New York:ట్రంప్ ప్రమాణంలో హౌడీ మోడీ ట్రూప్

donald-trumps-inauguration

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్..మంగళవారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష ప్రారంభోత్సవం కార్యక్రమంలో క్యాపిటల్ హిల్ వెస్ట్ ఫ్రంట్ నుంచి వైట్‌ హౌస్‌ వరకు ఇనాగరేషన్‌ పరేడ్‌ జరగనుంది.

ట్రంప్ ప్రమాణంలో హౌడీ మోడీ ట్రూప్

న్యూయార్క్, జనవరి 20
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్..మంగళవారం రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే. అధ్యక్ష ప్రారంభోత్సవం కార్యక్రమంలో క్యాపిటల్ హిల్ వెస్ట్ ఫ్రంట్ నుంచి వైట్‌ హౌస్‌ వరకు ఇనాగరేషన్‌ పరేడ్‌ జరగనుంది. ఈసారి అమెరికాలో ప్రమాదకర స్థాయిలో వీస్తున్న శీతల ఉష్ణోగ్రతల కారణంగా వాషింగ్టన్ మెట్రోపై ఇండోర్ స్టేడియంలో ఈ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో టెక్సాస్‌కు చెందిన ఇండో-అమెరికన్‌ సంతతికి చెందిన 30 మంది పురుషులు, మహిళలు కలిగిన ‘శివం ధోల్ టాషా గ్రూప్’ ప్రదర్శన ఇవ్వనుంది. టెక్సాస్‌కు చెందిన పెర్కషన్ గ్రూప్ ఇది. దీనిని కోట్లాది మంది వీక్షించనున్నారు. అమెరికాలో హై-ఎనర్జీ భారతీయ సాంప్రదాయ డ్రమ్ బృందం ఇంత గొప్ప వేదికపై ప్రదర్శించడం ఇదే మొదటిసారి.
శివమ్ ధోల్ తాషా పాఠక్ సాంప్రదాయ మతపరమైన కార్యక్రమాలకు అతీతంగా ప్రదర్శనలు ఇస్తుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల ఇది ఖ్యాతిని పొందింది. ధోల్ తాషా డైనమిక్ మ్యూజిక్‌ని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పరిచయం చేసింది. గతంలో ఆఫ్రికన్, జపనీస్ పెర్కషనిస్ట్‌లతో సహకారం, NBA – NHL గేమ్‌ల కోసం హాఫ్‌టైమ్ షోలు, హౌడీ మోడీ ఈవెంట్, ICC T20 వరల్డ్ కప్ ప్రారంభ వేడుకలకు ప్రదర్శనలు ఇచ్చింది. భారత్‌ – యుఎస్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అద్దంపట్టేలా 2019లో హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోడీ ఈవెంట్‌లో ఈ బృందం కూడా ప్రదర్శన ఇచ్చింది. మోడీ, ట్రంప్‌లు అరేనాలోకి ప్రవేశించినప్పుడు ఈ బృందం అద్భుతమైన స్వాగతం పలికింది. ఇప్పుడు మళ్లీ ట్రంప్‌ ప్రమాణ స్వీకారానికి ఈ ట్రూప్‌కి ఆహ్వానం అందింది. శివమ్ ధోల్ తాషా గ్రూప్ సభ్యులు తెల్లటి కుర్తాలు, పసుపు రంగు నెహ్రూ జాకెట్లు, సాఫాలు (తలపాగాలు) ధరించి వివిధ డ్రమ్ములతో ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ రోజు జరిగే పరేడ్‌లో.. US ఆర్మీ, మెరైన్స్, నేవీ, ఎయిర్‌ఫోర్స్, US కోస్ట్ గార్డ్ ప్లాటూన్‌ల వెనుక నడుస్తూ ఈ బృందం ప్రదర్శనలు ఇవ్వనుంది. ఇది ప్రధాన ప్రారంభోత్సవం తర్వాత ప్రారంభమవుతుంది.

Read:Hyderabad:టీజీఆర్టీసీకి సంక్రాంతి బొనంజా

Related posts

Leave a Comment