అమెజాన్ కంపెనీ సరకు రవాణాలో వేయని ట్రిప్పులకు చెల్లింపులు జరిపి ఏకంగా రూ.102కోట్లు కొట్టేశారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ మోసంలో సంస్థ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సరకు రవాణా పర్యవేక్షణ హైదరాబాద్ నుంచి జరుగుతుండటంతో కుట్ర పూరితంగా మోసం చేశారు.: పనిచేస్తున్న సంస్థకు ఉద్యోగులు టోకరా వేయడంతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. అందులో పనిచేసే ఉద్యోగులే హైదరాబాద్ కేంద్రంగా భారీ మోసానికి పాల్పడ్డారు.
ఆమెజాన్ లో ఇంటి దొంగలు..
హైదరాబాద్, జనవరి 29
అమెజాన్ కంపెనీ సరకు రవాణాలో వేయని ట్రిప్పులకు చెల్లింపులు జరిపి ఏకంగా రూ.102కోట్లు కొట్టేశారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఈ మోసంలో సంస్థ ఉద్యోగులు కీలక పాత్ర పోషించారు. ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సరకు రవాణా పర్యవేక్షణ హైదరాబాద్ నుంచి జరుగుతుండటంతో కుట్ర పూరితంగా మోసం చేశారు.: పనిచేస్తున్న సంస్థకు ఉద్యోగులు టోకరా వేయడంతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. అందులో పనిచేసే ఉద్యోగులే హైదరాబాద్ కేంద్రంగా భారీ మోసానికి పాల్పడ్డారు. నకిలీ ట్రిప్పులతో డెలివరీ చేసే వారికి చెల్లించే కమిషన్ పేరిట భారీగా సొమ్ము చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగాఈ మోసం జరగడంతో పోలీస్ కేసు నమోదు అయ్యింది. అమెజాన్ కాల్ సెంటర్‌లో పనిచేసే ఉద్యో గులు, గతంలో పనిచేసి మానేసిన వారు.. అమెరికాలో సరకులు సరఫరా చేసే వారితో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్టు అమెజాన్ సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ మోసంతో అమెజాన్‌కు దాదాపు రూ.102 కోట్ల నష్టం వాటిల్లినట్టు సైబర్ సెక్యూ రిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలుపెట్టారు.ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ సంస్థ ఈ కామర్స్ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సరకుల డెలివరీ వ్యాపారంలో అగ్రస్థానంలో ఉంది. ఈ క్రమంలో కస్టమర్లకు అవసరమైన సాంకేతిక సాయం మొత్తం హైదరాబాద్ నుంచి అందుతుంది.కస్టమర్ అమెజాన్ అప్లికేషన్‌లో కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత.. దానిని సమీపంలోని షిప్పింగ్ సెంటర్‌కు పంపిస్తారు. అక్కడి నుంచి వినియోగదారుడు ఉన్న ప్రాంతంలోని కేంద్రానికి వెళుతుంది. స్థానిక షిప్పింగ్ సెంటర్ నుంచి వినియోగదారుడి చిరునామాకు ఏజెంట్ల ద్వారా డెలివరీ చేస్తారు. ఇదంతా పూర్తిగా సాంకేతికతతో నడుస్తుంది.కస్టమర్ ఆర్డర్ చేసిన సరకు ఎక్కడుందనే విషయం ఎప్పటికప్పుడు అమెజాన్ కార్యాలయంలో ట్రాక్ అవుతుంది. బార్ కోడ్‌లను స్కాన్ చేయగానే ఈ సరుకు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనే స్పష్టత వచ్చేస్తుంది. కస్టమర్‌కు డెలివరీ ఇచ్చే వారి ఫోన్లలో ప్రత్యేక యాప్ ఉంటుంది.
డెలివరీ కోసం స్థానిక షిప్పింగ్ సెంటర్ నుంచి వస్తువులను తీసుకున్న తర్వాత చెక్-ఇన్ చేస్తారు.ఆర్డర్లను వినియోగదారుడికి అందజేసిన తర్వాత చెక్-వుట్ చేస్తారు. డెలవరీ చేసే వారి జీపీఎస్‌ను ఎప్పటికప్పుడు అమెజాన్ ట్రాక్ చేస్తుంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా |అమెజాన్ డెలివరీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుంటారు. ఇది అమెజాన్ కమ్యూనికేషన్ రిలే కేంద్రంగా వ్యవహరిస్తుంది.సరకు డెలివరీ చేసే ఒక్కో వ్యక్తికి అదే రూట్లో ఉండే ఆర్డర్లను డెలివరీ చేయడానికి వస్తువులను అందిస్తారు. డెలివరీ సాధారణంగా కమిషన్ రూపేణా చెల్లిస్తారు. స్థానికంగా ఏజెన్సీలను నియమించుకుంటారు. డెలివరీ కోసం వెళ్లినపుడు కస్టమర్ స్పందించకపోయినా, అందుబాటులో లేకపోయినా, వివిధ కారణాలతో వస్తువులను తీసుకోడానికి నిరాకరించినా ఆ విషయం యాప్‌లో నమోదు చేస్తారు. దీనిని హైదరాబాద్‌లో కమ్యూనికేషన్ సెంటర్ ధృవీకరించాల్సి ఉంటుంది.కస్టమర్ ఆర్డర్ చేసిన వస్తువులను డెలివరీ చేయడానికి ఎంత దూరం ప్రయాణించారో లెక్కించి అందుకైన ఖర్చును డెలివరీ సంస్థలకు అమెజాన్ చెల్లిస్తుంది. ఇక్కడే ఉద్యోగులు, ఏజెన్సీలు మోసానికి పాల్పడ్డాయి. హైదరాబాద్‌లో రిలే కమ్యూనికేషన్ సెంటర్ ఉద్యోగులను ప్రలోభ పెట్టారు. గతంలో అమెజాన్‌లో పనిచేసి మానేసిన వారు దీనికి సూత్రధారులుగా వ్యవహరించారు. అమెరికాలో సరకుల డెలివరీకి వెళ్లకుండానే వెళ్లినట్లు నకిలీ ట్రిప్పులు నమోదు చేయించడం, ఆ తర్వాత వినియోగదారులు లేరని చెబుతూ వారికి కమిషన్లు చెల్లించారు.ఇలా కొంత కాలంగా ట్రాన్స్‌పోర్ట్ కమిషన్ల రూపంలో రూ.102.88 కోట్లను స్వాహా చేశారు. అమెజాన్ ఇంటర్నల్ ఆడిట్‌లో పెద్ద ఎత్తున ఇలాంటి లావాదేవీలు గుర్తించి ఆరా తీయడంతో అవన్నీ నకిలీగా తేలింది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అమెజాన్ ప్రతినిధి జీఎస్ అర్జున్ కుమార్ ఫిర్యాదు చేశారు.అమెజాన్ ఫిర్యాదు మేరకు మహ్మద్ అబ్దుల్ పహీమ్, కె అనిల్ కుమార్. ఆకాంక్షా పట్నాయక్, అవినాష్ కరి, కునాల్ కౌశిక్ దేవళ‌్ల, మహ్మద్ రిజావుల్లా, ఎండీ షాబాద్ అలీబాన్, ఎండీ. షోయబుద్దీన్, మహ్మద్ ముపాసిల్, షేక్ ఫర్ద్వాన్, దువ్వాడ శివగణేశ్, బుడ్డి శివకుమార్ రాజ్, అబిలాష్, అజయ్ కుమార్, దాశరథి, హృదయ్ కుమార్, కొడారి తులసీరాజ్, పృథ్వీరెడ్డి చింతారెడ్డి, మహ్మద్ రహేల్, లోహిత్ మద్దాబత్తుల, మహ్మద్ ఆదిల్, సాయికుమార్, కమతం శివభారత్ కృష్ణలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..