Vijayawada:రూ.3 లక్షల కోట్లతో.. బడ్జెట్

andhra -a budget of Rs.3 lakh crore

Vijayawada:రూ.3 లక్షల కోట్లతో.. బడ్జెట్:ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. 28వ తేదీన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ఏపీ అభివృద్ధిలో ఈ బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందని నేతలు చెబుతున్నారురాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 28న చట్ట సభలకు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపడతారు.

రూ.3 లక్షల కోట్లతో.. బడ్జెట్

విజయవాడ , ఫిబ్రవరి 22
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24న ప్రారంభం కానున్నాయి. 28వ తేదీన ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెడుతున్న తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. ఏపీ అభివృద్ధిలో ఈ బడ్జెట్ కీలక పాత్ర పోషిస్తుందని నేతలు చెబుతున్నారురాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 28న చట్ట సభలకు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపడతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రవేశపెట్టే తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కావడంతో.. ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఉభయ సభల సమావేశం ప్రారంభం సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తారు. ఈనెల 25న గవర్నర్ ప్రసంగంపై చర్చ ఉండనుంది.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో చెప్పిన పథకాల అమలు కోసం ఈ బడ్జెట్‌లో నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం వనరుల సమీకరణపై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. బడ్జెట్ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇప్పటికే ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అధికారులతో రెండు మూడుసార్లు సమావేశమయ్యారు.చంద్రబాబుతో సమావేశం తర్వాత.. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖల ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు, ఆయా శాఖల కార్యదర్శులు ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు సమర్పించారు. ముఖ్యంగా జలవనరుల శాఖ, సాంఘీక సంక్షేమ శాఖ, విద్య, వైద్య శాఖలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇటు కేంద్ర ప్రాయోజిత పథకాలను ఎక్కువగా వినియోగించుకునేందుకు అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అటు కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు రాబట్టేలా ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ.. నిధులు సమీకరించుకోవాలి ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా విద్య, వైద్య శాఖ ద్వారా కేంద్రం నుంచి ఎక్కువ నిధులు పొందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సూపర్‌సిక్స్‌ హామీల్లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలను.. కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నూతన ఇసుక విధానాన్ని అమలు చేసింది. దీంతో ఆదాయం తగ్గింది. పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం సాయం చేస్తోంది. ఇది కొంతమేర ఊరటనిస్తోంది. అయితే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ప్రత్యేక సాయం చేయాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని కోరుతున్నారు.గత ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టు పెట్టిందని.. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2.94 లక్షల కోట్లతో నవంబర్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇప్పుడు రూ.3 లక్షల కోట్లు దాటే అవకాశం ఉందని తెలుస్తోంది.

సరే.. ఇవన్నీ పక్కనపెడితే బడ్జెట్ పై ఇప్పటికే అధికారులు కసరత్తులు చేశారు. ప్రాధాన్యత రంగాలకు కేటాయింపులపై చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అధికారులతో సమావేశమై ఏ ఏ శాఖలకు నిధులు కేటాయింపులు జరపాలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 – 25 సంవత్సరానికి 2.95 లక్షల కోట్లతో బడ్జెట్ అంచనాలను రూపొందించి గత శాసనసభలో ప్రవేశపెట్టింది. ఇందులో రెవెన్యూ వ్యయంగా 2,35,916 కోట్లు, మూలధన వ్యయంగా 32,712 కోట్ల రూపాయలుగా చూపించింది. ప్రభుత్వం మారింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మూడు లక్షల కోట్లకు పైగానే బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టే అవకాశముంది… అయితే గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు నిధుల కేటాయింపుపైనే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వరసగా మూడు నెలలకు మూడు హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమయింది. మార్చి నెలలో మహిళలకు బస్సు ప్రయాణం, ఏప్రిల్ నెలలో రైతులకు అన్నదాత సుఖీభవ, మే నెలలో తల్లికి వందనం కార్యక్రమాలను అమలు చేయాలని ఇప్పటికే చంద్రబాబు నిర్ణయించారు. ఈ మూడు పథకాలకు సంబంధించి దాదాపు పదిహేను నుంచి ఇరవై వేల కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ పథకాలకు సంబంధించి ఇంత వరకూ విధివిధానాలను ఖరారు చేయకపోవడంతో పాటు నిధులు ఎంత కేటాయిస్తారన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది. మరొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్రీమ్ ప్రాజెక్ట్స్ అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించాలి. కేవలం పోలవరానికి మాత్రమే కాకుండా బనకచర్లకు కూడా నిధులు కేటాయించాల్సి ఉంటుంది. బనకచర్ల ను చంద్రబాబు గేమ్ ఛేంజర్ గా అభివర్ణిస్తుండటంతో దానికి నిధులు కేటాయించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మరొక వైపు సంక్షేమ పథకాలకు కూడా పెద్దయెత్తున నిధులు కేటాయించాల్సి ఉంటుంది. బడ్జెట్ లో కేటాయింపులను బట్టే అవి అమలవుతాయా? లేదా? అన్న దానిపై స్పష్టత వచ్చే అవకాశముంది. అందుకే మార్చి 3వ తేదీన ప్రవేశ పెట్టే బడ్జెట్ కోసం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏంచేస్తుందన్నది చూడాలి.
Read more:Guntur: సైలెంట్ గా జిల్లా టూర్లలలో జగన్

Related posts

Leave a Comment