Warangal:ఏడాది తర్వాత ఎన్నికల వేడే

BRS and Congress parties are increasing the political heat

Warangal:ఏడాది తర్వాత ఎన్నికల వేడే:ఎన్నికల ముందు అభ్యర్థుల ప్రచార హోరు.. పార్టీలలో చేరికల జోరు కనిపిస్తుంది. ఎన్నికలు ముగిసిన మరుక్షణం, ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అనేలా పరిస్థితి మారిపోతుంది. కానీ ఓ నియోజకవర్గంలో మాత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లు ప్రతిరోజు ఎన్నికల సీన్ కనిపిస్తోందట. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా నాయకులను, కార్యకర్తలను తమ పార్టీలలో చేర్చుకుంటూ పొలిటికల్ హీట్ పెంచేస్తుండటం చర్చల్లో నలుగుతుంది.

ఏడాది తర్వాత ఎన్నికల వేడే..

వరంగల్, ఫిబ్రవరి 21
ఎన్నికల ముందు అభ్యర్థుల ప్రచార హోరు.. పార్టీలలో చేరికల జోరు కనిపిస్తుంది. ఎన్నికలు ముగిసిన మరుక్షణం, ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అనేలా పరిస్థితి మారిపోతుంది. కానీ ఓ నియోజకవర్గంలో మాత్రం నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్లు ప్రతిరోజు ఎన్నికల సీన్ కనిపిస్తోందట. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా నాయకులను, కార్యకర్తలను తమ పార్టీలలో చేర్చుకుంటూ పొలిటికల్ హీట్ పెంచేస్తుండటం చర్చల్లో నలుగుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో సత్తా చాటుకోవడానికి అక్కడ రెండు పార్టీ నేతలు పొలిటికల్ హీట్ పెంచుతున్నారంట.. .ఎన్నికల ముందు పార్టీలు తమ బలం పెంచుకునేందుకు ఇతర పార్టీలలోని నాయకులను చేర్చుకోవడం.. ఎవరు వచ్చినా వెల్కమ్ చెప్పడం రొటీన్‌గా జరిగేదే .. అయితే అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎలక్షన్స్ ముగిసినా.. ఉమ్మడి వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాయకులు, కేడర్న్ చేర్చుకోవడానికి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాయకులు, కార్యకర్తల దగ్గరకి వెళ్లి బాబ్బాబు మా పార్టీలోకి రండి అంటూ రెండు పార్టీల్లోని నాయకులు గ్రామాల మీద పడుతుండడంతో.. ఇదేందయ్యా అంటూ స్థానికులు ఆశ్చర్యపోతున్నారట.మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి మధ్య ఆధిపత్య పోరులో ఎవ్వరూ తగ్గట్లేదు. పాలకుర్తి నియోజకవర్గంలో నాదంటే నాదే పైచేయి అని చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసినా.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో పట్టు కోసం ఎవరికి వారు వలసలను ప్రోత్సహిస్తూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. తమ పార్టీల్లోకి ఎవరు వస్తానన్నా వెల్‌కమ్ చెప్పేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఝాన్సీ రెడ్డికి కీలక అనుచరునిగా ఉన్న ఎస్సార్ఆర్ ఫౌండేషన్ అధినేత పరుపాటి శ్రీనివాస్‌రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఎర్రబెల్లి తమ పార్టీలో చేర్పించి కాస్త పైచేయి సాధించాడు.

అయితే దానికి కౌంటర్ గా ఎర్రబెల్లి అనుచరుడు బిల్లా సుధీర్ రెడ్డిని ఝాన్సీరెడ్డి కోడలు , ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గాంధీ భవన్ వేదికగా కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఇలా ఒకరికొకరు తగ్గేదేలే అంటూ వలసల పర్వానికి తెరలేపితే, బీఆర్ఎస్ లో చేరిన శ్రీనివాస్‌రెడ్డి ఇంకాస్త దూకుడు పెంచారు. రాయపర్తి నియోజకవర్గంలోని తండాలలో తిరుగుతూ 15 రోజుల్లోనే 1200 మందికి పైగా గ్రామీణ స్థాయి కార్యకర్తలను బీఆర్ఎస్‌లో చేర్చారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరైన శ్రీనివాస్ రెడ్డి, ఝాన్సీ రెడ్డికి కంట్లో నలుసులా మారారని చర్చ జరుగుతుంది. గత కొద్ది రోజులుగా స్పీడ్ పెంచిన శ్రీనివాస్‌రెడ్డి జయరామ్ తండా, బాలునాయక్ తండా, ఏకేతండా, పెరికవేడు, మైలారం, సన్నూరు గ్రామాల్లోని కాంగ్రెస్ శ్రేణులను వందల సంఖ్యలో బీఆర్ఎస్‌లో చేర్చుకుని గులాబీ కండువా కప్పారు. మరోవైపు పాలకుర్తి మండలంలోనూ కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్‌లోకి వలసలపర్వం కొనసాగుతోంది.స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయట్లేదని.. ఆ అసంతృప్తితో కాంగ్రెస్ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి వలసలు పెరగడానికి కారణమన్న చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. మరోవైపు మార్పు కోసం ఓటు వేస్తే కనీసం తమను ఝాన్సీరెడ్డి పట్టించుకోవట్లేదని, ఇచ్చిన హామీల అమలు పక్కన పెడితే.. కష్టాల్లో ఉన్న కార్యకర్తలను పరామర్శించి భరోసా ఇచ్చేందుకు సైతం తమ నాయకురాలు రావట్లేదని పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు అసహనం వ్యక్తం చేస్తున్నాయంట . ఇదే అదనుగా బీఆర్ఎస్ నాయకులు ప్రజల్లో తిరుగుతూ, కాంగ్రెస్ శ్రేణులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.కొద్దిరోజుల నుండి మాజీ మంత్రి ఎర్రబెల్లి సైతం నియోజకవర్గంలో తిరుగుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ క్యాడర్‌ని సంసిద్ధం చేస్తున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 6 జడ్పీటీసీలు, 6 మండల ప్రజా పరిషత్తులను గులాబీ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతోందని ప్రచారం చేస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. అదలా ఉంటే క్షేత్రస్థాయిలో ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తీరుతో విసుగు చెందిన క్యాడర్ సైతం ఎర్రబెల్లి వైపే మొగ్గుచూపుతోందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ క్రమంలో హస్తం నీడ నుంచి బయటకు వచ్చి పలువురు కారు ఎక్కేస్తున్నారని.. పరిస్థితి చక్కదిద్ది ఆ వలసలకు చెక్ పెట్టకపోతే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో హస్తం పార్టీకి మొండి చేయి తప్పదనే చర్చ జరుగుతుంది.

Read more:Hyderabad:ఈటెల వర్సెస్ అరుణ

Related posts

Leave a Comment