New Delhi:ఒబేసిటీ నియంత్రణ కోసం 10 మంది నామినేట్ చేసిన ప్రధాని

10 for obesity control Nominated Prime Minister

New Delhi:ఒబేసిటీ నియంత్రణ కోసం 10 మంది నామినేట్ చేసిన ప్రధాని:ఒబేసిటీ(ఊబకాయం, స్థూలకాయం) పెద్ద ఆరోగ్య సమస్యగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. 2022లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ(వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) నివేదికలు చెబుతున్నాయని వివరించారు. అలాగే ఇండియాలో కూడా ఎనిమిది మందిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారని, ఈ సమస్య నుంచి అధిగమించాలని ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. తినే ఆహారంలో నూనె వాడకాన్ని తగ్గించడంపై కూడా మోదీ మాట్లాడారు.

ఒబేసిటీ నియంత్రణ కోసం 10 మంది
నామినేట్ చేసిన ప్రధాని

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25
ఒబేసిటీ(ఊబకాయం, స్థూలకాయం) పెద్ద ఆరోగ్య సమస్యగా మారిందని ప్రధాని మోదీ అన్నారు. 2022లో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 250 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ(వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌) నివేదికలు చెబుతున్నాయని వివరించారు. అలాగే ఇండియాలో కూడా ఎనిమిది మందిలో ఒకరు అధిక బరువుతో బాధపడుతున్నారని, ఈ సమస్య నుంచి అధిగమించాలని ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. తినే ఆహారంలో నూనె వాడకాన్ని తగ్గించడంపై కూడా మోదీ మాట్లాడారు. దీన్ని ఒక ఉద్యమంలా కొనసాగించేందుకు ఓ 10 మంది ప్రముఖలను నామినేట్‌ చేశారు.అధిక బరువు సమస్యను నివారించడం, ఆహారంలో నూనె వాడకం తగ్గించడంపై అవగాహన కల్పించడమే కాకుండా, దానికి అసరమైన జాగ్రత్త చర్యలు తీసుకునేంటూ ఈ మూమెంట్‌ను మరింత ముందు తీసుకెళ్లేందుకు ప్రధాని పది మందిని నామినేట్‌ చేస్తూ ఎక్స్‌ వీడియో పోస్ట్‌ చేశారు. “నిన్నటి మన్‌కీ బాత్‌లో చెప్పినట్లుగా.. ఊబకాయంపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పించడానికి నేను ఈ వ్యక్తులను నామినేట్‌ చేయాలనుకుంటున్నాను. మన ఈ ఉద్యమం మరింత పెద్దదిగా మారేందుకు ఒక్కొక్కరు మరో పది మందిని నామినేట్‌ చేయాలని కూడా కోరుతున్నాను” ప్రధాని మోదీ ట్వీట్‌చేశారు.

అయితే మోదీ నామినేట్‌ చేసిన వారిలో మహీంద్ర గ్రూప్‌ ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్ర, భోజ్‌పురి నటుడు, గాయకుడు, బీజేపీ నేత నిరహువా(దినేష్‌ లాల్‌ యాదవ్‌), అథ్లెట్‌ మనూ భాకర్‌, వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయ్‌ చాను, మలయాళ నటుడు మోహన్‌లాల్‌, ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్‌ నందన్‌ నీలెకని, జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, నటుడు మాధవన్‌, సింగర్‌ శ్రేయా ఘోషల్‌, సుధా మూర్తి ఉన్నారు.ఎందుకు మోదీ ఈ ఉద్యమం మొదలుపెట్టారంటే.. ఊబకాయం తెలియకుండానే అనేక మంది జీవితాలను క్లిష్టం చేస్తుంది. ఊబకాయం శరీరంలో కొవ్వు అధికంగా పేరుకుపోవడం, మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటుతో పాటు మరికొన్ని రకాల క్యాన్సర్లు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర పానీయాలు, ఫాస్ట్ ఫుడ్ వంటి ఆహార పదార్థాలు బరువు పెరగడానికి కారణం అవుతున్నాయి. అలాగే అధిక నూనె వినియోగం ఊబకాయానికి ప్రధాన కారణం, ఎందుకంటే నూనెలు కేలరీలు అధికంగా ఉంటాయి, ఒక టేబుల్ స్పూన్ నూనె దాదాపు 120 కేలరీలు కలిగి ఉంటుంది. ఎక్కువ శుద్ధి చేసిన నూనెలను తీసుకోవడం, ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉన్న నూనెను వాడటం వల్ల కొవ్వు అధికంగా పేరుకుపోయేలా చేస్తాయి. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. కాలక్రమేణా, అధిక నూనె వినియోగం జీవక్రియకు అంతరాయం కలిగిస్తుంది, చెడు కొలెస్ట్రాల్‌ను పెంచి, ఇన్సులిన్ నిరోధకతకు దోహదం చేస్తుంది. అందుకే ఊబకాయంపై పోరాటం గురించి ప్రధాని మోదీ తన మన్‌కీ బాత్‌లో ప్రస్తావించడమే కాకుండా.. ప్రజలకు అవగాహన కల్పించాలని ఓ పది మంది ప్రముఖలను నామినేట్‌ చేశారు. చూడాలి మరి ఆ పది మంది ఎవరిని నామినేట్‌ చేస్తారో.

Read more:Andhra Pradesh:జనసేన గూటికి దువ్వాడ వాణి

Related posts

Leave a Comment