Mumbai:టెస్లా కంపెనీ కోసం రాష్ట్రాలు పోటీ

Tesla is going to start business in India.

Mumbai:టెస్లా కంపెనీ కోసం రాష్ట్రాలు పోటీ:టెస్లా ఇండియాలో వ్యాపారం ప్రారభించబోతోంది. ముందుగా కార్లు దిగుమతి చేసుకుని అమ్మబోతోంది. మెల్లగా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇంత కాలం అధిక దిగుమతి పన్నుల కారణంగా టెస్లా కంపెనీ భారత్ లో కార్ల అమ్మకాలు చేపట్టలేదు. ఇప్పుడు ఇప్పుడు 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న హై-ఎండ్ కార్లపై కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి కేంద్రం తగ్గించింది. దీంతో ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు.

టెస్లా కంపెనీ కోసం రాష్ట్రాలు పోటీ

ముంబై, ఫిబ్రవరి 21
టెస్లా ఇండియాలో వ్యాపారం ప్రారభించబోతోంది. ముందుగా కార్లు దిగుమతి చేసుకుని అమ్మబోతోంది. మెల్లగా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇంత కాలం అధిక దిగుమతి పన్నుల కారణంగా టెస్లా కంపెనీ భారత్ లో కార్ల అమ్మకాలు చేపట్టలేదు. ఇప్పుడు ఇప్పుడు 40,000 డాలర్ల కంటే ఎక్కువ ధర ఉన్న హై-ఎండ్ కార్లపై కస్టమ్స్ సుంకాన్ని 110 శాతం నుంచి 70 శాతానికి కేంద్రం తగ్గించింది. దీంతో ఇండియాలో కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. . టెస్లా కంపెనీ కార్ల అమ్మకాలు మన దేశంలో ముందుగా మొదలవుతాయి. దీని కోసం ఇతర దేశాలలో ఉత్పత్తి అయిన ఆ కంపెనీ కార్లను దిగుమతి చేసుకుంటారు. జర్మనీ ప్లాంట్ నుంచి కార్లను ఇండియాకు దిగుమతి చేయనున్నారు. టెస్లా పవర్ ఇండియా పేరుతో పాత బ్యాటరీలను రీకండిషన్ చేయడానికి, విక్రయించడానికి తన బ్యాటరీ బ్రాండ్ రీస్టోర్‌ను ఇటీవలే ప్రారంభించింది. 2026 నాటికి దేశవ్యాప్తంగా 5,000 రీస్టోర్ బ్రాండ్ స్టోర్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. త్వరలో ప్లాంట్ పెట్టేందుకు ఎలాన్ మస్క్ నిర్ణయించారు. మస్క్ మాత్రం వ్యాపార ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల టెస్లా కారు ధరలు తగ్గడంతో పాటు పెద్ద మార్కెట్‌ను ఆకర్షించగలుగుతుంది. భారత్ ప్రభుత్వం కూడా ఈవీ ఉత్పత్తికి ప్రోత్సాహకాలు అందిస్తున్నందున అవకాశాలు అందిపుచ్చుకోవాలని అుకుంటోంది. టెస్లా ప్లాంట్ కోసం.. నాలుగైదు రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన .. ఈవీ పాలసీలు మెరుగ్గా ఉన్న పలు రాష్ట్రాల విషయంలో టెస్లా ఆసక్తి చూపిస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలు టెస్లాను తమ రాష్ట్రానికి ఆహ్వానించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. భూమితో పాటు పారిశ్రామిక రాయితీలు ఇచ్చేందుకు సిద్దపడుతున్నాయి. మస్క్ పెట్టుబడి ప్రకటన చేశారు కానీ.. ప్లాంట్ పెడతారా.. ప్లాంట్ ఎప్పుడు పెడతారు అన్నది మాత్రం చెప్పలేదు. టెస్లా కోసం తెలుగు రాష్ట్రాలు కూడా గట్టిగా ప్రయత్నించే అవకాశం ఉంది. కియా కార్ల పరిశ్రమను తీసుకొచ్చినందున.. మరో సారి అలాంటి పెట్టుబడి తీసుకు వస్తే.. ఆటోమోబైల్ హబ్ గా మారే అవకాశం ఉంది. ఇందు కోసం కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకునే చాన్స్ ఉంది. అయితే గుజరాత్ కూడా రేసులో ఉంది. ఎలాన్ మస్క్ ఏ రాష్ట్రం వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. అన్ని రాష్ట్రాలు తమ రాష్ట్రంలోనే ప్లాంట్ పెట్టేలా ప్రయత్నించనున్నాయి. తెలంగణ కూడా గట్టిగా ప్రయత్నిస్తోంది.

Read more:Latest Marriage Season Collections In Lowest Prices

Related posts

Leave a Comment