Vijayawada:అడ్డంగా బుక్కైన జగన్:ఏదైనా చేస్తే నమ్మేలా చేయాలి. అబద్ధం ఆడినా అద్దంలో ఉండాలి. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదు. రాజకీయాల్లో రకరకాల జమ్మిక్కులు చేసే వ్యూహకర్తల బృందాలు వచ్చాయి. ఆపై సోషల్ మీడియా విభాగాలు చాలా రకాల కసరత్తులు చేస్తాయి. అయితే ఇప్పుడు అవి చేసే ప్రయత్నాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. నిన్నటి కి నిన్న విజయవాడ సబ్ జైలులో ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ను పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలో జైలు బయట జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అడ్డంగా బుక్కైన జగన్..
విజయవాడ, ఫిబ్రవరి 21
ఏదైనా చేస్తే నమ్మేలా చేయాలి. అబద్ధం ఆడినా అద్దంలో ఉండాలి. లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవడం తప్పదు. రాజకీయాల్లో రకరకాల జమ్మిక్కులు చేసే వ్యూహకర్తల బృందాలు వచ్చాయి. ఆపై సోషల్ మీడియా విభాగాలు చాలా రకాల కసరత్తులు చేస్తాయి. అయితే ఇప్పుడు అవి చేసే ప్రయత్నాలు ఇట్టే తెలిసిపోతున్నాయి. నిన్నటి కి నిన్న విజయవాడ సబ్ జైలులో ఉన్న వల్లభనేని వంశీ మోహన్ ను పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. ఆ క్రమంలో జైలు బయట జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జగన్మోహన్ రెడ్డి పై ఓ బాలిక పెంచుకున్న పిచ్చి ప్రేమ బయటపడింది. అయితే దీని వెనుక ఐపాక్ టీం ఉందని తేలిపోయింది.జగన్మోహన్ రెడ్డితనకంటే.. ఎక్కువగా నమ్మింది ఐప్యాక్ టీంనే. వాళ్లు నిలబడమంటే నిలబడతారు. కూర్చోమంటే కూర్చుంటారు. అంతలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి పై ఐప్యాక్ టీం ప్రభావం. 2019లో తన విజయానికి ఐ ప్యాక్ టీం కారణమని జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్మారు. అయితే 2024లో ఓటమికి కూడా అదే ఐప్యాక్ కారణమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వినడం లేదు. ఇంకా వారినే నమ్ముకుంటున్నారు. దీంతో పాత చింతకాయ పచ్చడి మాదిరిగా వారు ఏవేవో స్కీములు వేస్తున్నారు. అందులో భాగంగానే విజయవాడ సబ్ జైలు వద్ద జరిగిన చిన్నారి యాక్షన్ అంటూ ప్రచారం నడుస్తోంది.విజయవాడ రోడ్ షోలో ఓ చిన్నారి ఏడుస్తూ జగన్ వద్దకు చేరుతుంది. తండ్రి భుజాల మీద కూర్చోబెట్టుకుని దగ్గరకు తీసుకెళ్లాడు. వ్యక్తి వ్యక్తి కుక్క పెట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గర తీసుకున్నారు. ఆ పాప వెంటనే సెల్ఫీ తీసుకుని ఆనందించింది. అయితే అక్కడితో ఆ ఎపిసోడ్ ముగియలేదు. చదువుకున్న ఏడుపు ఆపేసి సెల్ఫీ తీసుకోవడమే ఫక్కున నవ్వు తెప్పించే అంశం. మొత్తం ఇది ఒక డ్రామాను తలపించింది. ఐ ప్యాక్ నాటకంగా భావించిన టిడిపి సోషల్ మీడియా వెతికి వెతికి మరి పట్టుకుంది. తెర వెనుక ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేసింది. అయితే అలా ఏడ్చిన చిన్నారి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారిని.. ఆమె తండ్రి బంగారు నగల దుకాణంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడని.. తల్లి కూడా ప్రైవేటు ఉద్యోగి అని.. పాప చదివేది రవీంద్ర భారతి స్కూలులో అని తేలిపోయింది. అంటే అది ఉన్నతమైన కుటుంబమే కదా. దీంతో ఈ టోటల్ వ్యవహారం ఒక ఫన్ ఎపిసోడ్ గా మిగిలిపోయింది. ఐప్యాక్ చేసిన నాటకాలుగా తేలిపోయింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఇదో ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈసారి నిజంగా జరిగిన ఘటనలను బయటపెట్టినా.. అదంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సృష్టి అని భావించేలా పరిస్థితికి వచ్చింది.
చిన్నారి దేవిక చుట్టూ స్టోరీ
చిన్నారి దేవిక.. ఈ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ఓపెన్ చేసిన ఈ చిన్నారి పేరే వినిపిస్తోంది. అందుకు కారణం ఆ చిన్నారి వైఎస్ జగన్‌ను చూడాలంటూ ఏడుస్తూ మరీ ఫొటో దిగడం.. ఆ ఫొటో, వీడియోలు వైరల్ కావడం.వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల వల్లభనేని వంశీ పరామర్శించేందుకు విజయవాడలోని జిల్లా కారాగారానికి వచ్చారు. దీంతో జగన్ ను చూడడానికి వైసీపీ అభిమానులు అక్కడికి భారీగా చేరుకున్నారు. అందులో దేవిక అనే పాప కూడా అక్కడికి వచ్చింది. జగన్ తో ఫొటో దిగడానికి పట్టుబట్టింది దీంతో జగన్ బయటకు వచ్చి ఆమెను ముద్దాడారు. అనంతరం ఆ చిన్నారి జగన్‌తో సెల్ఫీ తీసుకుంది.
దేవికపై ట్రోలింగ్స్
ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి. దీంతో ఆమెపై ట్రోలింగ్ మొదలైంది. ఒక్కోక్కరు ఒక్కో విధంగా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. అందులో ఒకరు ట్వీట్ చేస్తూ.. ‘‘సొంత నిర్ణయాలు తీసుకోడు.. ఐ ప్యాక్ ఏమి చెప్తే అది చేస్తాడు’’ అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఇంకొరేమో ‘‘సొంత మేన అల్లుడి & మేన కోడల్ని మోసం చేసినోడు.. ఊళ్ళో ఉన్నోళ్లకి మేన మామ.. వాళ్ళ వయసు ఏంటి చేయుస్తున్న పనులేంటి’’ అంటూ ట్వీట్ చేశారు.
అలాగే స్వంత చెల్లిని, బాబాయి కూతురుని పేటిఎం బ్యాచ్‌తో బూతులు తిట్టించే ఈ మహానుభావుడు.. జనాల పిల్లల్ని మాత్రం ప్రేమగా చూస్తాడని నమ్మే వెర్రి గొర్రెలు ఆంధ్రాలో లేరని ఇంకా తెలియదా.. ఐ ప్యాక్ డ్రామాలు ఆపండ్రా.. చిరాకేస్థుంది అంటున్నారు. ఈ మేరకు కావాలనే వైసీపీ వాళ్లు ఈ డ్రామా చేయించారంటున్నారు. అక్కడి దిగిన ఫోటోలకు సంబంధించి కెమెరా యాంగిల్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మరోవైపు ఆ చిన్నారి తల్లినే మార్చేసి.. వేరొకరితో పోల్చుతున్నారు. దీంతో రాజకీయాల కోసం ఆ చిన్నారి తల్లినే మార్చేసిన సోషల్ మీడియా సైకోలు అంటూ ఇంకొందరు విరుచుకు పడుతున్నారు. అలాగే మరొకరు ‘‘ఈ అభిమానం ఐప్యాక్ సొంతం, అసలు ఐప్యాక్ లేకపోతే మీకు ఇలాంటి వీడియోలు ఎక్కడ నుంచి వస్తాయ్..! మీ పేటీఎం బ్యాచ్‌కి దండాలు పెట్టాల్సింది’’ అంటూ అందుకు సంబంధించిన వీడియోలు షేర్ చేస్తున్నారు. ‘‘ఐ ప్యాక్ టీం రంగంలోకి దిగింది అనుకుంటా ఇంకా ఇలాంటివి ఎన్నో వస్తాయో. కానీ ప్రతీ సారి జనాలను మోసం చేయలేవు జగన్’’ అంటూ మరొకరు ట్వీట్ చేశారు. లా టీడీపీ ఫ్యాన్స్ విమర్శలు చేస్తుంటే.. వైసీపీ ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి అభిమానం, ప్రేమ వైఎస్ జగన్‌కు మాత్రమే సొంతం అంటూ మరోవైపు వీడియోలు విసృతంగా షేర్ చేస్తున్నారు. ఇక ఆ చిన్నారి దేవిక అలాగే ఆమె ఫ్యామిలీపై కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. దేవిక తండ్రి ఓ షాప్‌లో పాట్నర్ అని ట్రోల్స్ చేస్తున్నారు. కానీ వాస్తవంగా ఆ చిన్నారి తండ్రి ఒక షాప్‌లో నెలవారీ జీతానికి పనిచేస్తున్నారని తెలిసింది. అలాగే వీరికి ఒక అపార్ట్‌మెంట్ ఉందని అంటున్నారు. కానీ వారు ఉండేది ఒక అపార్ట్‌మెంట్‌లోని అద్దెకు అని తెలుస్తోంది. ఇక ఆ చిన్నారి ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చదువుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. అయితే వాస్తవం ప్రకారం.. దేవికా రవీంద్ర భారతిలో చదువుతున్నట్లు తెలిసింది. ఇక ఆ పాపపై ఎందుకు ఇన్ని ట్రోలింగ్స్ చేస్తున్నారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ చిన్నారి విషయంలో టీడీపీ, వైసీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం చేస్తున్నారు. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. దీంతో ఎవరి వాదన కరక్టో తెలియక నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు.
Read more:Vijayawada:55 మంది డాక్టర్ల తొలగింపు