Ongole:జనసేన గూటికి మాజీ మంత్రి:ఆ మాజీమంత్రి టీడీపీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయంట. పార్టీ మారాలని వైసీపీకి రాజీనామ చేసి నెలల గడుస్తున్నా టైమ్ కలసి రావటం లేదట. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒకప్పుడు సన్నిహితుడిగా పేరున్న ఆ మాజీ మంత్రికి ఇప్పుడు చంద్రబాబు అపాయింట్మెంటే దొరకడం లేదంట. వైసీపీలోకి వెళ్లి తప్పు చేశాను.. తిరిగి సొంత గూటికి వచ్చేస్తానని అంటున్నా.. ఆయనకి చిన్న బాబు నో ఎంట్రీ బోర్డు పెట్టారంట. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు.. బడా గ్రానేట్ వ్యాపారి.. కొద్ది నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు.
జనసేన గూటికి మాజీ మంత్రి
ఒంగోలు, ఫిబ్రవరి 27
ఆ మాజీమంత్రి టీడీపీలో చేరేందుకు చేస్తున్న ప్రయత్నాలు బూమరాంగ్ అవుతున్నాయంట. పార్టీ మారాలని వైసీపీకి రాజీనామ చేసి నెలల గడుస్తున్నా టైమ్ కలసి రావటం లేదట. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒకప్పుడు సన్నిహితుడిగా పేరున్న ఆ మాజీ మంత్రికి ఇప్పుడు చంద్రబాబు అపాయింట్మెంటే దొరకడం లేదంట. వైసీపీలోకి వెళ్లి తప్పు చేశాను.. తిరిగి సొంత గూటికి వచ్చేస్తానని అంటున్నా.. ఆయనకి చిన్న బాబు నో ఎంట్రీ బోర్డు పెట్టారంట. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీమంత్రి శిద్దా రాఘవరావు.. బడా గ్రానేట్ వ్యాపారి.. కొద్ది నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు. 2014లో చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పనిచేసిన శిద్దా రాఘవరావు.. 2019లో ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత ఆయన వ్యాపార అవసరాల కోసం వైసీపీ కండువా కప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో దర్శి నియోజక వర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని ఆయన భావించినా సాధ్యపడలేదు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఉమ్మడి ప్రకాశం లోని అద్దంకి, ఒంగోలు, మార్కాపురం స్థానాలలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని సూచించినా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు.తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఆరంగ్రేటం చేసిన శిద్దా రాఘవరావు 2004లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు.

అనంతరం టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.. 2014లో ప్రకాశం జిల్లా దర్శి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా తొలిసారి విజయం సాధించి అప్పటి అధికార టీడీపీలో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికలలో కూడా ఆయన తిరిగి దర్శి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని భావించినా అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఒంగోలు పార్టమెంట్ అభ్యర్థిగా బరిలో దిగాల్సి వచ్చింది. అయితే, ఆ ఎన్నికల్లో ఆయన అప్పటి వైసీపీ అభ్యర్ది మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావటంతో కొంతకాలం తర్వాత అప్పటి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసిన శిద్దా తాను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాననే విషయం మాత్రం ఇప్పటి వరకు ఎక్కడా ప్రకటించలేదు. అయితే విజయవాడ వరదల సమయంలో సీఎం చంద్రబాబును కలవడం రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. తన సోదరులతో వెళ్లి చంద్రబాబును కలిసిన శిద్దా.. వరద బాధితులకు విరాళం ఇచ్చారు.
అయితే వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఆయన చంద్రబాబును కలవాలని చూస్తున్నా అది సాధ్యపడటంలేదట.పార్టీ నుంచి తనకు ఎటువంటి పదవుల హామీలు లభించక పోయినా తాను మాత్రం టీడీపీలోకి తిరిగి వచ్చేందుకు సిద్దంగా ఉన్నానని శిద్దా రాఘవరావు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనర్ధన్ తో రాయబారం నడిపినా అధిష్టానం వైపు నుంచి గ్రీన్ సిగ్నెల్ రావడం లేదంట. అధినేత నుంచి క్లారిటీ రాక పోవటంతో టీడీపీలో చేరిక కోసం ఎదురు చూస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. శిద్దా టీడీపీలో చేరిక విషయంలో సీఎం చంద్రబాబు కొంత వరకు సానుకూలంగా ఉన్నప్పటికీ.. మంత్రి నారా లోకేష్ మాత్రం ఆయన రాకకు సుముఖత వ్యక్తం చేయటం లేదని తెలుస్తోంది.సీఎం చంద్రబాబుతో పాటు నారా లోకేష్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే శిద్దా టీడీపీ చేరికకు లైన్ క్లియర్ అవుతుందని పార్టీ లోని సీనియర్ నేతలు కూడా శిద్దా తేల్చి చెప్పారట. దీంతో ఆయన చేసేదేమీ లేక అవకాశం కోసం చూస్తూ ఉండి పోయారట. ఇప్పటకే ఒంగోలుకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేన పార్టీలో చేరారు. అప్పట్లో శిద్దా రాఘవరావుకి బాలినేని దగ్గర ఉండి వైసీపీ కండువ కప్పించారు. టీడీపీ నుంచి శిద్దాకి లైన్ క్లియర్ కాకపొతే మార్చి నెలలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాటికి శిద్దాకు జనసేన కండువా కప్పించడానికి బాలినేని రూట్ క్లియర్ చేస్తున్నారంట. శిద్దా జనసేనలో జాయిన్ అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీకి బలమైన ఆర్ధిక అండ దొరకడంతో పాటు ఇటు పార్టి ఎదుగుదలకు ఉపయోగపడుతుందనేది బాలినేని ఆలోచనగా తెలుస్తుంది. చూడాలి మరి శిద్దా రాఘవరావు ఏ పార్టీ పంచకు చేరతారో?