Guntur:బరి తెగించిన ప్రైవేట్ వర్శిటీలు

Knock A Plus Grading

Guntur:బరి తెగించిన ప్రైవేట్ వర్శిటీలు:తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన కేఎల్‌ యూనివర్శిటీలో నాక్‌ ఏ ప్లస్‌ గ్రేడింగ్‌‌ కోసం ముడుపులు చెల్లించిన ఘటనలో సీబీఐకు దొరికి పోవడం కలకలం రేపింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సరిగ్గా అడ్మిషన్లు మొదలయ్యే సమయానికి జరిగిన వ్యవహారం వెనుక ఏమి జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఏపీలో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటైన కేఎల్‌ఈ తర్వాత కాలంలో డీమ్డ్‌ వర్శిటీగా ఎదిగింది.విజయవాడకు దగ్గర్లో గుంటూరు జిల్లా వడ్డే శ్వరంలో ఉన్న కేఎల్ డీమ్డ్‌ విశ్వ విద్యాలయంలో యూజీసీ న్యాక్ తనిఖీలు గత నెలాఖర్లో జరిగాయి.

బరి తెగించిన ప్రైవేట్ వర్శిటీలు

గుంటూరు, ఫిబ్రవరి 4,
తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన కేఎల్‌ యూనివర్శిటీలో నాక్‌ ఏ ప్లస్‌ గ్రేడింగ్‌‌ కోసం ముడుపులు చెల్లించిన ఘటనలో సీబీఐకు దొరికి పోవడం కలకలం రేపింది. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలో సరిగ్గా అడ్మిషన్లు మొదలయ్యే సమయానికి జరిగిన వ్యవహారం వెనుక ఏమి జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి ఏపీలో ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒకటైన కేఎల్‌ఈ తర్వాత కాలంలో డీమ్డ్‌ వర్శిటీగా ఎదిగింది.విజయవాడకు దగ్గర్లో గుంటూరు జిల్లా వడ్డే శ్వరంలో ఉన్న కేఎల్ డీమ్డ్‌ విశ్వ విద్యాలయంలో యూజీసీ న్యాక్ తనిఖీలు గత నెలాఖర్లో జరిగాయి. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్ తనిఖీలు నిర్వహించి యూనివర్శిటీకి గ్రేడింగ్‌ ఇవ్వాల్సి ఉంటుంది.ఐదేళ్ల పాటు ఈ గ్రేడింగ్‌ చెల్లుబాటులో ఉంటుంది. నాక్‌ గ్రేడింగ్‌ ఆధారంగా విద్యా సంస్థల్లో విద్యార్థులు అడ్మిషన్లు ఉంటాయి. ఈ క్రమంలో యూజీసీ తనిఖీల కోసం పంపించే నాక్‌ కమిటీలో తమకు అనుకూ లమైన ప్రొఫెసర్లే సభ్యులుగా ఉండటంతో పాటు యూనివర్శిటీకి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు ప్రయత్నాలు చేశారు.దాదాపు నెల రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహారంపై సీబీఐ మొదటి నుంచి దృష్టి సారించింది. కాలేజీలో సిబ్బందిలో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో సీబీఐకు పక్కా సమాచారం ఎప్పటికప్పుడు అందినట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఏటా నాలుగువేల మందికి పైగా కేఎల్‌ యూనివర్శిటీలో అడ్మిషన్లు పొందుతున్నారు. ప్రైవేట్‌ డీమ్డ్ ‍యూనివర్శిటీలు యూజీసీ గ్రేడింగ్‌లు, రేటింగ్‌లను ప్రతిష్టాత్మకంగా భావిస్తుంటాయి. ఏపీలో ఇటీవల పెద్ద సంఖ్యలో ప్రైవేట్‌ ఇంజనీరింగ్ కాలేజీలు డీమ్డ్‌ యూనివర్శిటీలు, ప్రైవేట్ యూనివర్శిటీలుగా ఏర్పాటవుతున్నాయిప్రైవేట్‌/ డీమ్డ్‌ యూనివర్శిటీల నిర్వహణ మొత్తం అయా సంస్థల పర్యవేక్షణలోనే ఉంటుంది. అనుమతులు మాత్రం యూజీసీ, ఏఐసీటీఈ వంటి ప్రభుత్వ సంస్థల నుంచి పొందాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం, యూజీసీలు జారీ చేసే రేటింగులను ప్రైవేట్ కాలేజీలు ప్రతిష్టాత్మకంగా భావించి అడ్డదారిలో వాటిని పొందడం రివాజుగా మారింది. దాదాపు అన్ని ప్రైవేట్ యూనివర్శిటీలు ఇదే బాటలో గ్రేడింగులు, నాక్‌ రేటింగులను తెచ్చుకోవడం పరిపాటిగా మారింది.ప్రైవేట్ యూనివర్శిటీల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరుతో పాటు, అంతర్గత కుమ్ములాట నేపథ్యంలో నాక్‌ కమిటీల పర్యటనలపై సీబీఐకు పక్కా ఆధారాలతో ఫిర్యాదులు అందాయి.

దీంతో ఈ వ్యవహారంలో మొదటి నుంచి కన్నేసి ఉంచిన సీబీఐ పక్కా ఆధారాలు సేకరించి నాక్ తనిఖీలు జరిగే సమయంలో దాడులు చేసి గంటల వ్యవధిలో నిందితుల్ని రిమాండ్‌కు పంపింది.నాక్‌ కమిటీలో తమకు అనుకూలంగా నివేదిక ఇచ్చే వారు వచ్చేలా కేఎల్‌ వర్సిటీ యాజమాన్యం ముందుగానే వారితో కుమ్మక్కైంది. ఇందుకు యూజీసీ ప్రతినిధులతో ముందుగానే చర్చలు జరిపినట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. ఈ కేసులో కేఎల్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్ ఛైర్మన్‌‌‌తో పాటు డైరెక్టర్లు, న్యాక్ బృందంలో సభ్యులుగా ఉన్న వారిలో 10 మందిని సీబీఐ అరెస్ట్‌ చేసింది. వారిని ఆదివారం తెల్లవారుజామున విజయవాడలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం నిందితులకు 14 రోజులపాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో వారిని విజయవాడ కోర్టుకు తరలించారు.కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (కేఎల్ ఎఫ్)ఛైర్మన్‌ కోనేరు సత్యనారాయణ, వైస్ ఛాన్సలర్‌ జీపీ సారథి వర్మలు.. న్యాక్ డైరెక్టర్ ఎం. హనుమంతప్పు, న్యాక్‌ మాజీ సలహాదారు ఎల్. మంజునాధరావు, సలహాదారు ఎం.ఎస్. శ్యామసుందర్‌లతో కలిసి కుట్రకు పాల్పడినట్టు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ పేర్కొంది. వారి ద్వారా సమాచారం తెలుసుకుని తమకు అనుకూలంగా ఉండే వారిని న్యాక్ తనిఖీ బృందంలో సభ్యులుగా చేర్పించుకున్నారు.జనవరి 18, 19 తేదీల్లో హనుమంతప్ప, మంజునాథరావులు విజయ వాడ రాగా, వారికి కోనేరు సత్యనారాయణ, జీపీ సారథి వర్మలు రూ.10 లక్షలు లంచంగా ఇచ్చారు. అందులో రూ.5 లక్షలు ఎం.ఎస్.శ్యామ్ సుందర్‌ వాటాగా ఇచ్చారు. మిగతా రూ.5 లక్షలు హనుమంతప్ప, మంజునాథరావులు తీసుకున్నారు.వారు ఇచ్చిన సమాచారంతో వర్శిటీ వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్, హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఎ. రామకృష్ణలు గత నెల 25న ఢిల్లీలో న్యాక్ తనిఖీ బృందం సభ్య సమన్వ యకర్త రాజీవ్ సిజారియాను ఢిల్లీలో కలుసుకున్నారు. న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడింగ్‌ కోసం రూ.1.80 కోట్ల లంచం ఇవ్వాలని సిజారియా డిమాండ్ చేశారు. పలు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం నివేదికను సమర్పించే సమన్వయకర్తకు అదనపు మొత్తం చెల్లించడంతో పాటు ఒక్కో సభ్యుడికి రూ.3 లక్షలు, ఒక ల్యాప్‌ ట్యాప్ చెల్లించేందుకు అంగీకరించారు. కమిటీ చైర్మన్ సమరేంద్రనాథ్ సాహు, రాజీవ్ సిజారియాలకు రూ.10 లక్షలు చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. వివిధ మార్గాల ద్వారా లంచం సొమ్ము ముట్టజెప్పారు.తనిఖీల సమయంలో విజయవాడ న్యాక్‌ సమన్వయకర్త రాజీవ్ సిజారియా మరో రూ.60 లక్షలు డిమాండు చేశారు. దీంతో మరో రూ.15 లక్షలు చెల్లించారు. కమిటీ చైర్మన్ సమరేంద్రనాథ్ సాహు లంచం సొమ్ములో 75 శాతాన్ని బంగారం రూపంలో ఇవ్వాలని అడగ్గా వాటిని అలా మార్చి చెల్లించినట్టు పేర్కొన్నారు.సీబీఐ తనిఖీలు, అరెస్టుల నేపథ్యంలో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకే షన్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ శనివారం రాత్రి అనారో గ్యంతో విజయవాడ సూర్యారావుపేటలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు.

Related posts

Leave a Comment