Tirumala:నరేష్ తొలగిస్తారా

Naresh will be removed

Tirumala:నరేష్ తొలగిస్తారా:తిరుమల పవిత్రతకు నిదర్శనం. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రమిది. అంతటి మహిమాన్విత క్షేత్రంలో పని చేసే అవకాశం దక్కడం మహా భాగ్యం. ఇక్కడ పని చేసే ఉద్యోగులు కూడా స్వామి వారి మీద భక్తి భయంతో విధులు నిర్వహిస్తారు. కొందరు దురుసుతనం ప్రవర్తించినా, వారిపై టీటీడీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. అందుకే తిరుమలలో ఉద్యోగులు వారి విధులను జాగ్రత్తగా నిర్వర్తించాల్సిన పరిస్థితి.

నరేష్ తొలగిస్తారా..

తిరుమల, ఫిబ్రవరి 22
తిరుమల పవిత్రతకు నిదర్శనం. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రమిది. అంతటి మహిమాన్విత క్షేత్రంలో పని చేసే అవకాశం దక్కడం మహా భాగ్యం. ఇక్కడ పని చేసే ఉద్యోగులు కూడా స్వామి వారి మీద భక్తి భయంతో విధులు నిర్వహిస్తారు. కొందరు దురుసుతనం ప్రవర్తించినా, వారిపై టీటీడీ సీరియస్ యాక్షన్ తీసుకుంటుంది. అందుకే తిరుమలలో ఉద్యోగులు వారి విధులను జాగ్రత్తగా నిర్వర్తించాల్సిన పరిస్థితి. కానీ ఇటీవల టీటీడీ బోర్డు సభ్యులలో ఒకరు చేసిన నిర్వాకంతో, ఒక్కసారిగా ఉద్యోగులు భగ్గుమన్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దుకొనేందుకు ఆ సభ్యుడే నేరుగా వారితో మాట్లాడనున్నట్లు సమాచారం.టీటీడీ పాలకమండలిలో పలువురిని సభ్యులుగా నియమిస్తారు. అలా నియమింపబడ్డ వారే నరేష్ కుమార్. ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన సమయంలో మహాద్వారం గేటు వద్ద నరేష్ కుమార్ ఆగారు. గేటు తీయాలని కోరగా, టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మహాద్వారం గేటు తీయడం జరగదని టీటీడీ ఉద్యోగి బాలాజీ తెలిపారు. ఇక అంతే.. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడే స్థానంలో ఉన్న నరేష్ కుమార్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. థర్డ్ క్లాస్ అంటూ ఉద్యోగి బాలాజీని ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు. ఇలా పవిత్రమైన పుణ్యక్షేత్రంలో భాద్యతాయుతమైన బోర్డు సభ్యుడిగా ఉన్న నరేష్ కుమార్ తీరుపై ఉద్యోగులు, భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.నరేష్ కుమార్ ప్రవర్తించిన తీరు, సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కర్ణాటకకు చెందిన నరేష్ కుమార్ బీజేపీకి చెందిన నేతగా గుర్తింపు పొంది, బోర్డు సభ్యుడిగా నియమితులయ్యారు. సభ్యుడిగా ఉండి కూడా ఇలా నరేష్ కుమార్ ప్రవర్తించిన తీరుకు ఏకంగా బోర్డు సభ్యుడిగా తొలగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఎందరో ప్రముఖులు, సాధారణ భక్తుల వలె శ్రీవారిని దర్శించుకొనేందుకు ఆసక్తి చూపుతారు. కానీ బోర్డు సభ్యుడిగా ఉన్న నరేష్ ప్రవర్తించిన తీరుతో బోర్డుకు మచ్చ వచ్చిందని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.థర్డ్ క్లాస్ ఉద్యోగి అంటూ అవమానించిన నరేష్ కుమార్ ను వదిలే ప్రసక్తే లేదని టీటీడీ ఉద్యోగులు తెలుపుతున్నారు. తాము నిరంతరం భక్తులకు సేవలు చేస్తూ, బోర్డు సూచనల మేరకు నడుచుకుంటున్న నేపథ్యంలో తమను అవమానించడం ఎంతవరకు సబబని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంత జరుగుతున్నా, టీటీడీ స్పందించక పోవడం విశేషం. ఛైర్మన్ బీఆర్ నాయుడు భాద్యతలు స్వీకరించిన సమయం నుండి ఉద్యోగుల సంక్షేమ కోసం, భక్తుల కోసం ఎన్నో చర్యలకు శ్రీకారం చుట్టారు. నరేష్ నిర్వాకం వల్ల టీటీడీ బోర్డు మీదనే పెద్ద మచ్చ వచ్చిందని టీటీడీ బోర్డు సభ్యులు అభిప్రాయ పడుతున్నట్లు సమాచారం. చివరకు వివాదం చిలికిచిలికి గాలివానగా మారుతున్న క్రమంలో నరేష్.. సారీ చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. తిరుమలకు చేరుకొని ఉద్యోగుల సమక్షంలో సారీ చెప్తానని, ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నరేష్ సమాచారం ఇచ్చారట. ఇదే నిజమైతే నరేష్ సారీతో వివాదం సద్దుమణుగుతుందా? లేక బోర్డు సభ్యుడిగా తొలగిస్తారా అన్నది మున్ముందు తెలిసే అవకాశం ఉంది.

Read more:Guntur:తిన్నోళ్లకు తిన్నంత చికెన్

Related posts

Leave a Comment