Andhra Pradesh:ప్రకాశం, పల్నాడులలో బయో గ్యాస్ ప్లాంట్లు

Bio gas plants at Prakasam and Palnadu

Andhra Pradesh:ప్రకాశం, పల్నాడులలో బయో గ్యాస్ ప్లాంట్లు:ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తొలి దశలో భాగంగా పల్నాడు, ప్రకాశం జిల్లాలలో రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కంప్రెస్ట్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటు గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతినిధులు మంగళవారం మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌తో చర్చించారు. సచివాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో ఆర్ఐఎల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కంప్రెస్ట్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని రిలయన్స్ ప్రతినిధులను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కోరారు.

ప్రకాశం, పల్నాడులలో బయో గ్యాస్ ప్లాంట్లు

ఒంగోలు, ఫిబ్రవరి 27
ఆంధ్రప్రదేశ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. తొలి దశలో భాగంగా పల్నాడు, ప్రకాశం జిల్లాలలో రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కంప్రెస్ట్ బయో గ్యాస్ (సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటు గురించి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రతినిధులు మంగళవారం మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌తో చర్చించారు. సచివాలయంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో ఆర్ఐఎల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కంప్రెస్ట్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటును వేగవంతం చేయాలని రిలయన్స్ ప్రతినిధులను మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కోరారు. తొలి విడతలో భాగంగా ప్రకాశం, పల్నాడు జిల్లాల్లోని బంజరు భూముల్లో రిలయన్స్ కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వివరించారు. ఈ ప్లాంట్ల ఏర్పాటు కోసం కావాల్సిన భూమిని అందించాలని రెవెన్యూశాఖ మంత్రిని కోరినట్లు గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌లో 500 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ సంస్థ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 65 వేల కోట్లు పెట్టుబడి పెట్టి 500 బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు.

వీటి ద్వారా రెండున్నర లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తొలి దశలో భాగంగా ప్రకాశం జిల్లా కనిగిరి, పల్నాడు జిల్లాలలో వీటిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. రిలయన్స్ బయో ఎనర్జీ లిమిటెడ్ ద్వారా ఈ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నారు. కనిగిరిలో మొదటి ప్లాంటు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. కనిగిరిలో రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాట కోసం 4000 ఎకరాల బంజరు భూమిని గుర్తించినట్లు తెలిసింది. ఈ నాలుగు వేల ఎకరాలను రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు లీజుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.బీడు భూములు అధికంగా ఉన్న నేపథ్యంలో కనిగిరి ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు సమాచారం.ఈ బంజరు భూముల్లో ఒక రకమైన గడ్డిని పెంచి.. ఆ గడ్డి ద్వారా బయో గ్యాస్ ఉత్పత్తి చేయనున్నారు. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు కోసం సేకరించనున్న నాలుగు వేల ఎకరాల భూమిలో.. ప్రభుత్వ భూమికి అయితే ఎకరాకు ఏడాదికి 15 వేలు, ప్రైవేట్ భూమికి అయితే ఎకరాకు ఏడాదికి రూ.30వేలు చొప్పున కౌలు చెల్లించనున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా రైతులతో మాట్లాడి కౌలు ఒప్పందాలు పూర్తి చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

Read more:Andhra Pradesh:ఆరు నెలల్లోనే ఫోరెన్సిక్ ల్యా్బ్ పనులు 90 శాతం పూర్తి

Related posts

Leave a Comment