Nizamabad:అందుబాటులోకి మరో వెటర్నరీ వ్యాక్సిన్ సెంటర్

veterinary vaccine production center will come up in Telangana

Nizamabad:అందుబాటులోకి మరో వెటర్నరీ వ్యాక్సిన్ సెంటర్:తెలంగాణలో భారీ వెటర్నరీ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ అందుబాటులోకి రానుంది. దేశంలోనే అతి పెద్దదిగా టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం మామిడిపల్లిలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో రూ.300 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు.

అందుబాటులోకి మరో వెటర్నరీ వ్యాక్సిన్ సెంటర్

నిజామాబాద్,, ఫిబ్రవరి 21
తెలంగాణలో భారీ వెటర్నరీ వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ అందుబాటులోకి రానుంది. దేశంలోనే అతి పెద్దదిగా టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌ మండలం మామిడిపల్లిలో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక వసతులతో రూ.300 కోట్లతో దీన్ని నిర్మించనున్నారు. ఈ మేరకు తెలంగాణ పశుసంవర్ధక శాఖ ప్రతిపాదనలు సైతం సిద్ధం చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తర్వాత.. దీని ఏర్పాటు కార్యాచరణ ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ప్రస్తుతం హైదరాబాద్‌ శాంతినగర్‌లోని పశుసంవర్ధక శాఖ సముదాయంలో టీఎస్‌వీబీఆర్‌ఐ సెంటర్ ఉంది. ఇది పశువుల ఆరోగ్యంపై రీసెర్చ్, వ్యాధుల నిర్ధారణ, వ్యాక్సిన్ ఉత్పత్తి తదితర సేవలను అందిస్తోంది. గోట్‌ఫాక్స్‌తోపాటుగా మరో ఆరు రకాల వ్యాక్సిన్‌ను ఈ సెంటర్‌లో ఉత్పత్తి చేస్తున్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌, పంజాబ్ సహా మరో 14 రాష్ట్రాలకు టీఎస్‌వీబీఆర్‌ఐ సెంటర్ నుంచే వ్యాక్సిన్లు సరఫరా చేస్తున్నారు. దీంతో టీకాల ఉత్పత్తిని పెంచటంతో పాటుగా.. కొత్త టీకాలను అభివృద్ది చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా కొత్తగా టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. అందుకు అవసరమైన భూమి కోసం పలు ప్రాంతాలను సైతం పరిశీలించారు. హైదరాబాద్ శివారు మామిడిపల్లిని ఎంపికి చేసి డీపీఆర్‌ రూపకల్పనకు ఆదేశాలిచ్చారు.దేశంలో ప్రస్తుతం నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఆన్‌ ఈక్విన్స్, ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఇండియన్‌ ఇమ్యునోలాజికల్స్‌ లిమిటెడ్ ఉన్నాయి. ఈ సెంటర్ల కంటే భారీ సామర్థ్యం, అధునాతన వసతులు, టెక్నాలజీతో హైదరాబాద్‌లో పశువైద్య వ్యాక్సిన్ ప్రొడక్షన్ సెంటర్ నిర్మించనున్నారు. ఇందులో బ్యాక్టీరియల్, వైరల్‌ వ్యాక్సిన్‌ ప్రొడక్షన్‌ ప్లాంట్లు, యానిమల్‌ బ్రీడింగ్‌ సెంటర్, ఈటీపీ, క్వాలిటీ కంట్రోల్, యానిమల్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు, ఆర్‌అండ్‌డీ, రా మెటీరియల్, ఫినిష్‌డ్‌ స్టోర్స్, ప్యాకేజింగ్, స్టాఫ్‌ క్వార్టర్స్‌ నిర్మించనున్నారు. రీసెర్చ్ చేసేందుకు ఏకంగా రూ.100 కోట్లతో అధునాతన యంత్రాలను కూడా ఏర్పాట చేయనున్నారు. ప్రతి యూనిట్‌కు నలుగురు చొప్పున వెటర్నరీ నిపుణులను నియమిస్తారు. కొత్తగా 200 మంది సిబ్బందిని కూడా నియమించుకోనున్నారు. కేంద్రం సహకారంతో ఈ వ్యాక్సిన్ సెంటర్ నిర్మించాలని సర్కార్ యోచిస్తోంది.

Read more:Hyderabad:మరో 2 నెలలు కాళేశ్వరం కమిషన్ పొడిగింపు

Related posts

Leave a Comment