Hyderabad:37 కిలోమీటర్లు..24 స్టేషన్లు మెట్రో అప్ డేట్ డిటైల్స్

A key announcement has been made regarding the expansion of Hyderabad Metro Rail.

Hyderabad:37 కిలోమీటర్లు..24 స్టేషన్లు మెట్రో అప్ డేట్ డిటైల్స్:హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై కీలక ప్రకటన వచ్చేసింది. ఇన్ని రోజులు ప్రతిపాదనలు, డీపీఆర్ అంటూ రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మాత్రం హైదరాబాద్ మెట్రోరైలు సంస్థే అధికారికంగా ప్రకటించింది. స్టేషన్లు, విస్తరణ ప్రాంతాలు అన్నింటినీ మ్యాప్స్‌తోపాటు ఎక్స్‌ ఖాతాలో షేర్ చేసింది. మెట్రో రైలు మార్గాన్ని శంషాబాద్ ఎయిపోర్టు వరకు విస్తరించాలని ఎప్పటి నుంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ప్రకటించడమే తప్ప అధికారిక ప్రకటన రాలేదు. తొలిసారి హైదరాబాద్ మెట్రో సంస్థ దీనిపై స్పష్టమైన ప్రకటన చేసింది.

37 కిలోమీటర్లు..24 స్టేషన్లు
మెట్రో అప్ డేట్ డిటైల్స్..

హైదరాబాద్, ఫిబ్రవరి 23
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణపై కీలక ప్రకటన వచ్చేసింది. ఇన్ని రోజులు ప్రతిపాదనలు, డీపీఆర్ అంటూ రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మాత్రం హైదరాబాద్ మెట్రోరైలు సంస్థే అధికారికంగా ప్రకటించింది. స్టేషన్లు, విస్తరణ ప్రాంతాలు అన్నింటినీ మ్యాప్స్‌తోపాటు ఎక్స్‌ ఖాతాలో షేర్ చేసింది. మెట్రో రైలు మార్గాన్ని శంషాబాద్ ఎయిపోర్టు వరకు విస్తరించాలని ఎప్పటి నుంచే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు ప్రకటించడమే తప్ప అధికారిక ప్రకటన రాలేదు. తొలిసారి హైదరాబాద్ మెట్రో సంస్థ దీనిపై స్పష్టమైన ప్రకటన చేసింది. రెండో దశ మెట్రో నాగోల్ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు వరకు విస్తరించబోతున్నట్టు తెలిపారు. దాదాపు 37 కిలోమీటర్లు ఉండే ఈ రూట్‌లో 24 స్టేషన్లు రానున్నాయి. మెట్రో సంస్థ చెప్పినట్టు ఆ స్టేషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. ఈ రూట్‌ను ప్రత్యేకంగా ఉంచోతున్నట్టు స్పష్టమవుతోంది. అందుకే స్టార్టింగ్ పాయింట్ కనెక్టింగ్ పాయింట్స్‌కు ఎయిర్‌పోర్టు అని ప్రత్యేకంగా మార్కింగ్ చేశారు. నాగోల్(ఎయిర్ పోర్టు), నాగోల్ ఎక్స్ రోడ్డు, అల్కాపురి, కామినేని హస్పిటల్, ఎల్బీనగర్(ఎయిర్ పోర్ట్), బైరమాల్‌గూడ, మైత్రీనగర్, కర్మాన్‌ఘాట్, చంపాపేట్, ఓవైసీ హస్పిటల్, డీఆర్డీఓ, కంచాన్ బాగ్, బాలాపూర్ రోడ్డు, చాంద్రాయన్ గుట్ట, బండ్లగుడ రోడ్, మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, ఆరాంఘర్, న్యూ హైకోర్టు, గగన్ పహాడ్, శాతంరాయి, సిద్దాంతి, శంషాబాద్, కార్గో, రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లను ప్రత్యేక స్టేషన్‌లుగా చేయనున్నారు. ప్రస్తుతం సర్వీస్ అందిస్తున్న మెట్రో కేవలం 69 కిలోమీటర్లు మాత్రమే. ఇప్పుడు దాదాపు 161.4 కిలోమీటర్ల మేరకు విస్తరంచబోతున్నారు. దీంతో మొత్తం కలిసి 230 కిలోమీటర్లకుపైగా ప్రాంతానికి మెట్రో సర్వీస్లు అందుతాయి.

ఇప్పటి వరకు ఢిల్లీ మెట్రో మాత్రమే ఎక్కువ దూరం సర్వీస్లు అందిస్తోంది. రెండో దశ పూర్తి అయితే ఢిల్లీ స్థాయికి హైదరాబాద్ మెట్రో చేరుకుంటుంది. హైదరాబాద్ ఏ మూల నుంచి ఏ మూలైనా వెళ్లేలా రెండో దశ మెట్రో విస్తరణ చేపడుతోంది ప్రభుత్వం. ఆ ప్లాన్‌తోనే డీపీఆర్ రెడీ చేసి కేంద్రానికి పంపించారు. కేవలం ఎయిర్‌ పోర్టు వరకే కాకుండా కొత్త నిర్మిస్తున్న ఫోర్త్ సిటీ వరకు కూడా సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫోర్త్‌ సిటీ వరకు నిర్మించే కొత్త రూట్‌ను ఔటర్‌ రింగు రోడ్డు పై నుంచి తుక్కుగూడ, కొంగరకలాన్‌, రంగారెడ్డి కలెక్టరేట్‌ మీర్‌ఖాన్‌పేట వరకు కొత్తగా మెట్రో రూట్ నిర్మించనున్నారు. ఈ నిర్మాణంతోపాటు ఇప్పుడు ఉన్న రూట్‌లను పొడగించనబోతున్నారు. అంటే ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్ వరకు ఉన్న కారిడార్-1 కేవలం 29 కిలోమీటర్లే ఉంది. దీన్ని మరో ఇరవై కిలోమీటర్లకు విస్తరిస్తారు. మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు దాదాపు 13 కిలోమీటర్లు విస్తరిస్తారు. అటు ఎల్బీ నగర్‌ నుంచి హయత్‌నగర్ వరకు ఏడు కిలోమీటర్లు విస్తరిస్తారు. ఇలా ఈ కారిడార్‌ -1ను యాభై కిలోమీటర్ల వరకు విస్తరిస్తారు. జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మధ్య ఉన్న రెండో కారిడార్‌ ప్రస్తుత నిడివి 11 కిలోమీటర్లే. దీన్ని దాదాపు 30 కిలోమీటర్ల వరకు పొడిగిస్తారు. ఎంజీబీఎస్‌ నుంచి చాంద్రాయణగుట్ట వరకు ఏడున్నర కిలోమీటర్లు విస్తరిస్తారు. జేబీఎస్‌ నుంచి శామీర్‌పేట వరకు 22 కిలోమీటర్లు పొడిగిస్తారు. ఇదే రూట్‌లో అంటే ప్యారడైజ్‌ వద్ద ఉన్న స్టేషన్ నుంచి బోయిన్‌పల్లి, సుచిత్ర, మేడ్చల్‌ వరకు 23 కిలోమీటర్లు విస్తరిస్తూ కొత్త రూట్ వేస్తారు. మూడో కారిడార్ నాగోల్‌ నుంచి రాయదుర్గం వరకు ఉంది. 29 కిలోమీటర్లు ఉన్న ఈ కారిడార్‌ను కూడా ముఫ్పైకిపైగా కిలోమీటర్లు విస్తరిస్తారు. నాగోల్ రూట్‌ను శంషాబాద్‌వరకు పొడిగించడమే కాకుండా అక్కడ ఎల్బీనగర్‌కు అనుసంధానిస్తారు. అటు రాయదుర్గం మెట్రోస్టేషన్‌ నుంచి కోకాపేట నియోపోలీస్‌ లేఅవుట్‌ వరకు కొత్త రూట్‌ నిర్మిస్తారు. ఇలా హైదరాబాద్‌లో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి చేరుకోవాలన్నా తక్కువ టైంలోనే చేరుకునేలా మెట్రో రూట్ సిద్ధం చేసి కేంద్రానికి పంపించారు. అక్కడి నుంచి అనుమతి వచ్చిన వెంటనే పనులు ప్రారంభించబోతున్నారు.

Read more:Hyderabad:ఇలా చేరి.. అలా బయిటకు

Related posts

Leave a Comment