Andhra Pradesh:పవన్ ఎక్కడా అని ప్రశ్నలు

Agitations of Group 2 candidates continued across AP. Candidates are angry with the state system

Andhra Pradesh:పవన్ ఎక్కడా అని ప్రశ్నలు:ఏపీ వ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనలు కొనసాగాయి. రాష్ట్ర విధానంలో తప్పులు సరిచేయకుండా పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. అదే సమయంలో అభ్యర్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఏపీపీఎస్సీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. కానీ ఆ లేఖకు ఏపీపీఎస్సీ నుంచి తగిన స్పందన రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. గ్రాడ్యుయేట్స్ కు ప్రయోజనం కల్పించే నిర్ణయాన్ని తీసుకోలేమని ఏపీపీఎస్సీ కార్యదర్శి తేల్చి చెప్పినట్లు సమాచారం.

పవన్ ఎక్కడా అని ప్రశ్నలు

నెల్లూరు, ఫిబ్రవరి 24
ఏపీ వ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థుల ఆందోళనలు కొనసాగాయి. రాష్ట్ర విధానంలో తప్పులు సరిచేయకుండా పరీక్షలు నిర్వహించడంపై అభ్యర్థులు ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. అదే సమయంలో అభ్యర్థుల ఆందోళనను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఏపీపీఎస్సీకి సీఎం చంద్రబాబు లేఖ రాశారు. కానీ ఆ లేఖకు ఏపీపీఎస్సీ నుంచి తగిన స్పందన రాలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. గ్రాడ్యుయేట్స్ కు ప్రయోజనం కల్పించే నిర్ణయాన్ని తీసుకోలేమని ఏపీపీఎస్సీ కార్యదర్శి తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే సీఎం చంద్రబాబు లేఖ రాసిన స్పందించకపోవడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. రోస్టర్ విధానంతో తమకు నష్టం జరుగుతుందని.. ఎటువంటి పోస్టులు తమకు దక్కే అవకాశం లేదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. నోటిఫికేషన్ లో రోస్టర్ మార్చిన తర్వాతే ప్రధాన పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళన బాట పట్టారు. అయితే ఆందోళన చేస్తున్న అభ్యర్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం ఉద్రిక్తంగా మారింది. దీనిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార అస్త్రంగా మార్చుకుంది. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది.మరోవైపు దీనిపై స్పందించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ. గ్రూప్ 2 అభ్యర్థుల వ్యవహారంపై ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ గందరగోళానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవైపు వాయిదా వేయిస్తున్నామంటూ చెప్పి.. మరోవైపు తమ చేతుల్లో లేదని చెప్పడం ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనం అన్నారు.

నిన్న అభ్యర్థుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు విద్యాశాఖ మంత్రి ట్వీట్ చేశారని.. ఇప్పుడు మళ్లీ ఇలా అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కడ అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికే చంద్రబాబు తో వాటి లోకేష్ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష నిలిపి వేసేందుకు ప్రయత్నం చేశారని.. కానీ జగన్ సర్కార్ చేసిన తప్పిదంతో వీలు కాలేదని టిడిపి కూటమి శ్రేణులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నాయి. అయితే ఇటువంటి క్లిష్ట సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంతవరకు ఈ అంశంపై స్పందించలేదు. దీంతో డిప్యూటీ సీఎం ఎక్కడ అని ప్రశ్నించేవారు ఎక్కువవుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఆయన పైనే ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.2023 డిసెంబర్లో గ్రూప్ 2 పరీక్ష నోటిఫికేషన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో విడుదలైంది. కానీ అప్పట్లో రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడారని.. రోస్టర్ విధానం పెట్టిందే జగన్మోహన్ రెడ్డి అని టిడిపి కూటమి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. దీనికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రియాక్ట్ అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే ఏపీపీఎస్సీ ఉంటుంది కదా.. ఒక రాష్ట్రానికి సీఎం లేఖ రాస్తే ఏపీపీఎస్సీ స్పందించకపోవడం ఏంటనేది అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అదే సమయంలో ఏపీపీఎస్సీ బోర్డులో వైయస్సార్ కాంగ్రెస్ మనుషులు ఉన్నారని టిడిపి శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఇటువంటి గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Read more:Andhra Pradesh:ధిక్కారానికి ఏపీపీఎస్సీ

Related posts

Leave a Comment