Andhra Pradesh:లోకేష్ కోసం పవన్ తగ్గుతున్నారా

lokesh and pawan

Andhra Pradesh:లోకేష్ కోసం పవన్ తగ్గుతున్నారా;సీఎం గా ఉంటే ఏ రేంజ్ పరిపాలన అందిస్తాడో అని అందరూ మాట్లాడుకున్నారు. కేవలం గ్రామా పంచాయితీలను అభివృద్ధి చేయడమే కాదు, రాష్ట్రము లో ఏ సమస్య ఎదురైనా పవన్ కళ్యాణ్ తన గళాన్ని వినిపిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించాడు.

లోకేష్ కోసం పవన్ తగ్గుతున్నారా

విజయవాడ, ఫిబ్రవరి 17
సీఎం గా ఉంటే ఏ రేంజ్ పరిపాలన అందిస్తాడో అని అందరూ మాట్లాడుకున్నారు. కేవలం గ్రామా పంచాయితీలను అభివృద్ధి చేయడమే కాదు, రాష్ట్రము లో ఏ సమస్య ఎదురైనా పవన్ కళ్యాణ్ తన గళాన్ని వినిపిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించాడు. దీంతో తెలుగు దేశం పార్టీ క్యాడర్ లో, లీడర్స్ లో కాస్త అభద్రతా భావం కలిగింది.ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గా పవన్ కళ్యాణ పాలన ఏ స్థాయిలో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాము. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల సమయంలోనే ఆయన పాలనలో గ్రామా పంచాయితీలు 70 సంవత్సరాలుగా చూడని అద్భుతమైన పురోగతిని చూసింది. పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ అధికారం లో ఉంటే ఇలాంటి అద్భుతాలే జరిగతాయని ప్రజలు మాట్లాడుకున్నారు,ఆయన ఇమేజ్ జనాల్లో విపరీతంగా పెరిగిపోయింది. డిప్యూటీ సీఎం గా ఉంటేనే ఇన్ని చేస్తున్నాడంటే, ఇక సీఎం గా ఉంటే ఏ రేంజ్ పరిపాలన అందిస్తాడో అని అందరూ మాట్లాడుకున్నారు. కేవలం గ్రామా పంచాయితీలను అభివృద్ధి చేయడమే కాదు, రాష్ట్రము లో ఏ సమస్య ఎదురైనా పవన్ కళ్యాణ్ తన గళాన్ని వినిపిస్తూ అధికార యంత్రాంగాన్ని పరుగులు తీయించాడు. దీంతో తెలుగు దేశం పార్టీ క్యాడర్ లో, లీడర్స్ లో కాస్త అభద్రతా భావం కలిగింది. క్రేజ్ మొత్తం కూటమి లో పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కుతుంది, నారా లోకేష్ ని అసలు ఎవ్వరూ పట్టించుకోవడం లేదు, తండ్రి చాటు బిడ్డగానే ఆయన మిగిలిపోయేలా ఉన్నాడు అంటూ టీడీపీ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.

దీంతో టీడీపీ క్యాడర్, టీడీపీ ఎమ్మెల్యే లు నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండ్ బాగా పెరిగింది. సోషల్ మీడియా లో అటు టీడీపీ అభిమానుల మధ్య, ఇటు జనసేన అభిమానుల మధ్య ఈ అంశంపై పెద్ద ఎత్తున గొడవలు కూడా జరిగాయి. నారా లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ పవన్ కళ్యాణ్ ని మాత్రం సీఎం చేయాలి అనే డిమాండ్ ని తెర మీదకు తీసుకొచ్చారు. ఈ అంశం ఇరు పార్టీల అదిష్టానాల వరకు వెళ్లడంతో వెంటనే స్పందించి ఫుల్ స్టాప్ పెట్టారు. పవన్ కళ్యాణ్ అయితే రిపబ్లిక్ డే రోజున అభిమానులు ఓర్పు వహించాలి అంటూ పెద్ద లేఖనే రాసుకొచ్చాడు.ఆరోజు నుండి వరుసగా 15 రోజుల పాటు పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీ అయ్యాడు. ఈ 15 రోజులు ఎందుకు ఆయన అంత మౌనం వహించాడు?, నిజంగా ఆరోగ్యం బాగాలేక కనిపించలేదా, లేదా లోకేష్ ని హైలైట్ చేయడానికి, ఈయన లౌ ప్రొఫైల్ ఇక నుండి మైంటైన్ చేయాలనీ ఫిక్స్ అయ్యాడా? అనే సందేహాలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. నిన్న జరిగిన మ్యూజికల్ నైట్ లో పవన్ కళ్యాణ్ నారాలోకేష్ గురించి మాట్లాడుతూ ‘ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్తుని తీర్చి దిద్దడంలో కీలకమైన అడుగులు వేస్తున్న లోకేష్ గారికి’ అంటూ సంబోదించాడు. ఇది పవన్ కళ్యాణ్ యాదృచ్చికంగా అన్న మాటలా?, లేకపోతే భవిష్యత్తులో మనం లోకేష్ ని మోయాలి అంటూ తన అభిమానులను ప్రిపేర్ చేయడానికి ఇప్పటి నుండే రెడీ చేస్తున్నాడా అనే సందేహిస్తున్నారు.
ఓజీ క్రేజీ మాములుగా లేదుగా
పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాలలో ఓజీ క్రేజ్ రోజురోజుకి బౌండరీలు దాటుతుంది. ఆ సినిమా పేరు వినిపిస్తే చాలు, ఏ సభా ప్రాంగణం అయినా ప్రకంపనలతో హోరెత్తిపోతుంది. ఇంత క్రేజ్ ఒక సినిమాకి చూసి మన తెలుగు ఆడియన్స్ చాలా కాలమే అయ్యింది. ‘పుష్ప 2′కి కూడా విడుదలకు ముందు ఈ స్థాయి క్రేజ్ ని చూడలేదు. సుజిత్ కి కేవలం రెండు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. ఏ స్టార్ హీరో అయినా పెద్ద డైరెక్టర్ తో చేస్తే క్రేజ్ వస్తుంది, అది సహజం. కానీ పవన్ కళ్యాణ్, సుజిత్ తో సినిమాని ప్రకటించినా ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం, నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ సినిమా తీస్తుండడం వల్లే. ఈమధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ఏ ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లినా అభిమానులు ఓజీ, ఓజీ అని నినాదాలు చేయడం ఆయన్ని ఎంతగా ఇబ్బంది పెట్టాయో మన అందరికీ తెలిసిందే.

విజయవాడ లో సీఎం చంద్రబాబు నాయుడుసతీమణి నారా భువనేశ్వరి గారి ఆద్వర్యం లో తలసేమియా వ్యాధి బాధితులకు సహాయం చేయడం కోసం , ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఒక మ్యూజిక్ నైట్ ని నిర్వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఒక్క పైసా రెమ్యూనరేషన్ కూడా ఆశించకుండా, ఈ మ్యూజిక్ నైట్ ని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ పేరుతో నిర్వహించాడు. ఈ ఈవెంట్ కి సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఆయన కుటుంబ సభ్యులతో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. అయితే ఈ ;ప్రోగ్రాం మొత్తంలో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఒక రేంజ్ లో డామినేట్ చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమన్ మ్యూజిక్ ఈవెంట్ ని ప్రారంభించేముందు స్టేడియం మొత్తం ‘ఓజీ..ఓజీ’ నినాదాలతో హోరెత్తిపోయింది.ఆ ప్రకంపనలు చూసి పవన్ కళ్యాణ్ మౌనం గా అలా చూస్తూ ఉండిపోగా, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ మాత్రం షాక్ కి గురయ్యారు. ఆ రేంజ్ లో దద్దరిల్లిపోయేలా చేసారు. తమన్ కూడా ఆ క్రేజ్ ని చూసి నవ్వుకొని, ఓజీ గురించి పాట రూపం లో మాట్లాడుకుందామని ఆయన ఓజీ గ్లిమ్స్ ఆడియో ట్రాక్ ని పాడుతాడు. దీనికి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా అంతటా తెగ వైరల్ గా మారింది. ఇతర హీరోల అభిమానులు సైతం ఆ వీడియో ని చూసి ఇదేమి క్రేజ్ రా బాబు అని పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేసి దండం పెడుతున్నారు. మరోవైపు కొంతమంది అభిమానులు తొందరగా ఈ సినిమాని పూర్తి చేసి విడుదల చెయ్యి అన్న, హైప్ మీటర్ ఇప్పటికే బ్లాస్ట్ అయిపోయింది అంటూ చెప్పుకొస్తున్నారు.
Read more:Andhra Pradesh:చింతమనేని చిరాకులేల

Related posts

Leave a Comment