Vallabhaneni Vamshi : వల్లభనేని వంశీ అరెస్ట్.

Vallabhaneni Vamshi

వల్లభనేని వంశీ అరెస్ట్.

విజయవాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్)
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై BNS సెక్షన్‌ 140(1), 308, 351(3), రెడ్‌ విత్‌ 3(5) కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు.. కిడ్నాప్‌, హత్యాయత్నం, బెదిరింపు కేసులు కూడా పెట్టారు. అటు వంశీ ఇంటికి నోటీసులు అంటించారు.  ఇదిలా ఉంటే.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కొద్దిరోజుల కిందట ఊహించని ట్విస్ట్‌ చోటు చేసుకుంది.గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్థన్‌.. కేసు వెనక్కు తీసుకుంటున్నట్లు అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్థన్‌ హఠాత్తుగా పిటిషన్‌ విత్‌డ్రా చేసుకోవడం ఇప్పటికే సంచలనమైంది. ఈ కేసులో ఇవాళ కోర్టులో విచారణ జరగబోతోంది. ఇదిలా ఉంటే.. ఇటు హైదరాబాద్‌లో వంశీని అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. ఇవాళ వంశీని అరెస్డు చేసింది వేరే కేసులో అనే తెలుస్తోంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసే అయితే.. ఈ నెల 20న వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ మీద తీర్పు రావాల్సి ఉంది..

GHMC : గ్రేటర్ లో బీజేపీ, బీఆర్ఎస్ ములాఖత్

Related posts

Leave a Comment