RK Beach : సముద్రం ఎందుకు రంగు మారుతోంది…

sea
  • సముద్రం ఎందుకు రంగు మారుతోంది…

విశాఖపట్టణం, ఫిబ్రవరి 28, (న్యూస్ పల్స్)
సాధారణంగా సముద్రం నీలి రంగులో ఉంటుంది. తీరంలో ఇసుక కారణంగా కొన్నిసార్లు నలుపు రంగులో కనిపిస్తుంది. కానీ.. ఈ మధ్య ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో సముద్ర తీరం కనిపించింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ఇటీవల ఏపీ తీరంలో సముద్రం రంగులు మారుస్తోంది. దీన్ని చూసిన ప్రజలు ఆనందం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మాత్రం అసలు సముద్రం రంగు ఎందుకు మారుతోందని చర్చించుకుటున్నారు. గతేడాది మధ్యలో.. విశాఖ జిల్లా భీమిలి సమీపంలో సముద్రం ఎరుపు రంగులో కనిపించింది. ఆ తర్వాత ఇటీవల పెదజాలరిపేటలో పసుపు రంగులో కనిపించింది. తాజాగా విశాఖ ఆర్కే బీచ్ సమీపంలో ఆకుపచ్చగా కనిపించింది.తరుచూ సముద్రం రంగులు మార్చడం దేనికి సంకేతం అని ప్రజలు చర్చించుకున్నారు. నీలి రంగులో కనిపించే సముద్రం ఇలా రంగులు మారుతోంది ఎందుకు? సముద్రానికి రంగు మార్చే గుణం ఉందా? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సముద్రం రంగులు మారడానికి అనేక కారణాలు ఉన్నాయని సముద్ర శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ముఖ్యమైన 6 అంశాలు ఇలా ఉన్నాయిబంగాళాఖాతంలో తరచుగా తుఫానులు, వాయుగుండాలు ఏర్పడుతుంటాయి. వీటి ప్రభావం వల్ల సముద్రపు నీటిలో బురద, మట్టి కలవడం వల్ల రంగు మారవచ్చు.

తుఫానుల సమయంలో అలల ఉధృతి పెరిగి తీర ప్రాంతంలోని మట్టి, ఇసుక నీటిలో కలిసిపోతాయిగోదావరి, కృష్ణా వంటి పెద్ద నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఈ నదుల ద్వారా వచ్చే ఒండ్రు మట్టి సముద్రపు నీటి రంగును మారుస్తుంది. వర్షాకాలంలో నదులలో నీటి ప్రవాహం పెరిగినప్పుడు ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందిపారిశ్రామిక వ్యర్థాలు, మురుగునీరు సముద్రంలో కలవడం వల్ల నీటి రంగు మారవచ్చు. ఈ కాలుష్యం వల్ల నీటిలో ఆల్గే వంటి సూక్ష్మజీవులు పెరిగి రంగు మార్పునకు కారణమవుతాయి. మానవ కార్యకలాపాల వల్ల సముద్రంలోకి రసాయనాలు, కాలుష్య కారకాలు చేరడం వలన కూడా సముద్రం రంగు మారుతుందిఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఇసుక, ఇల్మెనైట్, మోనాజైట్ వంటి ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల కూడా నీటి రంగులో మార్పులు సంభవించవచ్చుసముద్రంలో ఫైటోప్లాంక్టన్ అనే చిన్న మొక్కలు ఉంటాయి. ఇవి సూర్యరశ్మి ద్వారా కిరణజన్య సంయోగక్రియను నిర్వహిస్తాయి.

కొన్నిసార్లు, పోషకాలు సమృద్ధిగా ఉన్నప్పుడు.. ఈ ఫైటోప్లాంక్టన్ వేగంగా వృద్ధి చెందుతాయి. దీనిని “ప్లాంక్టన్ వికసించడం” అంటారు. ఈ వికసించడం వల్ల నీరు ఆకుపచ్చగా లేదా ఇతర రంగులలోకి మారుతుంది.సూర్యకాంతి సముద్రంలోకి ప్రవేశించినప్పుడు.. అది నీటి అణువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నీలం రంగు కాంతి ఇతర రంగుల కంటే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. అందుకే సాధారణంగా సముద్రం నీలంగా కనిపిస్తుంది. అయితే.. నీటిలో ఎక్కువ అవక్షేపం లేదా ప్లాంక్టన్ ఉన్నప్పుడు, ఇతర రంగులు కూడా వ్యాప్తి చెందుతాయి. దీని వలన నీరు ఆకుపచ్చగా కనిపిస్తుంది.

Read : Andhra Pradesh:ప్రకాశం, పల్నాడులలో బయో గ్యాస్ ప్లాంట్లు

Related posts

Leave a Comment