Nalgonda:మరింత ఆలస్యం కానున్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు

Srisailam Left Bank Canal project is the long-standing wish of the people of the united Nalgonda district

Nalgonda:మరింత ఆలస్యం కానున్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు:ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు. ఆరు నియోజకవర్గాల్లో 3 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు.. 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు.. నాలుగు దశాబ్దాల కాలంగా ముందుకు సాగడం లేదు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ పనులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. దీంతో సుమారు ఐదేళ్ల తర్వాత టన్నెల్‌ పనులు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది.

మరింత ఆలస్యం కానున్న శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు.

నల్గోండ, ఫిబ్రవరి 24
ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజల చిరకాల వాంఛ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ప్రాజెక్టు. ఆరు నియోజకవర్గాల్లో 3 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు.. 516 ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు.. నాలుగు దశాబ్దాల కాలంగా ముందుకు సాగడం లేదు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్ట్‌ పనులను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి సర్కార్‌ ఫుల్‌ ఫోకస్‌ పెట్టింది. దీంతో సుమారు ఐదేళ్ల తర్వాత టన్నెల్‌ పనులు ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది.శ్రీశైలం ప్రాజెక్టు నుంచి నల్గొండ జిల్లాకు నీటిని తరలించే ప్రాంతం పూర్తిగా నల్లమల అటవీ ప్రాంతం. పర్యావరణ నిబంధనల మేరకు ఓపెన్ కాలువ తవ్వి పనులు చేయాలంటే కష్టమైన పని. అందుకే టన్నెల్ ద్వారా నీటిని తరలించాని నిర్ణయించారు. ఆయకట్టుకు సాగునీటిని మళ్లించేందుకు నిర్మిస్తున్న ఎస్‌ఎల్‌బీసీ సొరంగం దేశంలోనే అతి పెద్దది. ఈ టన్నెల్‌ నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట దగ్గర మొదలై.. అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి దగ్గర పూర్తవుతుంది.శ్రీశైలం నీటిమట్టం 826 అడుగుల నుంచి నీటిని మళ్లించేలా.. నాలుగువేల క్యూసెక్కుల సామర్థ్యంతో 43.93 కిలో మీటర్ల దూరం టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌తో సొరంగం తవ్వుతున్నారు. దీనిద్వారా వచ్చిన నీటిని డిండి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లో నింపాలి. శ్రీశైలం వైపు నుంచి చేపట్టిన ఇన్‌లైట్‌ సొరంగం 13.97 కిలోమీటర్ల తవ్వకం పని పూర్తయింది. నీళ్లు బయటకు వచ్చే ఔట్‌లెట్‌ వైపు నుంచి 20.4 కి.మీ. దూరం తవ్వారు. మొత్తమ్మీద మరో 9.6 కి.మీ. మేర సొరంగం ఇంకా తవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని దోమలపెంట సమీపంలో పనులు జరుగుతుండగా సొరంగం 14వ కిలోమీటర్‌ దగ్గర ప్రమాదం జరిగింది.ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్ట్‌లో భాగంగా డిండి రిజర్వాయర్‌ నుంచి ఆయకట్టుకు నీటిని తరలించేందుకు.. 7.130 కిలోమీటర్ల మేర మరో సొరంగం కూడా చేపట్టారు. ఈ రెండో సొరంగమార్గం ఇప్పటికే తవ్వకం పూర్తయ్యింది. ఇది నల్లగొండ జిల్లా చందంపేట మండల తెల్‌దేవరపల్లి నుంచి నేరెడుగొమ్మ వరకు ఉంది. టీబీఎంతో చేపట్టిన ఈ ప్రధాన సొరంగం పనులే పూర్తి కావాల్సి ఉంది. త్వరలోనే ఇవి పూర్తవుతాయని భావిస్తున్న తరుణంలో జరిగిన ఈ ప్రమాదం.. ప్రాజెక్ట్‌ను మరింత ఆలస్యం చేస్తోంది.
భయంకరమైన ప్రాజెక్టన్న కేసీఆర్
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్‌లో జరిగిన ప్రమాదం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో అగ్గి రాజేస్తోంది. శనివారం (ఫిబ్రవరి 22న) ఉదయం ఎనిమిదిన్నర సమయంలో ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో ఒక్కసారిగా పైకప్పు కుప్పకూలింది. నాగర్ కర్నూల్ జిల్లా దోమలకుంట సమీపంలో 14 కిలోమీటర్ల తర్వాత మూడు మీటర్ల మేర పైకప్పు కూలటంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో టన్నెల్‌లో 35 మంది కార్మికులుండగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. చాలా మంది కార్మికులు టెన్నెల్ నుంచి బయటకు వచ్చేయగా.. ఇప్పటికి కూడా అందులోనే కొంత మంది ఉండిపోయారు. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. డీఆర్ఎఫ్ సిబ్బంది, ఆర్మీ రంగంలోకి దిగి కార్మికులకు కాపాడేందుకు కృషి చేస్తున్నారు. ఉంటే.. మరోవైపు రాజకీయంగా టన్నెల్ ఓ చర్చకు దారి తీసింది. ఈ ప్రమాదానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే భాధ్యత వహించాలని బీఆర్ఎస్ నేతలు వాదిస్తుంటే.. కేసీఆర్ సర్కారు చేసిన నిర్లక్ష్యం వల్లే ఈరోజు ప్రమాదానికి గురైందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే.. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టుపై కేసీఆర్ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఆ వీడియో 2016లోది కావటం గమనార్హం. తెలంగాణలో బీఆర్ఎస్ మొదటిసారి అధికారంలోకి వచ్చిన సమయంలో.. గత పాలకులు చేపట్టిన ప్రాజెక్టులు, వాటివల్ల తెలంగాణకు జరిగే నష్టాల గురించి అసెంబ్లీలో ఆనాడు సీఎంగా ఉన్న కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. ఈ సందర్భంగా ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు గురించి కూడా వివరించారు.అయితే.. ఎస్‌ఎల్‌బీసీ తవ్వుతున్న క్రమంలో శ్రీశైలం నిండినప్పుడల్లా టన్నెల్‌లోకి నీళ్లు వచ్చి ముగిపోతుంటుందని.. మళ్లీ వాటిని క్లియర్ చేయాల్సి వస్తుందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

అమ్రాబాద్ టైగర్ ఫారెస్ట్ కావటంతో.. అడవిలోకి జనాలు వెళ్లొద్దు.. వెళ్తే అభ్యంతరం వ్యక్తం చేస్తుంటారు.. ఎవరో ఒకరు కోర్టుకెక్కుతారన్నారు. పర్యావరణ సంఘాలు వస్తాయి.. ఇది పర్యావరణ వ్యతిరేకమంటాయి. టన్నెల్‌లోకి గాలి, వెలుతురు వచ్చేలా ఏర్పాటు చేద్దామంటే కూడా చేయటానికి వీలు లేకుండా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టన్నెల్ రెండు చివర్ల నుంచి వచ్చే గాలి పీల్చుకుంటూనే లోపల కార్మికులు టన్నెల్ తవ్వాల్సి ఉంటుందని తెలిపారు. ఇలా ఎవరైనా పెడతారా అని ప్రశ్నించారు. నీళ్లు ఇచ్చే విధానం ఇదేనా అని నిలదీశారు. ఎస్ఎల్‌బీసీ గురించి ఎప్పటి నుంచి వింటున్నాం.. ఇంకెన్ని ఏళ్లకు కంప్లీట్ కావాలి.. ఇది ఎవరి పాపం.. తెలంగాణ ప్రజలు ఎందుకు శిక్ష అనుభవించాలంటూ కేసీఆర్ ప్రశ్నించారుఇది బోర్ చేసుకుంటూ వెనుక నుంచి లైనింగ్ చేసుకుంటూ వెళ్తారని.. దాన్ని ఒకవేళ వెనక్కి లాగేద్దామంటే లాగలేమని.. ఒకవేళ లాగాలంటే వెనుక చేసిన లైనింగ్ అంతా కూల్చేయాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాన్ని కొనసాగించటం తప్ప.. గత్యంతరం లేని భయంకరమైన పరిస్థితిలో కూరుకుపోయిన మరో ప్రాజెక్టు ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు అని కేసీఆర్.. ఆనాడే అసెంబ్లీలో వివరించారు. కాగా.. ఇప్పుడు టెన్నెల్‌లో ప్రమాదం జరగటంతో.. ఈ వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.అయితే.. 2004లోనే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం SLBC ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కాగా.. ఆ టన్నెల్ పనులు ఆలస్యంగా జరగటంతో 2016 వరకు కూడా కాకపోగా.. అప్పుడే అది ఒక డేంజరస్ ప్రాజెక్ట్ అని కేసీఆర్ తెలిపారు. ఇక.. అప్పటి నుంచి ఆ పనులు జరగకపోవటంతో.. మళ్లీ ఇటీవలే పనులు మొదలు పెట్టారు. పనులు మొదలుపెట్టిన నాలుగు రోజులకే టన్నెల్ పైకప్పు కూలటంతో.. రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read more:Karimnagar:రాజాలింగం చుట్టూ రాజకీయాలు

Related posts

Leave a Comment