Kadapa:ఓ వైపు రాజీనామాలు..మరో వైపు ఒత్తిళ్లు

ysrcp-jagan

Kadapa:ఓ వైపు రాజీనామాలు..మరో వైపు ఒత్తిళ్లు:నేతల వరుస రాజీనామాలు ఓవైపు టెన్షన్‌ పెడుతుంటే.. ఉన్న నాయకుల్లో ఆధిపత్య పోరు వైసీపీని మరింత కార్నర్ అయ్యేలా చేస్తోంది. మిగతా చోట్ల ఎలా ఉన్నా… జగన్ సొంత జిల్లాలోనే ఫ్యాన్ రెక్కలు చప్పుడు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఓ వైపు రాజీనామాలు..మరో వైపు ఒత్తిళ్లు

కడప, ఫిబ్రవరి 27
నేతల వరుస రాజీనామాలు ఓవైపు టెన్షన్‌ పెడుతుంటే.. ఉన్న నాయకుల్లో ఆధిపత్య పోరు వైసీపీని మరింత కార్నర్ అయ్యేలా చేస్తోంది. మిగతా చోట్ల ఎలా ఉన్నా… జగన్ సొంత జిల్లాలోనే ఫ్యాన్ రెక్కలు చప్పుడు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. లీడర్లను కాపాడుకోవడానికి జగన్‌..చాలా కష్టపడుతున్నారనే ప్రచారం జరుగుతోంది.జమ్మలమడుగులో కీలక నేతలు ఒకరిపై ఒకరు సాకులు చెప్పుకుంటూ పార్టీని డైలమాలో పడేస్తున్నారట. జమ్మలమడుగు రగడకు చెక్ పెట్టకపోతే ఉన్న పార్టీ కేడర్‌ జారుకునే పరిస్థితి కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య.. జమ్మలమడుగు జగడం నడుస్తోంది. జగన్ ఎన్నిసార్లు సర్దిచెప్పినా.. పరిస్థితి మళ్లీ మొదటికే వస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.ఆ మధ్య సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చిన జగన్.. జమ్మలమడుగులో చెరో మూడు మండలాలు చూసుకోమని చెప్పి పంపించారు. ఎవరికి కేటాయించిన మండలాల్లో.. అప్పటి నుంచి వాళ్లు కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఐతే కొద్దిరోజుల పాటు అంతా బాగానే ఉంది. ఇన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.. ఇప్పుడు జమ్మలమడుగు పార్టీ కార్యాలయానికి తరచుగా వస్తున్నారు.ఇదే మరోసారి చర్చకు దారి తీస్తుంది.

మరోవైపు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పార్టీ కార్యక్రమాలతో పాటు… రైతు నిరసనలను అజెండాగా పెట్టుకుని తనకు కేటాయించిన మండలాల్లో పార్టీ బలోపేతం దిశగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు సుధీర్ రెడ్డి రాకతో వైసీపీ కేడర్‌ కన్ఫ్యూజన్‌లోకి వెళ్తున్నట్టు టాక్.రామసుబ్బారెడ్డికి కేటాయించిన మండలాల్లో.. ఇప్పుడు సుధీర్‌ రెడ్డి పర్యటించడం కొత్త చర్చకు దారి తీస్తోంది. లోకల్‌గా ఫ్యాన్‌ పార్టీకి ట్రబుల్ క్రియేట్ చేస్తోంది. సుధీర్‌రెడ్డి మీద వ్యతిరేకంతో ఉన్న కొందరు నేతలు.. ఎవరి దారి వారు చూసుకునేందుకు కూడా రెడీ అవుతున్నారట. వైసీపీ నుంచి జంప్ అయ్యే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారని ప్రచారం జరుగుతోంది. రామ సుబ్బారెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనడానికి వెళ్లారు. ఇలాంటి టైమ్‌లో జమ్మలమడుగులో సుధీర్ రెడ్డి పర్యటించగా.. ఈ విషయాలను పార్టీ కేడర్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తమకు ఒక్క లీడర్‌ను కేటాయించాలని కోరినట్లు టాక్. దానికి కొంత టైమ్ పడుతుందని.. త్వరలోనే అన్నీ సెట్ అవుతాయని చెప్పి వాళ్లను జగన్ తిరిగి పంపించినట్లు తెలుస్తోంది.ఏమైనా జమ్మలమడుగు ఆధిపత్య జగడం.. ఇప్పుడు వైసీపీని ప్రమాదంలో పడేసేలా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే.. పార్టీ కేడర్‌ చేయి జారిపోయే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయ్.

Read more:Hyderabad:ట్రాఫిక్ సమస్యలకు చెల్లు చీటి

Related posts

Leave a Comment