Hyderabadh : జగన్ పై కోర్టుకు విజయమ్మ…

. జగన్ పై కోర్టుకు విజయమ్మ…

హైదరాబాద్, మార్చి 1, (న్యూస్ పల్స్)
వైఎస్ జగన్మోహన్ రెడ్డికిమరో షాక్ తగిలింది. రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆస్తుల వ్యవహారంలో మరో భారీ ట్విస్ట్. పల్నాడు జిల్లాలోని వివాదాస్పద సరస్వతీ పవర్ వాటాలకు సంబంధించి గతంలో వైయస్ జగన్ హైదరాబాదులోని జాతీయ కంపెనీల లా ట్రిబ్యునల్ లో దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన తల్లి వైయస్ విజయమ్మ తాజాగా షాక్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆయన భార్య భారతికి ఇది ఇబ్బందికరమే. ఈ వివాదంలో షర్మిలకు ఊరట దక్కే విధంగా విజయమ్మ కోర్టులో తన అభిప్రాయాన్ని చెప్పేశారు. షర్మిలకు ఇది ఉపశమనం కలిగించే విషయం.తాజాగా జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తన అభిప్రాయాన్ని చెప్పారు విజయమ్మ సరస్వతీ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల కొనుగోలు, గిఫ్ట్ డిడ్ ద్వారా వచ్చిన వాటాలన్నీ గతంలో తన పేరు పైనే బదలాయించినట్లు విజయమ్మ కోర్టుకు తెలిపారు.

అందుకే సరస్వతీ పవర్ వాటాలపై ఉన్న అన్ని హక్కులు తనకే ఉన్నాయని చెప్పుకొచ్చారు. 99.75% వాటాలు తన పేరుతోనే ఉన్నాయని.. జగన్ తో పాటు భారతీయులకు వాటాలు లేవని తేల్చి చెప్పేశారు. దీంతో ఇది జగన్మోహన్ రెడ్డికి షాప్ ఇచ్చే అంశమే. తన కుమార్తె షర్మిల తో ఉన్న రాజకీయ వివాదాల కారణంగానే అన్యాయంగా తల్లినైన తనను కోర్టులో నిలబెట్టారని విజయమ్మ వాపోయారు. వాటాల బదలాయింపు అక్రమం అంటూ పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. అందుకే పిటిషన్లు కొట్టేసి.. తప్పుడు మార్గంలో ఆలోచించిన వారికి భారీ పెనాల్టీ విధించాలని కోర్టుకు విజయం కోరడం విశేషం.2021లో సరస్వతీ పవర్ లోని 46.71 లక్షల వాటాలను సండూర్ కంపెనీ, 71.50 లక్షల వాటాలను క్లాసిక్ రియాలిటీ కలిపి మొత్తం.. 1.21 కోట్ల వాటాలను తనకు విక్రయించిన విషయాన్ని గుర్తు చేశారు విజయమ్మ. అలాగే జగన్ 74.26 లక్షల వాటాలు, భారతి 40.50 లక్షల వాటాలు తనకు గిఫ్ట్ డిడ్ కింద బదిలీ చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.

దీని ప్రకారం గ తేడాది 14న తనకు వాటాలు బదిలీ అయ్యాయని చెప్పారు. దీనిని సరస్వతి పవర్ బోర్డ్ కూడా ఆమోదించి తనను సభ్యురాలిని చేసిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. కాబట్టి కంపెనీలో 99.75% వాటా ఉన్న తనను కుటుంబ కారణాలతో ప్రశ్నించడం కుదరదని కోర్టు ముందు తేల్చి చెప్పారు.కుమారుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో విజయమ్మ రాజీ పడినట్లు వార్తలు వచ్చాయి. పిల్లలిద్దరి మధ్య సర్దుబాటు చేసే ప్రయత్నంలో ఉన్నట్లు కూడా ప్రచారం నడిచింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విజయమ్మ తిరిగి యాక్టివ్ అవుతారని కూడా టాక్ నడిచింది. కానీ ఆమె కోర్టును సంప్రదించడంతో అటువంటిదంతా ప్రచారం అని తేలిపోయింది. కుమార్తె షర్మిల వైపే నని స్పష్టత వచ్చింది.

Read : eeroju.co.in/key-post-for-jc-pawan-జేసీ-పవన్-కు-కీలక-పదవి-eeroju

Related posts

Leave a Comment