Visakhapatnam:టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలోదారి

Teacher is leading in MLC elections

Visakhapatnam:టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలోదారి: ఉమ్మ‌డి ఉత్త‌రాంధ్ర జిల్లాల (విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గం, శ్రీ‌కాకుళం) ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి.. రోజు రోజుకు పెరుగుతోంది. అయితే రాజ‌కీయ పార్టీలు డైరెక్ట్‌గా పోటీ చేయ‌టం లేదు. కానీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. అధికార టీడీపీ, బీజేపీలు అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌గా, వైసీపీ, జ‌న‌సేన మాత్రం ఇంకా ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. టీడీపీ, బీజేపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించడంతో.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ వేడి మొద‌లైంది.ఈ ఎన్నిక‌ల్లో కూట‌మి నేత‌ల మ‌ధ్య విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి.

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలోదారి

విశాఖపట్టణం, ఫిబ్రవరి 10
ఉమ్మ‌డి ఉత్త‌రాంధ్ర జిల్లాల (విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గం, శ్రీ‌కాకుళం) ఉపాధ్యాయ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి.. రోజు రోజుకు పెరుగుతోంది. అయితే రాజ‌కీయ పార్టీలు డైరెక్ట్‌గా పోటీ చేయ‌టం లేదు. కానీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. అధికార టీడీపీ, బీజేపీలు అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌గా, వైసీపీ, జ‌న‌సేన మాత్రం ఇంకా ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. టీడీపీ, బీజేపీ అభ్య‌ర్థుల‌కు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించడంతో.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయ వేడి మొద‌లైంది.ఈ ఎన్నిక‌ల్లో కూట‌మి నేత‌ల మ‌ధ్య విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. పార్టీల‌కు సంబంధం లేకుండా జ‌రిగే ఈ ఎన్నిక‌ల్లో.. టీడీపీ, బీజేపీ చెరో అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. దీంతో కూట‌మి శ్రేణుల్లో అయోమ‌యం నెల‌కొంది. ఏపీటీఎఫ్‌కు చెందిన పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి పాల్గొన్నారు. కూట‌మి పార్టీల‌న్నీ ర‌ఘువ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా ఉన్నాయ‌ని ఆయ‌న మీడియాకు తెలిపారు. ఆయ‌న‌ను గెలుపించ‌డానికి టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన శ్రేణులు కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు.టీడీపీ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ప్ర‌క‌ట‌న‌కు విరుద్ధంగా.. బీజేపీ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధ‌వ్ మ‌రో అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. పీఆర్‌టీయూకు చెందిన గాదె శ్రీ‌నివాసుల‌నాయుడుకు బీజేపీ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది. మాధ‌వ్ ఒక అడుగు ముందుకేసి.. ఉపాధ్యాయ సంఘాల నేత‌ల‌తో, ఉపాధ్యాయుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. త‌మ మ‌ద్ద‌తు గాదె శ్రీ‌నివాసుల‌నాయుడికే ఉంటుంద‌ని తేల్చి చెప్పారు. ఆయ‌న విజ‌యానికి ఉత్త‌రాంధ్ర‌లోని అన్ని జిల్లాల్లో స‌మావేశాలు నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు.పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మకు కూట‌మి పార్టీల‌ మ‌ద్ద‌తు ఉంద‌ని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ప్ర‌క‌టించ‌డాన్ని మాధవ్ ఖండించారు. దీనిపై కూట‌మి ప్ర‌భుత్వం ఎలాంటి ఆలోచ‌న చేయ‌లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దీంతో కూట‌మిలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు చిచ్చు పెట్టాయ‌ని ప‌లువురు అభిప్రాయ ప‌డుతున్నారు. టీడీపీ, బీజేపీ త‌లోదారి ఎంచుకోవ‌డంతో ఎటువైపు ఉండాలో తేల్చుకోలేని ప‌రిస్థితుల్లో జ‌న‌సేన ఉంద‌ని రాజ‌కీయ నేత‌లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.ప్ర‌తిప‌క్ష వైసీపీ ఎవ‌రికి మ‌ద్ద‌తు ఇస్తుందోన‌ని ఉత్కంఠ నెల‌కొంది. ఎందుకంటే ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీ ప్ర‌త్యక్షంగాని, ప‌రోక్షంగా ఏ అభ్య‌ర్థికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు. వైసీపీ ఎవ‌రికీ ప్ర‌త్య‌క్షంగా ప్ర‌క‌టించ‌క‌పోవ‌చ్చ‌ని ఆ పార్టీ వ‌ర్గాలు తెలిపాయి. ప‌రోక్షంగా ఎవ‌రికో ఒక‌రికి మ‌ద్ద‌తు ఇస్తుంద‌ని పేర్కొన్నాయి. దీంతో వైసీపీ, జ‌న‌సేన మ‌ద్ద‌తుపై త్వ‌ర‌లో ఒక స్ప‌ష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంది.ఉపాధ్యాయ సంఘాల మ‌ద్ద‌తుతో పీడీఎఫ్ అభ్య‌ర్థిగా కె.విజ‌య‌గౌరి పోటీ చేస్తున్నారు. ఆమెకు ఉపాధ్యాయ‌, లెక్చర‌ర్ సంఘాల నుంచి మ‌ద్ద‌తు ఉంది. గ‌త ఎన్నిక‌ల్లో పీడీఎఫ్ మ‌ద్ద‌తుతో పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ పోటీ చేసి గెలుపొందారు. ఈసారి పీడీఎఫ్ కె.విజ‌య‌గౌరిని బ‌రిలోకి దింపింది. ప్ర‌ధానంగా కె.విజ‌య‌గౌరి, పాక‌ల‌పాటి ర‌ఘువ‌ర్మ‌, గాదె శ్రీ‌నివాసుల నాయుడు మ‌ధ్యే పోటీ నెల‌కొంది.ఫిబ్ర‌వ‌రి 10తో నామినేష‌న్ల దాఖ‌ల‌కు గ‌డువు ముగియ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 11న నామినేష‌న్ల ప‌రిశీల‌న చేస్తారు. ఫిబ్ర‌వ‌రి 13 వ‌ర‌కు నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు గుడువు ఉంది. ఫిబ్ర‌వ‌రి 27 (గురువారం) ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ జ‌రుగుతుంది. మార్చి 3వ తేదీన ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌నుంది. దీంతో అభ్య‌ర్థులు భ‌విత‌వ్యం తేల‌నుంది.

Read more:Andhra Pradesh:కిరణ్ రాయల్ కు జనసేన షాక్

Related posts

Leave a Comment