Amaravathi : అమరావతికి వైసీపీ జై…

Amaravathi YCP

Amaravathi : అమరావతికి వైసీపీ జై  : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు రాజధానుల నినాదం. ఈ నినాదంతోనే ఎన్నికలకు వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ నినాదం వల్లనే ఓడిపోయామని వారు అంగీకరించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏకైక రాజధాని.. అది కూడా అమరావతి అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. ఘన విజయం సాధించింది.

అమరావతికి వైసీపీ జై…

విజయవాడ, మార్చి 4
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మూడు రాజధానుల నినాదం. ఈ నినాదంతోనే ఎన్నికలకు వెళ్లిపోయారు. ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఈ నినాదం వల్లనే ఓడిపోయామని వారు అంగీకరించడం లేదు. కూటమి ప్రభుత్వం ఏకైక రాజధాని.. అది కూడా అమరావతి అన్న నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. ఘన విజయం సాధించింది. వచ్చే ఐదేళ్లలో అమరావతికి ఓ రూపు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ విధానం ఏమిటన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. మార్చుకుంటారా … మూడు రాజధానులకే కట్టుబడి ఉంటారా అని చర్చించుకోవడం ప్రారంభించారు. ఈ సమయంలో మాజీ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. మండలిలో రాజధాని అంశంపై దుమారం రేగిన తర్వాత బొత్స సత్యనారాయణ ఇద తరహాలో బయట మాట్లాడారు. మూడు రాజదానుల విధానానికే కట్టుబడి ఉన్నారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బొత్స సూటిగా సమాధానం ఇవ్వలేదు.

మూడు రాజధానుల విధానం అనేది అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయం అన్నారు. ఇప్పుడు మళ్లీ త మపార్టీ మూడు రాజధానులకే కట్టుబడి ఉందా లేదా అన్నది తాము పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బొత్స సత్యనారాయణ .. కొద్ది రోజుల కిందట తమ విధానం మూడు రాజధానులేనని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ విధానానికి కాలం చెల్లిందని.. మళ్లీ పార్టీలో చర్చిస్తామన్నారువైసీపీ 2019 ఎన్నికలకు ముందు రాజధానిని మార్చబోమని ప్రజలకు హామీ ఇచ్చింది. అయితే ఎన్నికలు అయ్యాక మూడు రాజధానులు అని చెప్పి విశాఖకు పాలనను తీసుకెళ్లాలని అనుకున్నారు. కానీ ఐదేళ్ల కాలంలో ఆ పని చేయలేకపోయారు. ఈ మధ్య కాలంలో ఎన్నో వివాదాలు వచ్చాయి. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తామని ఇంకా అద్భుతంగా నిర్మిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక మాట మార్చారన్న విమర్శలు వచ్చాయి.

అసెంబ్లీలో అమరావతిని ఏకగ్రీవంగా ఆమోదించి కూడా జగన్ .. అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులని మార్చారని విమర్శలు వచ్చాయి. అయితే వైసీపీ మాత్రం ముందుకే వెళ్లింది. జ్యూడిషియల్ క్యాపిటల్ గా ప్రకటించిన కర్నూలులోనూ… ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించిన విశాఖలోనూ వైసీపీకి ఒక్క సీటు కూడా రాలేదు. దాంతో ప్రజలకు ఆ నినాదం నచ్చలేదని అర్థమైంది. అయితే వైసీపీ ఎన్నికల తర్వాత మూడు రాజధానుల నినాదం ఎత్తడం లేదు. అదే సమయంలో అమరావతికి కూడా వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. కానీ మద్దతుగా కూడా మాట్లాడటం లేదు. ఈ క్రమంలో బొత్స వ్యాఖ్యల ప్రకారం పార్టీలో చర్చించి అమరావతిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Read more :Amaravati:జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రతిజ్ణ చేయించిన ముఖ్య కార్యదర్శి ఎంకె మీనా

Related posts

Leave a Comment