లావణ్య త్రిపాఠి కొత్త సినిమా ముచ్చట్లు: Lavanya Tripathi new movie:రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు హీరోయిన్ లావణ్యా త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొత్త సినిమా సోమవారం నాడు ప్రారంభమైంది. వరుణ్ తేజ్‌తో పెళ్లి తరువాత లావణ్య త్రిపాఠి సినిమాలు కాస్త తగ్గించేసింది. తన పర్సనల్ లైఫ్‌కే టైం కేటాయించింది. ఇక ఇప్పుడు లావణ్య మళ్లీ సినిమాల మీద దృష్టి కేంద్రీకరించినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి తరువాత ఓకే చేసిన ప్రాజెక్ట్ సతీ లీలావతి. ఈ మూవీని నేడు లాంఛనంగా ప్రారంభించారు.
లావణ్య త్రిపాఠి కొత్త సినిమా
రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించనున్నారు హీరోయిన్ లావణ్యా త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో నటించనున్న కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించారు మేకర్స్. మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొత్త సినిమా సోమవారం నాడు ప్రారంభమైంది. వరుణ్ తేజ్‌తో పెళ్లి తరువాత లావణ్య త్రిపాఠి సినిమాలు కాస్త తగ్గించేసింది. తన పర్సనల్ లైఫ్‌కే టైం కేటాయించింది. ఇక ఇప్పుడు లావణ్య మళ్లీ సినిమాల మీద దృష్టి కేంద్రీకరించినట్టుగా కనిపిస్తోంది. పెళ్లి తరువాత ఓకే చేసిన ప్రాజెక్ట్ సతీ లీలావతి. ఈ మూవీని నేడు లాంఛనంగా ప్రారంభించారు. సోమవారం నాడు ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలో హీరో దేవ్ మోహన్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెరిశారు. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో ఈ మూవీని దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) చిత్రాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న తాతినేని సత్య ఈ సతీ లీలావతి మూవీని తెరకెక్కిస్తున్నాడు.
సోమవారం ఉదయం ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి వరుణ్ తేజ్, చిత్ర సమర్పకులు జెమినీ కిరణ్, నిర్మాతలు హరీష్ పెద్ది, వి.ఆనంద ప్రసాద్, అన్నే రవి, డైరెక్టర్ తాతినేని సత్య తండ్రి, సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ వంటి వారంతా హాజరయ్యారు. ఇక ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత హరీష్ పెద్ది క్లాప్ కొట్టగా.. వరుణ్ తేజ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సీనియర్ డైరెక్టర్ టి.ఎల్.వి.ప్రసాద్ గౌరవ దర్శకత్వం వహించారు.
పూజా కార్యక్రమాల అనంతరం దర్శకుడు తాతినేని సత్య మాట్లాడుతూ.. ఆహ్లాదాన్ని కలిగించే చక్కటి ఎంటర్టైనర్గా ‘సతీ లీలావతి’ రూపొందుతుందని అన్నాడు. మనస్ఫూర్తిగా నవ్వుకునే రొమాంటిక్ డ్రామాగా ఉంటుందని, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని తెలిపాడు. లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ జోడీ అందరినీ మెప్పిస్తుందని అన్నాడు.
చిత్ర నిర్మాతలు నాగమోహన్ బాబు.ఎమ్, రాజేష్.టి మాట్లాడుతూ.. తమ జర్నీలో సపోర్ట్ చేస్తున్న ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అధినేత కిరణ్‌గారికి ధన్యవాదాలు తెలిపారు. తమ ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన వరుణ్ తేజ్‌కు, ఇతరులకు థాంక్స్ చెప్పారు. సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ఈరోజు నుంచే ప్రారంభిస్తున్నామని, త్వరలోనే ఇతర అప్డేట్లు ఇస్తామని అన్నారు.
లావణ్య త్రిపాఠి ఓటీటీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.‘పులి మేక’ పేరుతో రూపొందిన వెబ్ సిరీస్ లో లావణ్య ఓ పోలీసాఫీసర్ గా కనిపిస్తారు. డిస్నీ హాట్ స్టార్ లో ప్రసారమైన ‘మిస్ పర్ఫెక్ట్’ లోనూ మెయిన్ రోల్ చేశారు లావణ్య. అయితే వెబ్ సిరీస్ లు ఆమెకు ఆశించినంత విజయం ఇవ్వలేకపోయాయి. తమిళంలో ఇప్పటి వరకూ రెండు సినిమాలు చేశారు లావణ్య. తాజాగా మరో సినిమాకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రవీంద్ర మాధవ దర్శకత్వంలో అధర్వ మురళి హీరోగా తెరకెక్కుతోన్న ‘తనళ్’ అనే యాక్షన్ థ్రిల్లర్ లో లావణ్యా త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.
‘మత్తు వదలరా’ ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. 2023లో హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత ఆమె మళ్లీ వెండితెరపై కనిపించలేదు. మరో హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి ఓకే చెప్పారు లావణ్యా త్రిపాఠి.
గతంలో దర్శకుడు తాతినేని సత్య నాని హీరోగా తమిళ, తెలుగు భాషల్లో ‘భీమిలీ కబడ్డీ జట్టు’ అనే సినిమా తీశారు. ఆ సినిమా నటుడిగా నానికి మంచి పేరు తీసుకొచ్చింది. నాని ఫ్యాన్సకు గుర్తుండిపోయే సినిమా ఇది. ఈ సినిమా తర్వాతే నానికి ‘అలా మొదలైంది’ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమా హిట్ కావడంతో నానికి హీరోగా మార్కెట్ కూడా పెరిగింది. అనంతరం హీరో సుధీర్ బాబు డెబ్యూ మూవీ ‘ఎస్.ఎం.ఎస్’ (శివ మనసులో శృతి)’కి దర్శకత్వం వహించారు తాతినేని సత్య. అనంతరం ‘శంకర’, వీడెవడు’ సినిమాలు తీశారు. కొంత కాలం గ్యాప్ తర్వాత దర్శకుడు తాతినేని సత్య తీస్తున్న సినిమానే ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకంపై నాగమోహన్ బాబు. ఎమ్, రాజేష్ .టి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డిసెంబర్ 15న (ఆదివారం) హీరోయిన్ లావణ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేసింది సినిమా యూనిట్. మిక్కీ జే మేయర్ స్వరాలు అందించనున్న ఈ మూవీకి బినేంద్ర మీనన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నారు. ఉదయ్ పొట్టిపాడు మాటలు అందిస్తున్నారు.