Kumbh Mela:చివరి దశకు కుంభమేళ

Triveni Sangam Punyasnanala

Kumbh Mela:చివరి దశకు కుంభమేళ:ప్రయాగ్ రాజ్ కుంభమేళ ప్రస్తుతం భక్తజన సంద్రంగా మారింది. ప్రతి రోజు ఫిబ్రవరి 26న మహా శివరాత్రి వేళ చివరి షాహిస్నానం ఉండనుంది. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అంతేకాకుండా.. త్రివేణి సంగమం పుణ్యస్నానాలకు వస్తున్న భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా యూపీ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

చివరి దశకు కుంభమేళ

లక్నో, ఫిబ్రవరి 25
ప్రయాగ్ రాజ్ కుంభమేళ ప్రస్తుతం భక్తజన సంద్రంగా మారింది. ప్రతి రోజు ఫిబ్రవరి 26న మహా శివరాత్రి వేళ చివరి షాహిస్నానం ఉండనుంది. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అంతేకాకుండా.. త్రివేణి సంగమం పుణ్యస్నానాలకు వస్తున్న భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా యూపీ సర్కారు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. 144 ఏళ్ల తర్వాత ఏర్పడిన కుంభమేళ కావడంతో  భక్తులు ఎలాగైన పుణ్యస్నానాలు ఆచరించాలని ఆసక్తి చూపిస్తున్నారు.ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కుంభమేళ చివరి దశకు చేరుకుంది. కుంభమేళకు ఇప్పటి వరకు దేశజనాభాలో సగం మంది భక్తులు  పుణ్యస్నానాలు ఆచరించారని యూపీ సర్కారు ప్రకటించింది. అంతే కాకుండా.. ఈసారి కుంభమేళ దాదాపుగా.. 60 కోట్ల మంది దాటి పోయేందుకు కూడా ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారుఈ క్రమంలో ప్రస్తుతం ప్రయాగ్ రాజ్ కు కుంభమేళకు ఎలాగైన వెళ్లి దర్శనం చేసుకొవాలని భక్తులు భావిస్తున్నారు. దీనికోసం ఇండియన్ రైల్వేస్ కోసం ప్రత్యేకంగా కుంభమేళకు రైళ్లను నడిపిస్తుంది.  అంతే కాకుండా.. కుంభమేళ చివరి రెండు రోజుల్లో కూడా భారీగా రైళ్లను నడుపనున్నట్లు తెలిపింది.మరొవైపు.. కుంభమళలో ఇతర రైళ్లను నిలిపివేసినట్లు ఇండియన్ రైల్వేస్ ఒక ప్రకటన విడుదల చేసింది.  మొత్తంగా భక్తులు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా.. అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. మొత్తండా ప్రయాగ్ రాజ్ కుంభమేళకు ఇప్పటి వరకు.. రాజకీయ ప్రముఖులతో పాటు, సెలబ్రీటీలు కూడా దర్శనాలకు పొటేత్తారు. మొత్తంగా కుంభమేళ షాహి స్నానాలకు మరో రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో భారీగా భక్తులు తరలి వస్తున్నారు.
Read more:Tamilnadu elections:ఏడాది ముందే నుంచి ఎన్నికల హడావిడి

Related posts

Leave a Comment