Maoists : మావోలపై ముప్పేట దాడి….

Maoists

మావోలపై ముప్పేట దాడి….

హైదరాబాద్ ఫిబ్రవరి 12, (న్యూస్ పల్స్)
వరుస ఎన్‌ కౌంటర్లు మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగులుతోంది. మావోయిస్టులకు పట్టున్న ఛత్తీస్ ఘడ్ కేంద్రంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. ఏరివేత లో భాగంగా ఎన్ కౌంటర్ లు నిత్యకృతయమయ్యాయి. ఒక ఎన్ కౌంటర్ మరువక ముందే మరో ఎన్ కౌంటర్ జరుగుతుంది. ఎన్ కౌంటర్ జరిగిన ప్రతిసారి పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందుతున్నారు. నిన్న ఆదివారం ఛత్తీస్ ఘడ్, మహరాష్ట్ర సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో కాల్పుల మోత మోగింది. పోలీస్ బలగాలు, మావోయిస్టుల తూటాలకు 31 మంది మావోయిస్టులు మృతి చెందగా. మృతుల్లో 11 మంది మహిళలు, 20 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటనలో తెలిపారు. పక్కా సంచారంతో పోలీస్ బలగాలు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతానికి చేరుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున మావోయిస్టులకు, పోలీస్ బలగాలకు మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. మావోయిస్టుల ఏరివేత లో భాగంగా DRG, STF తో పాటు కేంద్ర బలగాలు నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎదురు పడడంతో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నట్టు బస్తర్ ఐజీ తెలిపారు. ఈ ఎన్ ఎన్ కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారని, ఎన్‌ కౌంటర్ స్థలం నుండి AK 47, SLR, INSAS రైఫిల్, 303 ఆయుధాలతో పాటు మావోయిస్టులు తయారు చేసిన రాకెట్ లాంచర్, బిజిఎల్ లాంచర్ ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు బస్తర్ ఐజీ తెలిపారు.

ఫిబ్రవరి 1వ తేదీన ఛత్తీస్‌ ఘఢ్‌ బీజాపూర్ జిల్లాలోని గంగలూరు అటవీ ప్రాంతంలో పోలీస్ బలగాలకు, మావోయిస్టులకు జరిగిన జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనమిది మంది మావోయిస్టులు మృతి చెందారు.
మరో ఒకటి నిన్న ఫిబ్రవరి 9వ తేదీన ఛత్తీస్ ఘడ్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ భారీ సంఖ్యలో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు.
జనవరి నెలలో ఆరు ఎన్ కౌంటర్లు..
– జనవరి 29 న జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసా, సోమావా పోలీస్ స్టేషన్ పరిధి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటన స్థలం నుండి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ లు తెలిపారు.
– జనవరి 19 వ తేదీన ఒడిశా రాష్ట్ర సరిహద్దుల్లో పోలీస్ బలగాలకు, మావోయిస్టుల మధ్య మొదలైన ఎదురుకాల్పులు నాలుగు రోజుల పాటు కొనసాగాయి. ఈ ఎన్ ఎన్ కౌంటర్ లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ కీలక నేతను కోల్పోయింది. కేంద్రకమిటీ సభ్యులు, ఒడిశా రాష్ట్ర కార్యదర్శి చలపతి మృతి చెందారు.
– జనవరి 16 వ తేదీన ఛత్తీస్ ఘడ్, తెలంగాణ సరిహద్దుల్లోని పూజారి కాంకేర్ అటవీ ప్రాంతంలో పోలీస్ లకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు పోలీస్ లు వెల్లడించారు. 16 వ తేదీన నుండి 17 వ తేది రెండు రోజుల పాటు జరిగిన ఎన్ కౌంటర్ లో మోస్ట్ వాంటెడ్ గా ఉన్న తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ తప్పించుకున్నారు. ఈ ఎన్ ఎన్ కౌంటర్ రెండు రోజులకు మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. పూజారి కంకేర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 18 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు లేఖ లో పేర్కొన్నారు.
– జనవరి 12 వ తేదీన ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లా నేపనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రత దళాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీస్ తెలిపారు. ఘటన స్థలం నుండి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ లు వెల్లడించారు.

– జనవరి 5 వ తేదీన నారాయణపూర్, దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన లో ఒక జవాన్ మృతి చెందినట్లు పోలీస్ లు ప్రకటించారు.
2025 కొత్త సంవత్సరం ప్రారంభమైన మూడు రోజులకే 3 వ తేదీన ఒడిశా సరిహద్దుల్లో బలగాలకు, మావోల కు జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్లు గారియాబాద్ పోలీస్ లు వెల్లడించారు.
వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టుల ఏరివేత..
మావోయిస్టులు లేకుండా చేయడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు, ఆయా రాష్ట్ర పోలీసులు, మావోయిస్టుల ఏరివేతకు ఏర్పాటు చేసిన బలగాలు సెర్చ్ ఆపరేషన్‌ ను కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఛత్తీస్ ఘడ్ అటవీ ప్రాంతాన్ని పోలీస్ బలగాలు దండకారణ్యాన్ని జల్లడ పడుతున్నాయి. దీంతో మావోయిస్టు దళాలు ఎదురు పడడం లేదా పక్క సమాచారంతో బలగాలు మావోయిస్టులను మట్టుపెడుతున్నారు. ఈ సంవత్సరం 2025 జనవరి 3 తేదీన నుండి మొదలైన ఎన్ కౌంటర్లు వరుసగా కొనసాగుతున్నాయి.

Read : Andhra Pradesh:జగనన్న కాలనీలపై మళ్లీ సర్వే

Related posts

Leave a Comment