెడ్డి రాజీనామాపై జగన్ సంచలన కామెంట్స్ చేశారు. రాజకీయాలలో క్యారెక్టర్ ముఖ్యమని జగన్ చెప్పగా, అందుకు సాయిరెడ్డి తనకు క్యారెక్టర్ ఉంది కాబట్టే ఏ ప్రలోభాలకు లొంగలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు వైఎస్ ఫ్యామిలీ ఆస్తుల వివాదం ఓ వైపు సాగుతుండగా, మరోవైపు జగన్ కు దూరమైన సాయిరెడ్డి హైదరాబాద్ లో షర్మిళ ను కలవడం కూడా రాజకీయ దుమారం రేపింది. అయితే రాజీనామా చేసిన కొద్దిరోజులు రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు సాయిరెడ్డి కనిపించినా, తన దగ్గరి నేతలకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పలు పోస్టులు పెడుతున్నారు.ఇది ఆయనకు ఉన్న ఢిల్లీ పరిచయాలు కావడంతో శుభాకాంక్షలు తెలుపుతున్నారని భావించవచ్చు. అయితే ఆదివారం సాయిరెడ్డి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అది కూడా తెలంగాణ పర్యటనకు వచ్చిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధనకర్ జీని స్వాగతం పలికేందుకు సాయిరెడ్డి కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. తనకున్న పాత పరిచయాల ద్వారా సాయిరెడ్డి స్వాగతం పలికేందుకు వచ్చారని చెప్పవచ్చు.ఉపరాష్ట్రపతిని స్వాగతం పలికేందుకు వచ్చిన సాయిరెడ్డి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, వైసీపీకి చెందిన కొందరు నెగిటివ్ పోస్టులు పెట్టడం విశేషం. సాగు పనుల్లో ఉన్న సాయిరెడ్డి, నేరుగా ఎయిర్ పోర్టుకు వచ్చారని ఆ కామెంట్స్ సారాంశం. రాజకీయాలకు దూరంగా ఉంటారన్న సాయిరెడ్డి బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని కూడా కొందరు ప్రచారం సాగించారు. ఇన్ని రోజులు వైసీపీ బలోపేతానికి పని చేసిన సాయిరెడ్డిని ఉద్దేశించి వైసీపీకి చెందిన కొందరు ఇలా ప్రచారం చేయడం విశేషం. పాలిటిక్స్ కి దూరమైనంత మాత్రాన వ్యక్తిగత పరిచయాలు ఉండవా అంటూ మరికొందరు సాయిరెడ్డికి అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పిన సాయిరెడ్డి, మున్ముందు న్యూటర్న్ తీసుకుంటారేమోనన్న కోణంలో ప్రచారం ఊపందుకుంది.
Read more:Amaravathi : అమరావతికి వైసీపీ జై…