Vijayawada:మార్చిలో జనసేన వర్సెస్ వైసీపీ: మార్చి సమీపిస్తోంది.. మరో 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. మార్చి 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. అదే సమయంలో జనసేన ప్లీనరీ సైతం జరగనుంది. దీంతో అంతటా పొలిటికల్ హీట్ ఉంటుంది ఈ నెలలో. ఇప్పుడిప్పుడే వేసవి ప్రారంభమైంది. రాజకీయ వేడి కూడా ఉంది.
మార్చిలో జనసేన వర్సెస్ వైసీపీ
విజయవాడ, ఫిబ్రవరి 17
మార్చి సమీపిస్తోంది.. మరో 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. మార్చి 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరగనుంది. అదే సమయంలో జనసేన ప్లీనరీ సైతం జరగనుంది. దీంతో అంతటా పొలిటికల్ హీట్ ఉంటుంది ఈ నెలలో. ఇప్పుడిప్పుడే వేసవి ప్రారంభమైంది. రాజకీయ వేడి కూడా ఉంది. ఇటువంటి తరుణంలో రెండు పార్టీలకు సంబంధించి కీలక కార్యక్రమాలు మార్చిలోనే ఉండడం విశేషం. దీంతో పోటా పూర్తిగా ప్రకటనలు ఉండనున్నాయి. అదే సమయంలో రాజకీయ విమర్శలు, వ్యూహాలు సైతం కొనసాగనున్నాయి. దీంతో మార్చిలో పొలిటికల్ హైట్ అండ్ సన్ వాతావరణం క్రియేట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అధికార, విపక్షాలకు సంబంధించి ఒకే రోజు కార్యక్రమాల నిర్వహణ ఉండడంతో తప్పకుండా రాజకీయ అంశాలు, సంచలనాలు ఉండనున్నాయి.జనసేన ప్లీనరీని మార్చి 12 నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. పిఠాపురంలో ప్లీనరీ నిర్వహిస్తుండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. లక్షలాదిమంది తరలి వస్తారని అంచనా వేస్తున్నారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత జనసేనకు ఈ ఎన్నికల్లో మంచి విజయం దక్కింది. కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉంది జనసేన.
అందుకే ఈ ప్లీనరీ జనసేనకు ప్రత్యేకం. ఇదే వేదికగా జనసేన సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అటు రాజకీయంగా కొన్ని రకాల నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.అయితే ఇదివరకు ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది వైయస్సార్ కాంగ్రెస్పార్టీ. 2012 మార్చి 12న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది. పుష్కర కాలం దాటి 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఆ పార్టీ. అయితే తొలి ఆరేళ్లు బలమైన ప్రతిపక్షంగా ఉంది వైయస్సార్ కాంగ్రెస్. గత ఐదు సంవత్సరాలుగా అధికారపక్షంగా ఉండేది. అయితే ఈ ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఆ పార్టీ పరిస్థితి మారింది. ఇప్పటివరకు ఒక లెక్క.. మొన్నటి ఎన్నికల తర్వాత మరో లెక్క అన్నట్టు ఉంది ఆ పార్టీ పరిస్థితి. చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఇది. అందుకే అధినేత జగన్మోహన్ రెడ్డి దూకుడుగా అడుగులు వేస్తున్నారు. ఈ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.ఉగాది నుంచి ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అదే సమయంలో పార్టీకి చెందిన కీలక నేతలు రాజీనామాలు ప్రకటిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లతో పాటు తటస్థ నేతలు వైసిపి వైపు వస్తున్నారు. ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు కీలక నిర్ణయాలు వెల్లడిస్తారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకోవైపు కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన సైతం.. ప్లీనరీ వేదికగా సంచలన ప్రకటనలు చేసే పరిస్థితి ఉంది. దీంతో సర్వత్రా దీనిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మార్చిలో పొలిటికల్ హీట్ కొనసాగే పరిస్థితి ఉంది. చూడాలి మరి ఎలాంటి పరిణామాలు జరగబోతాయో!
Read more:NOTA : నోటపై రానీ ఏకాభిప్రాయం…