Hyderabad:ఢిల్లీకి బిల్లుల ఫిర్యాదులు

CM-Revanth

అసలే కాంగ్రెస్‌ పార్టీ. అందరూ సీఎం క్యాండిడేట్లే. అధికారం ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా ఎవరి దారి వాళ్లదే. హస్తం పార్టీలో ఇదంతా కామన్. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉండటంతో ప్రతీ ఇష్యూ పెద్దగా కనిపిస్తోందట.

ఢిల్లీకి బిల్లుల ఫిర్యాదులు

హైదరాబాద్, జనవరి 20
అసలే కాంగ్రెస్‌ పార్టీ. అందరూ సీఎం క్యాండిడేట్లే. అధికారం ఉన్నా..అపోజిషన్‌లో ఉన్నా ఎవరి దారి వాళ్లదే. హస్తం పార్టీలో ఇదంతా కామన్. కాకపోతే ఇప్పుడు అధికారంలో ఉండటంతో ప్రతీ ఇష్యూ పెద్దగా కనిపిస్తోందట. అయితే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా అని చెప్పుకునే ప్రభుత్వ, పార్టీ పెద్దలు..తెలంగాణ క్యాబినెట్‌లో మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందంటూ ప‌దే ప‌దే స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అయితే తమ పరిస్థితి ఏ మాత్రం బాలేదంటున్నారట కొందరు అమాత్యులు.ప్రధానంగా త‌మ శాఖ‌ల ద్వారా ఎమ‌ర్జెన్సీగా చేసే ప‌నుల‌కు కూడా బిల్లులు క్లియ‌ర్ కావ‌డం లేద‌ంటూ గగ్గోలు పెడుతున్నారు. దీంతో శాఖ‌ల రివ్యూలు చేసిన‌ప్పుడు మంత్రులకు ఇదే పెద్ద సమస్యగా మారుతోంద‌ట‌. ఈ విష‌యాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినా..ఆర్థిక‌శాఖ మంత్రికి స్వేచ్చ ఉంది..ఆయ‌న్నే అడ‌గాలంటూ స‌మాధానం దాటవేస్తున్నార‌ట‌. దీంతో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి లాగా తయారైందట. ఖజానాలో నిధులు లేక ఎవరికి బిల్లులు ఇస్తే ఏమవుతుందోనని ఆందోళనలో ఆర్థిక శాఖ అధికారులు డైలమాలో ఉన్నారట.ఏఐసీసీ ఆఫీస్‌ ఓపెనింగ్ సంద‌ర్భంగా హ‌స్తిన వెళ్లిన నేత‌లు నేరుగా పార్టీ పెద్దల దగ్గర పంచాయితీ పెట్టార‌ట‌. ఏఐసీసీ జ‌న‌ర‌ల్ సెక్రట‌రీ కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా సమావేశమైన తెలంగాణ మంత్రులు, ముఖ్యనేత‌లు..బిల్లులు పెండింగ్‌లో ఉండటంపై వివరించారట. ప్రభుత్వంలో కొన్ని శాఖ‌ల‌ బిల్లులు క్లియ‌ర్ అవుతున్నప్పటికీ..మిగిలిన శాఖల్లో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఫిర్యాదు చేశార‌ట‌ మంత్రులు. బిల్లుల చెల్లింపు ఆలస్యంతో తాము ఫేస్‌ చేస్తున్న సమస్యలపై కేసీ వేణుగోపాల్‌తో మొర పెట్టుకున్నారట.తెలంగాణ‌ మంత్రులకు ఎదురైన ప‌రిస్థితి గ‌తంలో క‌ర్నాట‌క స‌ర్కారులో కూడా వచ్చిందట. అక్కడ కూడా కొన్ని శాఖ‌ల‌కు సంబంధించిన బిల్లులు క్లియ‌ర్ చేసి..మిగ‌తా శాఖ‌ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారట. ఆ రాష్ట్ర మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అక్కడ మ‌ధ్యేమార్గంగా ప్రతీశాఖ‌కు ప్రతీ నెల కొంత అమౌంట్ రిలీజ్ చేయాల‌ని..ఆయా శాఖ‌ల బిల్లులు సంబంధిత మంత్రుల ఆమోదంతోనే క్లియర్‌ చేయాల‌నే కండీష‌న్ తీసుకొచ్చార‌ట‌. సేమ్ అలాంటి విధానాన్ని తెలంగాణ‌లో తీసుకురావాల‌ని ..మంత్రుల‌కు బిల్లులు రిలీజ్ చేయాల‌ని సూచించారట కేసీ వేణుగోపాల్. బిల్లుల కోసం అధిష్టానం పెద్దకు మొర పెట్టుకున్న తెలంగాణ మంత్రులు కష్టాలు ఎంతవరకు పరిష్కారం అవుతాయో చూడాలి మరి.

Read:Hyderabad:కేటీఆర్ ను సన్నిహితులే..బుక్ చేశారా

Related posts

Leave a Comment